సరళమైన వాడు

 chand
వాడు వెలివేయబడ్డాడు
హృదయాలను మార్చుకుంటూ ప్రవహించలేక
వాళ్ళ పాదాల మద్య స్తంభించి పోయాడు
పల్చని తెర లాంటి  హృదయాన్ని
ఆకాశంలా పరుచుకున్నాడు
***
వాడు శూన్యం
కన్నీళ్ళు, గాయాలు
నువ్వు, నేను, ప్రపంచం ఏమీ లేవు
ప్రేమించడానికి ముందు
హృదయాన్ని బోర్లించాలంటాడు
***
దేహం లేనివాడు
చచ్చిన మనసులను చూసి నవ్వుతుంటాడు
నవ్వుతున్న దేహాలపై జాలి పడతాడు
రెప్పలు నుండి కురిసే వానకే నిండిపోతాడు
***
వెన్నెలై కురిసే హృదయం తప్ప
వాడి దగ్గర ఇంక ఏ అక్షరాలు లేనోడు
కాగితంపై రక్తం వొంపుకుంటూ
ఇదే కవిత్వమంటాడు
***
నువ్వెవరు అని అడిగిన ప్రతీ సారీ
తెలుసుకోవడానికే బ్రతికున్నానంటాడు
-చాంద్

మీ మాటలు

  1. అద్భుతం .. చాలా చాలా సరళంగా వుంది ప్రతీ వాక్యం

  2. Mounamga rodhinche o manasu prayaasa ni o kavithwam anukuntundi lokam

  3. “కాగితం పై రక్తం ఒంపుకుంటూ ఇదే కవిత్వం అంటాడు” – చాలా బాగుంది. ఇది చదవగానే నేను రాసుకున్న స్వగతం గుర్తొచ్చింది….

    లోకాన్ని మరమ్మత్తు చేసే మిషతో
    కథలు, కవితలు, కవిత్వాలు
    వాటిల్లో నీతి సూక్తులూ రాసి
    కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలిట.
    రాస్తుంటే లోపల ఎక్కడో – ఫీబుల్ గా
    ‘నేను’ చేసే విమర్శ వినిపించదూ –
    ‘నిన్ను చూసుకోవాయ్’ అంటూ!!?

    వందల వేల సూక్తులు రాసో
    దానికి విరుద్ధంగా
    విశృంఖలతలను ప్రోత్సహిస్తూ రాసో
    ఏం బాపుకుంటాం? – సెల్ఫ్ ఎంక్వయిరీ లేకుండా!

    మనిషిలోని గందరగోళాలూ సమాలోచనలూ
    సర్దుబాట్లూ కల్లోలాలు – ఇవన్నీ
    కళలో ప్రతిఫలించాలనే ప్రయత్నం చాలదూ!

    నియమాలనీ, ప్రయోజనాలనీ ఇరికిస్తూ
    ఏదో ఫార్మల్ సైకిల్ లాగా ఎలా రాయడం?

    రాయకపోతే ఏమవుతుంది?
    ఏమవుతుందో తేల్చుకో…… చూశారా…
    ‘తేల్చుకోవాలిట’
    ఇది తేల్చుకో అది తేల్చుకో అంటూ
    ప్రతి విషయానికీ ఏదో ‘ముగింపు’ ఉంటుందనీ
    దాన్ని తెలుసుకోవాలని – ఏమిటిది?
    వెర్రి ప్రయత్నం

    అసలు దేనికైనా ‘అంతం’ ఉంటుందా?
    పోనీ ‘ఆరంభం’ ఉంటుందా?

    ‘అది’ తెలుసుకోవాలి –

    తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక కలగాలి
    కలిగిన తర్వాత ‘అది’ అంత గాఢంగా నిలిచి ఉండాలి.

    అప్పుడు రాయాలి – ఆ స్థితిలో రాయాలి
    రాయడాన్నే కర్మణ్యజీవితంగా చేసుకుని రాయాలి. – అప్పుడేకదా మీరన్న కాగితం పై రక్తం ఒంపుకుంటూ రాయడమంటే ఏమిటో తెలిసేది. అభినందనలు చాంద్ గారూ….

  4. vijay gajam says:

    రెడీ టూ ఫైట్….విజయ్(08.10.14)
    బ్రమలు వీడుతున్నాయి
    వాస్తవాలు వెక్కిరిస్తున్నాయి..
    ప్రశ్నిస్తుంది అంతరంగం
    మాటలకే పరిమితం అయిన ఆదర్శాలు ఎన్నాళ్లని..
    నువ్వు నమ్మినోళ్లకు పట్టని అదర్శాలు నీకు మాత్రం ఎందుకనీ..
    ఎండుతున్న డోక్కలు నీకు కనపించడం లేదా..
    ఇరవై తేదీకే కాలీ అయిన పర్సు వెక్కిరిస్తుంది నన్ను చూసి నీకు ఎందుకురా
    బోడి అదర్శాలు..
    డోక్క నింపని నువ్వు పాటించే పద్దతులు దేనికి ఉపయోగం..
    నీలో పేరుకున్న అశాంతి చిరునామా ప్రశ్న..
    లౌఖ్యం నేర్చుకోరా బాబు లేక పోతే బ్రతకడం కష్టం..అదే తిరిగి సలహా..
    నిజమే..
    కానీ నా పద్దతీ నాదే…నాకు తెలుసు నేనేంటో..
    నికృష్టపు లోంగుబాటులో కొనుక్కున్న బ్రతుకు బ్రతుకే కాధూ..
    నధిలో కొత్తనీరు వస్తుంది..పోతుంది..
    కానీ అదే నధిలో ఉండే శిలలు శాశ్వతం..
    నేనూ అంతే..
    వింతగా వికృతంగా అద్దుకుంటున్న అశాంతి రంగుని చేడిపేసే
    ప్రయత్నం చెస్తున్నాను..
    అందుకే వర్తమానంలో వస్తుందనుకున్న స్వేచ్చ కాంక్షతో
    మనసులోని భావనతో దోస్తీ కడుతున్నాను
    ఓ కోత్త కవిత రాస్తున్నాను..
    రెడీ టూ ఫైట్ అంటున్నాను..

  5. dasaraju ramarao says:

    సామాన్య వాక్యాల్లో కవిత్వం ఒంపినట్లుగా ఉంది.. అభినందనలు చాంద్ కి …

  6. మనిషి బతికేది తెలుసుకోవడానికే–బాగా చెప్పారు.

  7. నువ్వెవరు అని అడిగిన ప్రతీ సారీ
    తెలుసుకోవడానికే బ్రతికున్నానంటాడు…. చాలా బాగుంది

  8. Nuvvevarivi ani adigina prathisari
    Thelusukodanike brathikunna antadu..”
    Wonderful..

Leave a Reply to vijay gajam Cancel reply

*