తెలంగాణ కత కోసం

 

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

 

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో ఉన్నాం. ఇన్నాళ్లు ఆధిపత్య భావజాలం గల ఆంధ్రప్రాంత రచయితలతో పోటీలో అనేక అవమానాలు, వివక్ష, విస్మరణ, అణచివేత ఎదుర్కొంటూ వచ్చాం. ఇవాళ మన రాష్ట్రం వేరు, మన కథ వేరు. ఈ శుభ సందర్బంలో మన జీవితాలు, మన సంస్క ృతి, మన సమస్యలు, మన జీవద్భాషలో రాసుకున్న కథల్ని కళ్ళకద్దుకుంటూ సంకలనాలుగా తీసుకురావాల్సిన సమయమిది. అందుకు ప్రతి ఏటా కథవార్షిక వెలువరించాలని నిర్ణయించాం.

ఇందుకోసం ఏ యేడుకి ఆ యేడు పత్రికల్లో అచ్చయిన కథలతో పాటు అచ్చుకు నిరాకరించిన కథలను సైతం పరిశీలించి ప్రచురించాలనేది లక్ష్యం. ప్రతి ఏడాది జనవరి పది లోపు మాకు ఈ కథలు అందాల్సి ఉంటుంది. ఈ సారి తెలంగాణ కత -2013కి గాను అక్టోబర్‌ 31 లోగ కతలు పంపగలరు. ఈ సంకలనాలకు సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ సంపాదకులుగా వ్యవహరిస్తారు.

క్రమం తప్పకుండా ఈ సంకలనాలను ప్రచురించడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను సమకూర్చేందుకు మిత్రులు అల్లం కృష్ణచైతన్య ముందుకొచ్చారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.

 

కతలు పంపాల్సిన చిరునామా:

స్కైబాబ,

402, ఝాన్సీ రెసిడెన్సీ, ప్లాట్‌ నెం. 30 హెచ్‌.ఐ.జి. హుడా కాలనీ,

తానాషా నగర్‌, మణికొండ గ్రామం, హైదరాబాద్‌ `89, తెలంగాణ.

లేదా

ఈ మెయిల్‌ : sangishettysrinivas@gmail.com

మీ మాటలు

 1. హ్మ్ … అంటే రాష్ట్రానికి ఒకే ఒక కథా వార్షిక వుండాలనేది రాజ్యాంగంలో వుందా ఏమిటి? వుమ్మడి రాష్ట్రంలోనూ ఈ తెలంగాణా కతా వార్షిక వుండి వుండ కూడదా?
  ఈ పని చేయడానికి ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ ఆగారా?

  (మీరే కత అని కథ అనీ తికమక పడితే ఎలా? అన్ని చోట్లా అదో ఇదో ఒకటే వాడండి ప్లీజ్!)

  • నాగారం డి ప్రకాశ్ says:

   కథ అన్నా కత అన్నా ఒకటే రెండు వాడినా … తప్పు లేదు . ప్రామాణిక బాష నుండి బయటికి రావడానికి సమయం చాలా పడుతుంది . అప్పుడే తప్పులు తీస్తే ఎలా . విషయం అర్థమైంది . సంస్కృతం ,ప్రాకృతం లాగా రెండు వాడదాం .

 2. నాగారం డి ప్రకాశ్ says:

  మీ ప్రయత్నం బాగుంది మాకు అవకాశం యిస్తే కత (కథ ) పంపుతాము .

 3. buchireddy gangula says:

  తెలుగు భాష కు Andhra — తెలంగాణా అని —raasukovadam– మాట్లాడుకోవడం

  మంచిది కాదను కుంటా —నా అబి ప్రాయం —-ఏదో పని కలిపించుకోవాలని —

  గిచ్చి కయ్యానికి —-సాహితీ లోకం లో —-కలకలం లేపడం మనస్సులు నొప్పించడం దేనికి — ప్రచురించిన కథల

  ను —తిరిగి పుస్తకం లో వేయడం —???శ్రీనివాస్ గారు — మీ మిధ నాకున్న గౌరవం

  –అభిమానం తో —నా ఒపీనియన్ ను రాస్తు న్నా —మరొక్క సారి ఆలోచించండి —
  యిలా ప్ర చురించడం లో — Kendra సాహిత్య అకాడమి అవార్డు రాదూ —కెసిఆర్ గారు కాని
  తెలంగాణా రాష్ట్ర సమతి గాని — — గుర్తించదు —-?? గుర్తింపు — పేరు కోసం — లేనే పోనీ చేతలు — రాతలు అవసరమా —- —–??? జవాబు కు రెడీ
  ——————————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 4. తెలంగాణ కత – 2013 కు స్వాగతం. బహుశా శ్రీనివాస్ గారి ఆలోచనలు కార్యరూపం దాల్చుతున్నాయనుకుంటాను.
  గతం లో కూడా తెలంగాణా కథలకు పెద్ద పీట వేయడానికి చాలామంది క్రుషి చేశారు. ముదిగంటి సుజాతా రెడ్డి గారు సంపాదకులుగా తెలంగాణా తొలి తరం కథలు మొదటి భాగం 2002 వ సంవత్సరంలో వచ్చింది. రెండవ భాగం కూడా వారే శ్రీనివాస్ గారి సహ సంపాదకత్వంలో తొలినాటి కతలు పేరుతో 2005 లో తెచ్చారు. తెలంగాణా రచయిత్రుల కథా సంకలనం ` వెతలే .. కథలై ! ‘ పేరుతో 2011 లో వచ్చింది. 2005 వ సంవత్సరంలో విశాలాంధ్ర వాళ్ళు తెలంగాణా కథలు పేరుతో పెద్ద సంకలనం వేశారు.
  కర్ర ఎల్లా రెడ్డి గారు ` మన తెలంగాణా ‘ పేరుతో త్రైమాస పత్రికను జూన్ 2005 లో పారంభించారు . మార్చి 2009 వరకు 11 సంచికలు వచ్చాయి. తరువాత విషయం తెలియదు. అలాగే వారే ` తెలంగాణా కథ ‘ పేరుతో 2003 నుండి వార్షిక సంచికలు 2010 వరకు తెచ్చారు. తరువాత విషయం తెలియదు.
  అలా కొందరు తెలంగాణా కథకు పట్టం కట్టడానికి ప్రయత్నాలు చేస్తునే వున్నారు. శ్రీనివాస్ గారు వారి క్రుషిలో విజయం సాధించాలని కోరుకుందాము.

  • Manjari Lakshmi says:

   మీ వివరణ బాగుంది. మన ప్రాంతం మీద అభిమానముంటే ప్రత్యెక రాష్ట్రాలు వచ్చే దాకా ఆగాల్సిన పని లేదు. ఇట్లా ఎన్నో ప్రాంతీయ సంకలనాలు వస్తూనే వున్నాయి.

 5. కర్లపాలెం హనుమంత రావు says:

  మాటకు ముందు ఆంధ్రా సోదరులను నిష్కారణంగా తూలనాడడం కొత్త రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఫ్యాషనయి పోయింది. రాజకీయాలకు అది చెల్లుబాటు అవుతుందేమో గాని విశాల దృక్పథం కనబర్చాల్సిన కళారంగానికి శోభ నివ్వదు. తెలంగాణా సంస్కృతిని చిన్నబుచ్చుతున్నారన్న మాట నిజమే అనుకుందాం మాట వరసకి కొందరు ఆంధ్రా మూర్ఖ సొదరులు.. రాష్ట్రం ఏర్పాటు కాక ముందునుంచే అస్తిత్వ పోరాట స్ఫూర్తి కనబరచి ఉండాల్సింది. జయశంకర్ సార్ ఎంతో ఓపికగా జంధ్యాల పాపయ్య శాస్త్రిగారిని ఒప్పించినట్లు ఒప్పించే ఓపిక లేకా, విషయంలో పస లేకా, కేవలం న్యూనతా భావం వల్లా.. నిశ్సబ్దంగా ఉండి పోయింది? రాయలసీమ రచయితలు వారి సంస్కృతిని ప్రచారం చేసుకోవడంలో చూపిస్తున్న హుందాతనం తెలంగాణా రచయితల్లో (అధికుల్లో) ఎందుకు కొరబడుతుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలుగు వారి ప్రాంతీయ సంస్కృతులు వేరు వేరైనా తెలుగు వాడి గుండె చప్పుడు మాత్రం ఎప్పుడూ ఒక్కటే

మీ మాటలు

*