శిలాక్షరం

Popuri1

అక్షరం   నన్ను    కుదిపేస్తోంది
కన్ను అక్కడే    అతుక్కుపోయినా..
ఆలోచన    స్తంభించిపోయినా –
అంతరంగపు  ఆవేదనను
అంతర్లోకపు   అనుభూతిని
అక్షరాలు   అనుభవించమంటున్నాయి.
ప్రస్తుతించిన    గతం     భవిష్యత్తులో
వర్తమానమై   ఘనీభవించినా
అక్షరాలున్నాయే     అవి
పుస్తకాల    అతుకుల్లో     ఎక్కడో     ఒక చోట     నిర్లిప్తమై      వుంటాయి    కదా,
మనసు గదిలోని   మానవత్వపు  గోడల్ని  తడుముతూనే
మంచితనపు   పొరల్ని  తాకుతూనే
కదలిక     లేని     కఠినమైన    గుండె     తాలూకూ స్పందనను
ఏకాంతం లో      వున్నప్పుడు  ఒంటరి  కన్నీరుగా  మారుస్తూనే-

-పోపూరి సురేష్ బాబు

మీ మాటలు

 1. శుభాకాంక్షలు సురేషూ…..!

 2. Sadlapalle Chidambara Reddy says:

  మనసు గదిలో మానవత్వం లేని గొడల్ని తడిమేది “శిలాక్షరాలు” కాదేమో తడి అక్షరాలయి వుంటాయి!!!

 3. పి.కృష్ణ ప్రసాద్ says:

  మీ కవిత ” శిలాక్షరం ” చాలా బాగుంది సురేష్ బాబు గారూ , అభినందలు .

 4. Popuri SureshBabu says:

  Thank you krishna prasad sir

 5. Rachamalla Upendar says:

  కవిత చాలా బాగుంది సురేష్ గారూ!

 6. పోపూరి సురేష్ బాబు says:

  థాంక్ యూ రాచమళ్ళా… చూడటం లేటయ్యింది..

 7. sudheer reddy kanchi says:

  కవిత చాలా బాగుంది సురేష్ , ఎక్కడ వున్నావు

మీ మాటలు

*