అతను అంగారం, ఆమెలోని సింగారం!

untitled

నేను వణికే వర్జిన్ మొదటి స్పర్శని

నేను  సున్నితంగా గుచ్చుకునే తన దొంగ ముద్దు ని

నేను   మేలిముసుగు లోంచి తొంగి చూసే ప్రేమ చూపు ని

అంటూ ఎక్కడయినా కనిపిస్తే  ఈ లైన్స్ చదవగానే ఈ కాలపు   ఔత్సాహిక ఇంటర్నెట్ కవి ఎవరో ప్రేమోద్రేకాల వ్యక్తీకరణలో కాస్త తడబాటు ఆటలు ఆడుకున్నాడు /కున్నది అని పాటకుడు అనుకుంటే గట్టి ముద్దపప్పులో కాలు వేసినట్లే  , ఎందుకంటే అదే పోయెమ్ లో ఇంకో పాదం లో

నేను భూమి గుండెల్లో పేలే అగ్ని పర్వతం

నేను అడవులని నిలువుగా దహించే కార్చిచ్చును

నేనే నరకపు పిచ్చి క్రోదాలను చూపే  సముద్రం 

అంటూ  ఒక్కసారిగా  ఆవేశం క్రోధం , ఆక్రోశం వెలిగక్కే అంటూ ఉలిక్కిపడేలా చేసే కొత్త వాక్యాలు కనిపిస్తాయి

tagore-nazrul1

ఇంకొంచం ముందుకు వెళ్లి ఇంకో రెండు పాదాలు చదువుకుంటే

నేను ఒక శాశ్వతం అయిన తిరుగుబాటు దారుడని

ప్రపంచాన్ని ఎదిరించడానికి నా తల ఎత్తుకుంటాను

అన్న వాక్యాలు కనిపించి  ఒక ఉద్యమ విప్లవకారుడి ప్రేమ  మన హృదయాన్ని మొదటి ముద్దుగా  కాకపోయినా గుండెల్లో గుచ్చుకున్న బలమయిన  భావంగా దిగబడిపోతుంది .

ఒక అనిర్వచనీయమైన ప్రేమ ఒక ఆవేశం ఒక విప్లవం కవిత పేరు విరోధి కవి కాజీ నజ్రుల్ ఇస్లాం. 

najrul1

 

మెదడులో ఒక 100 వోల్టుల బల్బు ఒకటి వెలిగి మొత్తంగా భారత స్వాతంత్ర సమరోద్యమం అందులో బెంగాలీ రైటర్స్ అంతా ఒక్క సారి గా కళ్ళముందు నిలబడి మనల్నే చూస్తున్నట్టు లేదు ? ఒక పక్క శాంతి వచనాల గురుదేవుడు రవీంద్రుడు బెంగాల్లో  ఉద్యమం ని తన కవితల రచనల ద్వారా ఎంత ముందుకు తీసుకెళ్లాడో కరెక్ట్ గా అదే సమయం లో నాణంకి రెండో పక్క  తన విరోధి ,అగ్నివీణ లాంటి రచనలతో స్వాతంత్రోద్యమం లో మధ్య మధ్య చల్లారే గుండెలకి నిజంగానే కార్చిచ్చు అంటించిన కవి గాయకుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం . మనకి బంగ్లాదేశ్ కి సాంస్కృతిక వారసత్వపు దారంలా అక్కడ రవీంద్రుడు రాసిన అమర్ షోనార్ బంగ్లా ఎ సాంగ్ బంగ్లాదేశ్ జాతీయ గీతం అయితే అదే ఆ కాలం లోనే మతపరమయినా , జెండర్ బేస్డ్ మూడ విశ్వసాలకి వ్యతిరేఖంగా అన్ని రకాల సోషల్ జస్టిస్ కోసం గళం విప్పిన రచయిత నజ్రుల్ బంగ్లాదేశ్ కి జాతీయ కవి .

 

 

ఇది చూడండి

ఏ తేడా చూడండి లేదు ఒక మనిషికీ  స్త్రీ కీ మధ్య

ఏది గొప్ప లేదా ప్రియమయిన విజయం 

ఈ ప్రపంచంలో ఒక సగం  మహిళ ,ఇతర సగమే మనిషి ”

అంటూ లింగ వివక్షతల మీద  ఎన్నో కవితలు రాసుకున్నాడు

 

అలాగే  ఇంకో చోట అయితే  

Who calls you a prostitute, mother?

Who spits at you?

Perhaps you were suckled by someone

as chaste as Seeta.

……………

And if the son of an unchaste mother is ‘illegitimate’,

so is the son of an unchaste father.

(Translated by Sajed Kamal : వికీపీడియా )

అలాగే “Come brother Hindu! Come Musalman! Come Buddhist! Come Christian! Let us transcend all barriers, let us forsake forever all smallness, all lies, all selfishness and let us call brothers as brothers. We shall quarrel no more” అంటూ జాతీయ భావాన్ని మతాలకి అతీతంగా మనసులను ఉత్సాహపు భంగార్ గాన్‘ (ప్రళయ గానం) తో గడగడలాడించి . తన ప్రచురణ ధూమకేతు ద్వారా స్వదేశీ సంగ్రామాన్ని ఉత్తేజిత పరచడం తనకే సాధ్యం అయింది .ఇంత డైరెక్ట్ గా ఇంత ఉదృతంగా పదాలకు కూడా మేలి ముసుగులు వేసే కాలం లో రాయగలరు అంటే నమ్మలేం కదూ అందుకే నజ్రుల్ కి మాత్రమే అప్పట్లో   విప్లవ కవి అని తాఖిదులిచ్చి గౌరవించుకున్నాం .

 –నిశీధి

మీ మాటలు

 1. దేవి వర్మ కొవ్వూరు says:

  సారంగ పత్రికలో మీ రచనలు అచ్చవ్వడం ఆనందదాయకం నిశీధి గారూ..

 2. నాకు నిజంగా ఆశ్చర్యంగా లేదు.. నిశీ రచనలు/భావనలు అచ్చవ్వకపోతేనె ఆశ్చర్యమంటాను నేను :)

 3. kcubevarma says:

  Aa mahakaviki neeraajanaalu venavela vandanaalu.. Meeku abhinandanalu Nisheeji..

 4. నజ్రుల్….!- నిశీధి గారికి అభినందనలు!

 5. తిలక్ బొమ్మరాజు says:

  నేను మిమల్ని చాలా కాలంగా చదువుతున్నా కూడా ఏదో ఒక కొత్త స్పర్శ మీ వాక్యాలలో ,పదాల్లో ఎప్పుడూ హృదయాన్ని తడుముతూనే ఉంటుంది,ఇలాంటి మీ కవిత్వాన్ని ఎలా ఎక్కువగా ప్రేమించాలా అని ప్రతిసారీ అనుకుంటాను.అభినందనలు నిశీధి గారు.

 6. మీ రాతలు చదివిన ప్రతీసారీ లానే ఈ సారి కూడా కొన్ని కొత్త పదప్రయోగాల కొత్త ఆలోచనల పరిచయమయింది నిశీ గారు. అసలు విషయం మరిచిపోయా ఈ సారి ఒకింత కన్ఫ్యూజన్ కూడా వచ్చిందడోయ్, ఎవరిని మెచ్చుకోవాలా అని!!!.

 7. Naveenkumar says:

  థ్యాంక్యు నిశీగారు! నైస్ వన్….

 8. Rajendra Prasad. Y says:

  నైస్ వన్ విత్ హై పవర్ .

 9. కాజీ నజ్రూల్‌ ఇస్లాం ను పరిచయం చేయడం బాగుంది నిశీది గారు.

 10. buchireddy gangula says:

  ఎక్ష్చెల్లెన్త్ పరిచయం నిశిధి గారు —-
  ——————————–
  బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*