తెలంగాణ తెగువ కొండా లక్ష్మణ్‌

 

sangisetti- bharath bhushan photokonda laxman

ఎట్టకేలకు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుంటోంది. తొక్కి వేయబడ్డ గొంతుకలు ఇప్పుడు సరాయించుకొని మా వాటా మాకు దక్కాలని నినదిస్తున్నాయి. రాజుల చరిత్ర, వాళ్లెక్కిన గద్దెల చరిత్ర మాకొద్దంటుంది. అభివృద్ధి నుంచి ఆమడ దూరం నెట్టేయబడ్డ, అణచబడ్డ జాతుల కోసం, మార్జినలైజ్‌డ్‌ వర్గం కోసం, వాళ్లకు రెండు పూటల పట్టెడన్నం కోసం, ఇంత ఆత్మగౌరవం కోసం కొసదాకా కొట్లాడిన వారి జీవితం ఇవాళ చరిత్రకెక్కాలి. పాఠ్యపుస్తకాలై పరిఢవిల్లాలి అని నవ తెలంగాణ కోరుకుంటుంది. చరిత్ర సృష్టించడమే గాకుండా ప్రత్యేక తెలంగాణ సౌధానికి పునాదులేసిన వారిని విస్మరించరాదు. సౌధాలు పైకెంత సుందరంగా ఉన్నా వాటి మనుగడ మాత్రం అందుకు వేసిన పునాదులపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి బలమైన పునాది వేసిన మహనీయుడు, అణచబడ్డవారి గొంతుక, తెలంగాణ ఉద్యమ బావుటా, ఉద్యమకారుల అండ కొండా లక్ష్మణ్‌ బాపూజి. ఈ సెప్టెంబర్‌ 27 ఆయన శతజయంతి సంవత్సరం ఆరంభం కానుంది.

75 ఏండ్ల సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉండి వారి అభ్యున్నతే తన అభ్యున్నతిగా భావించి పనిచేసిన కార్యశీలి బాపూజీ. 1940లో న్యాయవృత్తి చేపట్టినది మొదలు చివరి శ్వాస వరకూ పీడితుల పక్షాన, పేదల పక్షాన నిలబడి ఆనాటి ఏడో నిజాం ఉస్మానలీఖాన్‌ మొదలు ఆధిపత్య భావజాలంతో, అహంకారపూరితంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి వరకూ ఎవరినీ వదిలి పెట్టలేదు. తన, పరాయి బేధం లేకుండా అన్యాయాన్నెదిరించాడు. దౌర్జన్యాలను ప్రశ్నించిండు.

నిజాం ‘నిరంకుశ’ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, బాధ్యతయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అనుయాయులు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మూడో మార్గంగా నిజాంపై బాంబుదాడి చేసి రాచరికానికి చరమ గీతం పాడాలని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యూహం పన్నిండు. నారాయణరావు పవార్‌, జగదీష్‌ ఆర్య, పాలమాకుల గంగారాం, జి.నారాయణస్వామి, బాలకిషన్‌లతో కలిసి పథకాన్ని రచించిండు. 1947 డిసెంబర్‌ నాలుగు నాడు నిజాం కారుపై బాంబుని నారాయణరావు పవార్‌ విసిరిండు. దీనికంతటికి మూలకారకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజి. క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రజా జీవనం ప్రారంభించిన బాపూజీ 1945లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి అడ్వకేట్‌గా రాణిస్తూనే ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యిండు. హైదరాబాద్‌ అసెంబ్లీకి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యిండు. ముల్కీ ఉద్యమంలో ప్రజల పక్షాన నిలబడిరడు. ఆ తర్వాత డిప్యూటి స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిండు.

kaifiyath

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డికి అండగా నిలబడి ఉన్నట్లయితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు. కాని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడమే గాకుండా అందరికన్నా ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బావుటై ప్రతి గ్రామంలో రెపరెపలాడిరడు. ప్రజల్ని చైతన్య పరిచిండు. 1969లో ‘తెలంగాణ ముచ్చట్లు’ పేరిట ఇంగ్లీషు తెలుగు భాషల్లో పుస్తకాన్ని రాయడమే గాకుండా, ఉద్యమ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చిండు. తెలంగాణ ప్రజాసమితిలో ప్రముఖ పాత్ర పోషించిండు. చెన్నారెడ్డి, సదాలక్ష్మి, జి.వెంకటస్వామి తదితరులతో కలిసి ఉద్యమాన్ని నడిపించాడు. ఆనాటి ఉద్యమ కాలంలో ప్రతి రోజు బాపూజీ ఉద్యమ కార్యాచరణ పత్రికల ఫ్రంట్‌ పేజి శీర్షికలయ్యాయి. 1969 మొదలు కన్ను మూసేవరకూ ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిండు. ప్రత్యేక తెలంగాణను కండ్ల సూడకుండనే 2012లో కన్ను మూసిండు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా బాపూజీ కీలక పాత్ర పోషించాడు. 90 యేండ్లు దాటిన వయసులో కూడా అటు ఢల్లీి మొదలు ఇటు తెలంగాణలో గల్లీల వరకు గ్రామస్థాయి కార్యకర్త మొదలు జాతీయ స్థాయి నాయకుల వరకు ఎంతో మందితో కలిసి పనిచేసిండు. కేసిఆర్‌, గద్దర్‌, మందకృష్ణ, విమలక్క, బెల్లయ నాయక్‌, యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ జాక్‌లు, సకల జనులు, సబ్బండ వర్గాలతోటి, తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికీ కొండంత అండగా నిలబడిరడు. ఒకదశలో మందకృష్ణ మాదిగ బహుజన ముఖ్యమంత్రిగా బాపూజీని ప్రతిపాదించిండు. అందుకు అందరు సహకరించాలని ‘రాజకీయ’ డిమాండ్‌ చేసిండు. 2009 డిసెంబర్‌ తొమ్మిది ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పడంపై ఢల్లీిలో డిసెంబర్‌ చలిలో దీక్షకు దిగి కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వంలో కదలిక తీసుకొచ్చిండు. కరుడు గట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి రాజగోపాల్‌ని సైతం ఇంటికి పిలిచి తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షపై ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేసిండు. ఇవ్వాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బహుజనుల్లోకి చొచ్చుకు పోవడానికి, చైతన్యం పొందడానికి బాపూజీ కార్యాచరణే ప్రధాన కారణం. తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన నిస్వార్థుడు.

konda-2కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు తన ‘జలదృశ్యం’ను వేదికగా చేసిండు. అంటే 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే బాపూజీ ఇంట్లో. టీఆర్‌ఎస్‌ పార్టీకి ‘జలదృశ్యం’ను వేదికగా చేసినందుకుగాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా అందులో నుంచి బాపూజీని ఖాళీ చేయించాడు. వృద్ధాప్యంలో కిరాయి ఇండ్లల్లో ఉండాల్సిన దురవస్థ ఏర్పడిరది.

తెలంగాణ కోసం సర్వం ధారబోసిన బాపూజీ అటు సహకార రంగంలోనూ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి పేరిట సామాజిక న్యాయం కోసం, మండల్‌ కమీషన్‌ అమలు కోసం, నేతన్నల ఆకలి చావుల నివారణ కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమాలు నడిపిన ధీశాలి. బాపూజీ అనేది కొండా లక్ష్మణ్‌ తండ్రి పేరు. అయితే తన గాంధేయవాద ఆచరణతో, ఆహార్యంతో నిజమైన ‘తెలంగాణ గాంధి’గా నిలిచిండు.

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వమే ఈయేడాది మొత్తం ‘శత జయంతి’ ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఆయన జీవిత చరిత్రను సాధికారికంగా రాయించి ప్రకటించాలి. 25 యేండ్లు శాసనసభ్యుడిగా, డిప్యూటి స్పీకర్‌గా, మంత్రిగా ఉండి తెలంగాణ జనసామాన్యానికి సేవ చేసిన బాపూజీ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలి. ఆయన నివసించిన ‘జలదృశ్యం’లో బీసి స్టడీ సెంటర్‌ని ఏర్పాటు చేసి బహుజన ఐఎఎస్‌, ఐపిఎస్‌లను తయారు చేసేందుకు శిక్షణ నిప్పించాలి. ఇదేదో మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించుకునే వరకు నిరంతర ప్రయత్నం సాగాలి. ఈ స్టడీ సెంటర్‌కు తగినన్ని నిధులు కేటాయించి నిజాయితీ గల ఐఎఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించి జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభకు మెరుగులు దిద్దాలి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 27ని ‘బీసి సాధికారత’ దినంగా ప్రకటించి అన్ని రంగాల్లో బీసిలకు జనాభా దామాషాలో వాటా దక్కేందుకు, అందుకు చట్టంలో మార్పులు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ‘బీసి సబ్‌ప్లాన్‌’ని ప్రకటించి వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ సబ్‌ప్లాన్‌ సాధన కోసం అన్ని వర్గాల వారు ఐక్యంగా కృషి చేయాలి. బాపూజీ కలలుగన్న సామాజిక న్యాయం తెలంగాణ ప్రజలందరికీ దక్కడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

మీ మాటలు

 1. పైన పెర్కొన్నవన్నీ ప్రస్తుత ప్రభుత్వం నేరవేర్చుతుందని మీరు నమ్మితే.. బాపూజీతోపాటు ఆ నమ్మకానికి కూడా జోహార్లు

 2. కొండాపై చక్కని వ్యాసం. అభినందనలు. కాకపొతే మళ్లీ చిన్న అభ్యంతరం .నిజాంపై మీకున్న ఆరాధన భావాన్ని కొండా వ్యాసంలో బయట పెట్టుకొవడం సబబుగా లేదు.

  మీ మాటలు..
  ….. రాజుల చరిత్ర, వాళ్లెక్కిన గద్దెల చరిత్ర మాకొద్దంటుంది. అభివృద్ధి నుంచి ఆమడ దూరం నెట్టేయబడ్డ, అణచబడ్డ జాతుల కోసం, మార్జినలైజ్‌డ్‌ వర్గం కోసం, వాళ్లకు రెండు పూటల పట్టెడన్నం కోసం, ఇంత ఆత్మగౌరవం కోసం కొసదాకా కొట్లాడిన వారి జీవితం ఇవాళ చరిత్రకెక్కాలి….

  నిజాం ‘నిరంకుశ’ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, బాధ్యతయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అనుయాయులు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మూడో మార్గంగా నిజాంపై బాంబుదాడి చేసి రాచరికానికి చరమ గీతం పాడాలని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యూహం పన్నిండు……

  నిజాం ‘నిరంకుశ’ పాలన.. ఈ పదబదంలోని ‘నిరంకుశ’ పదాన్ని ఎందుకు కోట్స్ లో పెట్టారు? అంటే అది నిరంకుశ పాలన కాదనేగా. అలా ఐతే ఈ వ్యాసం దండగ. కొండా ఆత్మ క్షోభిస్తుంది. ఐలమ్మ ఆత్మ క్షోభించినట్లే.

  మీపై నాకు వ్యక్తిగత ద్వెశమెమీ లేదు. నిజాంను పోగిదేవాల్లంటేనే మంట. ఆ బూజును పొగడ్డానికి దయచేసి ప్రజా నేతలను పావులుగా వాడుకోవద్దని మనవి.

  మీ భావాల్లో గందరగోళంలా మీ మాటల్లో కూడా consistency లేదు.

  ……1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డికి అండగా నిలబడి ఉన్నట్లయితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు. కాని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడమే గాకుండా అందరికన్నా ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బావుటై ప్రతి గ్రామంలో రెపరెపలాడిరడు. ప్రజల్ని చైతన్య పరిచిండు. 1969లో ‘తెలంగాణ ముచ్చట్లు’ పేరిట ఇంగ్లీషు తెలుగు భాషల్లో పుస్తకాన్ని రాయడమే గాకుండా, ఉద్యమ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చిండు. తెలంగాణ ప్రజాసమితిలో ప్రముఖ పాత్ర పోషించిండు. చెన్నారెడ్డి, సదాలక్ష్మి, జి.వెంకటస్వామి తదితరులతో కలిసి ఉద్యమాన్ని నడిపించాడు. ఆనాటి ఉద్యమ కాలంలో ప్రతి రోజు బాపూజీ ఉద్యమ కార్యాచరణ పత్రికల ఫ్రంట్‌ పేజి శీర్షికలయ్యాయి. 1969 మొదలు కన్ను మూసేవరకూ ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిండు. ప్రత్యేక తెలంగాణను కండ్ల సూడకుండనే 2012లో కన్ను మూసిండు………

  ఈ ఒక్క పేరాలో క్రియల్లో ఎన్ని తేడాలు..

  అయ్యేవాడు.. నిలిచాడు.. రెపరెపలాడిడు. పరిచిండు.. ఊతమిచ్చిండు,. పోషించిండు..నడిపించాడు.

  ఏమిటిది? నిలిచాడు లాంటివి ఆంధ్రా వాళ్ళవి ఐతే వోదిలేయండి. అన్ని చోట్ల పరిచిండు లాంటివే వాడండి.

 3. Dr.Pasunoori Ravinder says:

  తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌…
  కాళోజిల‌ను, దాశ‌ర‌థుల‌ను, పీవీ న‌ర్సింహ‌రావుల‌ను, బ‌తికుండ‌గానే సినారేల‌ను ప‌ట్టించుకున్న‌ది స‌ర్కార్‌.
  వారి జ‌యంతుల‌ను పండుగ‌ల్లా జ‌రిపింది.
  సామ‌ల స‌దాశివ‌, చాక‌లి ఐల‌మ్మ‌, స‌దాల‌క్ష్మి, షోయ‌బ్ ఉల్లా ఖాన్‌, కొమురంభీం వంటి
  ద‌ళిత‌, బ‌హుజ‌న‌, మైనారిటీ మ‌హ‌నీయుల పేరే ఎత్త‌లేదు.
  క‌నీసం ప‌ద్మ‌శాలీలైన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీని ప‌ట్టించుకోవ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం.

  తెలంగాణ గ‌ర్వించ‌ద‌గ్గ చ‌రిత్ర‌కారులు సంగిశెట్టి శ్రీ‌నివాస్‌గారికి ధ‌న్య‌వాదాలు.
  కొండాల‌క్ష్మ‌న్ బాపూజి చేసిన ద‌శాబ్దాల కృషిని ఇంత చిన్న వ్యాసంలో సంక్షిప్తంగా అందించారు.

  కొడిగుడ్డు మీద ఈక‌లు పీకేవాళ్లు ఎప్పుడూ ఉంటారు.
  అస‌లు వ‌దిలిపెట్టి కొస‌రు గురించి మాట్లాడే వాళ్ల‌ను ప‌ట్టించుకోకండి.
  స‌ర్కార్ అగ్ర‌వ‌ర్ణాల‌కు కొమ్ముకాస్తుంటే ఈ సంకుచిత‌ మాట్లాడ‌రు.
  ఇక్క‌డ అస్తిత్వాలు ద‌గాప‌డుతున్న‌యి మొర్రో అని మొత్తుకుంటుంటే…క్రియ‌ల గురించి ఇల్లుపీకి పందిరేయ‌డం సిగ్గుచేటు.

  అద్భుత‌మైన వ్యాసానికి అభినంద‌న‌లు..

  -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

 4. Dr.Pasunoori Ravinder says:

  తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌…
  కాళోజిల‌ను, దాశ‌ర‌థుల‌ను, పీవీ న‌ర్సింహ‌రావుల‌ను, బ‌తికుండ‌గానే సినారేల‌ను ప‌ట్టించుకున్న‌ది స‌ర్కార్‌.
  వారి జ‌యంతుల‌ను పండుగ‌ల్లా జ‌రిపింది.
  సామ‌ల స‌దాశివ‌, చాక‌లి ఐల‌మ్మ‌, స‌దాల‌క్ష్మి, షోయ‌బ్ ఉల్లా ఖాన్‌, కొమురంభీం వంటి
  ద‌ళిత‌, బ‌హుజ‌న‌, మైనారిటీ మ‌హ‌నీయుల పేరే ఎత్త‌లేదు.
  క‌నీసం ప‌ద్మ‌శాలీలైన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీని ప‌ట్టించుకోవ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం.

  తెలంగాణ గ‌ర్వించ‌ద‌గ్గ చ‌రిత్ర‌కారులు సంగిశెట్టి శ్రీ‌నివాస్‌గారికి ధ‌న్య‌వాదాలు.
  కొండాల‌క్ష్మ‌న్ బాపూజి చేసిన ద‌శాబ్దాల కృషిని ఇంత చిన్న వ్యాసంలో సంక్షిప్తంగా అందించారు.

  కొడిగుడ్డు మీద ఈక‌లు పీకేవాళ్లు ఎప్పుడూ ఉంటారు.
  అస‌లు వ‌దిలిపెట్టి కొస‌రు గురించి మాట్లాడే వాళ్ల‌ను ప‌ట్టించుకోకండి.
  స‌ర్కార్ అగ్ర‌వ‌ర్ణాల‌కు కొమ్ముకాస్తుంటే ఈ సంకుచిత‌వాదులు మాట్లాడ‌రు.
  ఇక్క‌డ అస్తిత్వాలు ద‌గాప‌డుతున్న‌యి మొర్రో అని మొత్తుకుంటుంటే…క్రియ‌ల గురించి ఇల్లుపీకి పందిరేయ‌డం సిగ్గుచేటు.

  అద్భుత‌మైన వ్యాసానికి అభినంద‌న‌లు..

  -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

  • రవీందర్ గారు,
   ఈ రోజు ఆంధ్రజ్యోతిలో సంగిసెట్టి గారి వ్యాసం చూశాక బాపూజీ గురించి మరిన్ని సంగతులు తెలిసి మరింత గౌరవం ఏర్పడింది. అలాగే ఉద్యమకారులు ఎప్పుడూ జాగరూకతతో ఉండాలని కూడా తెలిసింది. ఆ వ్యాసంలో సంగిసెట్టి తెలంగాణా ‘సాయుధ పోరాటాన్ని’ కోట్స్ లో పెట్టి చక్కగా వక్రీకరించారు. మీరు కమ్యూనిస్తులకు, ఆ పోరాటానికి వ్యతిరేకి ఐతే వొదిలేయండి. ఉద్యమకారులైతే ఎలా స్పందిస్తారో మీ విచక్షనకె వదిలేస్తున్నా. ఆ వ్యాసంలోని consistency గురించి చెబితే మీకు కోడిగుడ్డు గుర్తుకొస్తుంది గనక చెప్పను. అసలే గుడ్ల ధరలు మందిపోతున్నై.

 5. ఇక్కడ రవీందర్ ఎరుకోదగ్గ ఈకలు ఎవరూ పీకలేదే! కొండా లక్ష్మణ్ లాంటివారిని సోకాల్డ్ అగ్రవర్ణ పుంగవుల మాదిరి పొగడాల్సిన లేదా చిత్రించాల్సిన అవసరంలేదు. కొండా మీద ప్రేమతోనే ఇదంతా. రచయత తెచిపెట్టిన అడంబారాల్లో బాపూజీని బందీ చెయ్యొద్దు.

  • అగ్రవర్ణ అనే పదాన్ని విస్మరించగలరు

   • Dr.Pasunoori Ravinder says:

    డియర్ మధు కోట సోదర!
    సంగిశెట్టిగారు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మీద వ్యాసం రాసి, ఆ వైతాళికున్ని స్మరించుకున్నారు .
    ఆయన అలా బాపూజీకి సమున్నత గౌరవం కల్పించాలనే ప్రయత్నం వెనుక దాగిన ఆవేదనను అర్థం చేసుకోకుండా మోహన్‌గారు, తెలుగు వ్యాకరణం గురించి మాట్లాడడమే నా అభ్యంతరం.

    ఇకపోతే మీరు కూడా సంగిశెట్టి గారి వ్యాసాన్ని సరిగా అర్థం చేసుకోలేదనడానికి మీ కామెంట్లే నిదర్శనం.

    సాహిత్యంలో రూపం-సారం అనే చర్చ చాలా పాతదే. కాని, ఇంకా వాటి దగ్గరే ఆగిపోతే కోడిగుడ్డి మీద ఈకల సామెతే గుర్తుకొస్తది.
    కొండా లక్ష్మణ్‌ బాపూజీ మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే…వస్తువు వరకే పరిమితమవుతారు. అంతే తప్ప ఇలా నాలో, సంగిశెట్టిలో తప్పులు వెదకరు. దయచేసి కామెంట్‌ చేసినంత ఈజీకాదు ఒక వ్యాసం రాయడం. మీ సంస్కారానికో నమస్కారం.

   • బాధపడకు మిత్రమా. మిమ్మల్ని బాధించే.. అదే.. మీకు కోపం తెప్పించే కామెంట్లు నాతోపాటు ఇంకెవరూ రాయకూడదని అశించనైనది.

   • మీరు అనగా రవీందర్ గారు.

 6. రవీందర్ గారు!
  మోహన్ గారు అడిగిన ప్రశ్నలు న్యాయమైనవే. మీరే అసలు వదిలేసి కొసరు గురించి మాట్లాడారు. లక్ష్మణ్ గారు వ్యతిరేకించిన నిజాం పాలన సంగిసెట్టి గారికి నిరంకుశ పాలనలా కాకుండా స్వర్ణ యుగంలా అనిపించడం, అందుకు సంగిసెట్టిని విమర్శిస్తే మీకు కోడిగుడ్డు గుర్తుకు రావడం బాధాకరం. ఇలాంటి మౌలిక అంశాలను విస్మరించ కూడదు. మోహన్ గారి ప్రశ్నలకు సంగిసెట్టి గారు జవాబు చెప్పాలి.
  ఇక క్రియలు. మోహన్ గారు ఇచ్చిన సూచనను పాజిటివ్గా తీసుకోవాలి. విమర్శ లేనిదే సమాజం, సాహిత్యం ఎదగవు. తెలుగు సమాజం, సాహిత్యాల్లో నిష్పాక్షిక విమర్శ లేనందువల్లె అవి అభివృద్ధి చెందడం లేదు.

 7. *కనీసం పద్మశాలి* అయిన బాపూజీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించిందో చెబుతారా.. సోదరా రవీందర్

 8. ari sitaramayya says:

  డాక్టర్ పసునూరి రవీందర్ గారూ,

  “ఆయన అలా బాపూజీకి సమున్నత గౌరవం కల్పించాలనే ప్రయత్నం వెనుక దాగిన ఆవేదనను అర్థం చేసుకోకుండా మోహన్‌గారు, తెలుగు వ్యాకరణం గురించి మాట్లాడడమే నా అభ్యంతరం.” ఇవి మీ మాటలు. కాని మోహన్ గారు వ్యాకరణం గురించి మాత్రమే మాట్లాడలేదు.

  “నిజాం ‘నిరంకుశ’ పాలన.. ఈ పదబదంలోని ‘నిరంకుశ’ పదాన్ని ఎందుకు కోట్స్ లో పెట్టారు? అంటే అది నిరంకుశ పాలన కాదనేగా. అలా ఐతే ఈ వ్యాసం దండగ. కొండా ఆత్మ క్షోభిస్తుంది. ఐలమ్మ ఆత్మ క్షోభించినట్లే.” ఇది మోహన్ గారి మొదటి అభిప్రాయం. మీరు “తెలంగాణ గ‌ర్వించ‌ద‌గ్గ చ‌రిత్ర‌కారులు” అంటున్న సంగిసెట్టి శ్రీనివాస్ గారి వ్యాసాల్లో ఉన్న అవకతవకల గురించే ఆయన మొదట అడిగింది.

  ఆ తర్వాత మోహన్ గారు అడిగింది వ్యాకరణం గురించి కాదు, వ్యాసంలో వాడిన భాషలో స్థిరత్వం (కన్సిస్టెన్సీ) గురించి. “అయ్యేవాడు.. నిలిచాడు.. రెపరెపలాడిడు. పరిచిండు.. ఊతమిచ్చిండు,. పోషించిండు..నడిపించాడు…. ఏమిటిది? నిలిచాడు లాంటివి ఆంధ్రా వాళ్ళవి ఐతే వోదిలేయండి. అన్ని చోట్ల పరిచిండు లాంటివే వాడండి.” ఇవీ మోహన్ గారి మాటలు. కన్సిస్టెంట్ గా రాయమంటున్నారు. అంతే కదా? ఇందులో తప్పేంటో నాకు అర్థం కావటం లేదు.

  “సాహిత్యంలో రూపం-సారం అనే చర్చ చాలా పాతదే. కాని, ఇంకా వాటి దగ్గరే ఆగిపోతే కోడిగుడ్డి మీద ఈకల సామెతే గుర్తుకొస్తది. కొండా లక్ష్మణ్‌ బాపూజీ మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే…వస్తువు వరకే పరిమితమవుతారు” అన్నారు మీరు.

  రూపం సారం చర్చ సృజనాత్మక సాహిత్యానికి సంబంధించినది. వ్యాస సాహిత్యానికి సంబంధించినది కాదు.

  ఇక చదివే వారు వ్యాసంలో ఏ విషయం గురించి స్పందించవచ్చో దేని గురించి కూడదో మీరెలా నిర్ణయిస్తారు? పైగా బాపు లాంటి “ప్రజా నేతలను పావులుగా వాడుకోవద్దని” అన్నారు మోహన్ గారు. అంటే వారిమీద ఆయనకు గౌరవం ఉన్నట్లా లేనట్లా?

  “కొడిగుడ్డు మీద ఈక‌లు పీకేవాళ్లు ఎప్పుడూ ఉంటారు.
  అస‌లు వ‌దిలిపెట్టి కొస‌రు గురించి మాట్లాడే వాళ్ల‌ను ప‌ట్టించుకోకండి.
  స‌ర్కార్ అగ్ర‌వ‌ర్ణాల‌కు కొమ్ముకాస్తుంటే ఈ సంకుచిత‌ మాట్లాడ‌రు.
  ఇక్క‌డ అస్తిత్వాలు ద‌గాప‌డుతున్న‌యి మొర్రో అని మొత్తుకుంటుంటే…క్రియ‌ల గురించి ఇల్లుపీకి పందిరేయ‌డం సిగ్గుచేటు.”

  విమర్శించిన వారిని వ్యక్తిగతంగా దూషించటం “సాహిత్య పత్రిక”ల్లో ఇది మొదటిసారి కాదేమో.

 9. ఆంధ్రా భాష రాకూడదు అనేది క్రియాపదాల్లో నేనా? మిగిలిన భాష మాటేమిటి? తెలంగాణ తెలుగు వేరు, ఆంధ్రా వేరు అని కదా వాదం. అలాంటప్పుడు ఆంధ్రా వాళ్ళకు ఒక్క ముక్క కూడా అర్థం కానట్టుగా వ్యాసాలు, కవితలు, కథలు రాయాలి. సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి వీర తెలంగాణా వాదులు ఆ పని చేస్తే బాగుంటుంది. అప్పుడే మీ భాషవేరు, మా భాష వేరు అనే వాదాన్ని నమ్ముతారు. ఉద్యమం వేడిలో ఉన్నప్పుడు ఏమన్నా చెల్లిపోతుంది. ఆ తర్వాత కూడా దాన్నే సాగదీస్తే కోడిగుడ్డుకు ఈకలు తప్పకుండా పీకుతారు. నీళ్ళు, కరెంటు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు అన్నిటినీ అందరినీ పంచుతున్నారు కదా. కవుల్ని, కథకుల్నీ, రచయితల్నీ కూడా పంచమని అడగండి. మీరు అడక్కపోతే రేపు ఆంధ్రావాళ్లు తప్పకుండా అడుగుతారు. విభజన అన్నాక అది ఒక చోటే ఆగదు.

 10. P.Jayaprakasa Raju. says:

  ఇక్కడ భాష విషయం వచ్చింది కనుక ఒక విషయం చెప్పాలి. కీ.శే. సురవరం ప్రతాప రెడ్డి గారు 1934 సం వత్సరం లో ` గోలుకొండ కవుల సంచిక ‘ పేరిట తెలం గాణా లోని 354 మంది కవులను , వారి రచనలను పరిచయం చేశారు. అందులో అధిక భాగం తెలుగులో రచన చేసినవారే!
  దా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు 2009 సంవత్సరం లో క్రీ. పూ. 10-12 . నుండి క్రీ. శ. 19 వ శతాబ్దం చివరి వరకు తెలంగాణా లోని దాదాపు 500 మంది ప్రముఖ కవులను , వారి రచనలను పరిచయం చేశారు.వారిలో కూడా అధిక భాగం తెలుగులో వ్రాసినవారే !!
  ఇప్పటి రచయితలలో కూడా తెలుగులోనే తమ రచనలు చేశారు , చేస్తున్నారు.
  వారు వ్రాసే తెలుగుకు , ఆంధ్రా లోని తెలుగుకు తేడా ఏమిటో తెలియలేదు.మరి అలాంటప్పుడు తెలంగాణా భాషను అణగద్రొక్కారనీ , పరిహాసం చేస్తున్నారని ఎందుకు భావిస్తున్నారో అర్ధం కాలేదు. మాండలికాలు సంగతి వేరే. ఎందుకంటే అవి ప్రతి ప్రాంతం లో వున్నాయి. తెలిసినవారు చెప్పాలి మరి !!!

 11. P.Jayaprakasa Raju. says:

  సంగిశెట్టి శ్రీనివాస్ గారిని గురించి నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే వారు నిజాం పాలనను స్వర్ణయుగం గా భావిస్తారు. కమూనిష్టులన్నా , తెలంగాణా పోరాటమన్నా సదభిప్రాయం లేదు .పోరాటం కేవలం రెండున్నర జిల్లాలలోనే జరిగిందని , దానికి వేరే కారణాలు వున్నాయని వ్రాశారు. ఆ సందర్భం గా తెలంగాణా రచయితలు వ్రాసిన కథలు , నవలలు , కవితల గురించి ప్రస్తావిస్తే , వారి రచనలు పూర్తిగా లభ్యమైన తర్వాత ఆ భ్రమలు తొలిగి పోతాయని అంటారు .ప్రత్యేక తెలంగాణా అంటే సామాజిక తెలంగాణా వచ్చేసిందనీ , దానికి గత ప్రభుత్వ స్వభావం వుండదనీ వీరంతా భావిస్తూ , ఏవేవో ప్రణాళికలు వేస్తూ , సలహాలు ఇస్తుంటారు. పొరాడందే ఏది సమకూరదు.కాని వీరు సంస్కరణలతోనే సాధించవచ్చని భావిస్తారు!

 12. డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి పుస్తకం పేరు `ముంగిలి – తెలంగాణ ప్రాచీన సాహిత్యం ‘.

 13. srinivas sangishetty says:

  నిజాల గురించి గాకుండా ఇజాల ముసుగేసుకొని మాట్లాడే, రాసే వాళ్ళ తోటి ఇదే సమస్య. నేను మల్లీ చెబుతున్న నిజాం మంచి చేస్తే మంచి అని చెబుతున్న దానికి ఆధారాలు ఇస్తున్నాను. చెచేసిన చెడు ని చెడు అని చెబుత్దాం. ఇన్నేండ్ల వలస, ఆధిపత్య పాలనలో నిజాం “నిరంకుశుడి” గా నిలిచి పోయిండు. 224 యేండ్ల పాలనలో చివరి నాలుగేండ్ల పాలనలో నిజాం పాత్ర సంతృప్తిగా లేదు. దానికి ఆయన్ని బాద్యుడిని చేయాల్సిందే. కాని మొత్తం పాలన అంతా నిరంకుశమే అంటే ఎట్లా. సరే మరి మీరు కాకతీయుల్ని ఎందుకు నెత్తికెత్తుకుంటున్ద్రు. రాజు ఎవ్వరైనా ఒక్క తీరుగనే ఉంటారు. అది కాకతియులైనా, విజయనగర రాజులైనా, కుతుబ్శాహీలైనా, ఆఖరికి నిజాం పాలనైనా అందరు ఒక్క తానులోని ముక్కలే.
  బట్ట కాల్చి మీదేసుడు బాగా అలువాటయ్యిన్ది. అందారు రాజుల్లాగే నిజాంని చూడకుండా మతం అద్దాలు పెట్టుకొని చూస్తే అది నిరంకుశగానే కనబదుతది. చివరి నాలుగేళ్ల పాలనను మొత్తం 224 యేండ్ల పాలనకు వర్తింప చేయ పునడం మీ జ్ఞానం లోని ఖాళీలకు కొండ గుర్తు. అసలు నిజాం అనే పదమే మొత్తం వంశానికి సంబందించినది. సూఫీ గురువు మీది ప్రేమతో స్వీకరించింది. మొత్తం ఏడుగురు రాజులకి సంబందించిన పదాన్ని ఒక్క ఏడో ‘నిజాం’ ఉస్మాన్ అలీ ఖాన్ ని నిన్దించాడానికి పదబంధం బాగుంది కదా అని నిరంకుషని ఆడ్ చేసి వాడుతుండ్రు.
  వ్యాసం సక్కగా ఉన్దంటూనే వొంకర మాట్లాడే వాళ్ళ తోటీ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్శన్ తెలుస్తనే ఉంది. ఎవరు గందర’గోళెం’ల ఉన్నారో ఎరికైతనే ఉన్నది. గోళెం లోని కప్పలకు ప్రపంచాన్ని చూపించడమే నేను మొదటి నుంచి చేస్తున్న పని. కండ్లకు గంతలు కట్టుకొని గుంతల్నే ఉంటమంటే అది వాళ్ళ ఇష్టం. ఎవ్వడి మార్జి వానిది.
  consistency గురించి మాట్లాడే టొల్లు యాడ తప్పుందో , మరి ఎత్లున్దాలో చెబితే నేర్సుకుంటా.
  ఎగిరే పక్షి రెక్కలు లెక్క పెట్టె మేధావులకు కోడి గుడ్డు మీద ఈకలు పీకదమ్ పెద్ద కష్టమైన పనేమి కాదు. బ్రాహ్మణ భావ జాలాన్ని మోసి, ఆ వర్గపు మేధావులను నెత్తికెత్తుకోవాలని వీళ్ళ ఆకాంక్ష అయితే అది అడియాసే. అందులో పీడితుల పక్షాన నిలబడ్డ ఆళ్వారు, కాలొజీలు పాక్షిక మినహాయింపు. నేను బూజు దులిపే పనిలో ఉన్నాను. కొందరికి బూజు అంటే మోజుండి. అందుకే దుమ్ము దులిపితే సాలు తమ కండ్లల్ల దుమ్ము పోసుకుంటున్ద్రు
  ‘తానా’ అంటే తందానా అనే వెంనేముఖ లేనోళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అందరికి అంట టైం సేవ్ అయితది.
  అట్లనే
  పంచుడు సంగతి మల్ల మాట్లాదుతున్ద్రు. మీకంత కోరిక ఉంటే తప్పకుండా ట్యాంకుబండు మీదీవి మీయి మీకు పంపించే పని గూడా బాకీ ఉంది. ఆ ఋణం కూదా తీర్చుకుంటమ్. ఇయ్యాల గాకుంటె రేపు, రేపు గాకుంటే ఎల్లుండి.

  “సంగిశెట్టి శ్రీనివాస్ గారిని గురించి నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే వారు నిజాం పాలనను స్వర్ణయుగం గా భావిస్తారు. కమూనిష్టులన్నా , తెలంగాణా పోరాటమన్నా సదభిప్రాయం లేదు .పోరాటం కేవలం రెండున్నర జిల్లాలలోనే జరిగిందని , దానికి వేరే కారణాలు వున్నాయని వ్రాశారు. ఆ సందర్భం గా తెలంగాణా రచయితలు వ్రాసిన కథలు , నవలలు , కవితల గురించి ప్రస్తావిస్తే , వారి రచనలు పూర్తిగా లభ్యమైన తర్వాత ఆ భ్రమలు తొలిగి పోతాయని అంటారు .ప్రత్యేక తెలంగాణా అంటే సామాజిక తెలంగాణా వచ్చేసిందనీ , దానికి గత ప్రభుత్వ స్వభావం వుండదనీ వీరంతా భావిస్తూ , ఏవేవో ప్రణాళికలు వేస్తూ , సలహాలు ఇస్తుంటారు. పొరాడందే ఏది సమకూరదు.కాని వీరు సంస్కరణలతోనే సాధించవచ్చని భావిస్తారు!” ఇది జయప్రాకాష్ గారి అభిప్రాయము. ఆయన నన్ను సరిగ్గా అర్తం చేసుకోలేదు. నేను స్వర్ణ యుగం అని ఏ వ్యాసం లోను, ఎక్కడా కూదా చెప్పలేదు. అందరు రాజుల్లాగే ఆయన్ని కూడా చూదాలన్నాను. నర నరాన గత 60 ఏండ్లుగా నిజాం వ్యతిరేకతను కాన్రేసు, కమ్యునిస్టులు, ప్రబుత్వాలు, పాటయ పుస్తకాలు, ప్రచురణ సంస్థలు, “మేధావులు”, విమర్శకులు పెంచి పోషించిండ్రు. ఏడొ నిజాం చేసిన, లేదా చెయ్యాల్సి ఉండి చెయ్యని పనులకు బాద్యుడిని చేసినట్టే చేసినమంచి పనులకు ఏడో నిజాంకు క్రెడిట్ ఇవ్వాలనేది న్యాయం. ఈ సహజ న్యాయాన్ని మరిచి అన్యాయంగా ఆలోచిస్తే అది తప్పు. అవును సెలెక్టివ్ లీకేజీ లాగా కేవలం నిజాం ని నిందించే సాహిత్యమే వెలుగులోజి, ప్రచారం లోజి పై సంస్థలు, మేధావులు తెచ్చారు. వీళ్ళు ఎన్నడు కూడా శేషాద్రి రమణ కవులు రాసిన “నిజాం రాష్ట్ర ప్రశంస” పుస్తకాన్ని గురించి చెప్పలేదు. కుర్గంటి సీతారామయ్య రాసిన ఆదర్శ ప్రభువు నిజాం పుస్తకం గురించి రాయలేదు. పోలీసు యాక్షన్ పై ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగులో వచ్చిన సాహిత్యం పై ఇంతవరకు ఏ యూనివర్సిటీ అయినా సెమినార్ చేసిందా? మరి నిజాలు ఎలా వెలుగు లోకి రావాలి. రెండు పక్షాల వాదన విన్న తర్వాతే తీర్పు ఇవ్వాలి. కాని పైన చెప్పిన మేధావులు వాదనలు వినకుండానే తాము ముందుగానే రాసుకొచ్చిన అగ్ర వర్ణ పక్షపాత తీర్పును ప్రకటిస్తున్నారు. ఈ తీర్పుని పునః సమీశీంచు కోవాల్సిన రోజులు ఎంతో దూరములో లేవు.

  • “పంచుడు సంగతి మల్ల మాట్లాదుతున్ద్రు. మీకంత కోరిక ఉంటే తప్పకుండా ట్యాంకుబండు మీదీవి మీయి మీకు పంపించే పని గూడా బాకీ ఉంది. ఆ ఋణం కూదా తీర్చుకుంటమ్. ఇయ్యాల గాకుంటె రేపు, రేపు గాకుంటే ఎల్లుండి.”

   ట్యాంక్ బండ్ మీదివి మావి మాకు పంపించే శ్రమ మీరు తీసుకోవద్దు శ్రీనివాస్ గారు. రవాణా ఖర్చు కూడా దండగ. మీరు వాటిని పగలగొట్టేసి హుస్సేన్ సాగర్ లో పడేయచ్చు. ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు మీరు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పగలగొట్టినప్పుడు ఆంధ్రావాళ్లు ఫీలయ్యేరేమో కానీ విడిపోయాక ఫీలవరు. వాటిని మీరు ఏమైనా చేసుకోవచ్చు. తెలంగాణా లైబ్రరీల్లో ఉన్న ఆంధ్రా బ్రాహ్మణ బ్రాహ్మణేతర దళిత కవులు, రచయితల రచనల్ని కూడా హుస్సేన్ సాగర్లోనో, దగ్గర్లో ఉన్న చెరువుల్లోనో ముంచేయచ్చు. ఆంధ్రావాళ్లు ఏమీ బాధపడరు. మరి మా పోతన్న, పాల్కురికి సోమన్న మొదలైన వాళ్ళ రచనల్ని కూడా మీరు కృష్ణలోనో, గోదావరిలోనో ముంచేస్తారా అని సవాలు చేయద్దు. మొదలెట్టింది మీరే కనుక అలా అనే హక్కు మీకు లేదు. ఆంధ్రావాళ్లు అలా చేయరు.

 14. సంగిశెట్టి శ్రీనివాస్ గారూ! గతం లో మీరు ఒకచోట ` ప్రజలకు చేయడానికి పని , తినడానికి తిండి దొరికిన కాలమది ‘ అని నిజాం పరిపాలన గురించి చెపుతూ అన్నారు.అలాంటి కాలాన్నే స్వర్ణయుగం అంటారు. అందుకే అలా వ్రాశాను.
  ఎవరి పరిపాలనలోనైనా లభ్ధి పొందేవారు కొందరే వుంటారు. సామాన్యుల కడగండ్లు పాలకులకు చేరవు. ప్రభువులైనా , అధికారులైనా తమకు లభ్ధి చేకూరే వాటినే అభివ్రుధ్ధి చేసుకుంటూ పోతారు తప్ప సామాన్యుల బాగోగులు పట్టించుకోరు. వారు తమమీదనే ఆధారపడి , తమకు సేవలు చేయాలనుకుంటారు.
  మీరొకసారి ` గోలకొండ కవుల సంచిక ‘ చూడండి. దాదాపు 110 సంవత్సరాల క్రితం , నిజాం వారసుల పాలనలో , నిజాం పై ప్రశంశలు వ్రాసిన వారితోబాటు , రైతుల బాధల గురించి శ్రీ గంగుల శాయి రెడ్డి గారు , శ్రీ గవ్వా అమ్రుత రెడ్డి గారు , హరిజనుల వెట్టి చాకిరీ గురించి శ్రీ జొన్నలగడ్డ హనుమంత రెడ్డి గారు , శ్రీ ఊటుకూరు సూర్యనారాయణ రావు గారు వ్రాసినవి కూడా చూడండి.
  ఏ కాలం లోనైనా ప్రజలందరూ సుఖంగా వున్నారనుకోవడం కేవలం భ్రమ. అందుకే గతంలో జరిగిన మంచి , చెడులను విశ్లేషించుకుంటూ , ప్రజలందరకూ సమాన అవకాశాల కోసం పోరాటం చేయాలి.గతాన్ని తలుచుకుంటూ వుంటే కాలం కరిగి పోతుంది తప్ప మంచి జరుగదు.

 15. చిన్న సవరణ :– 110 సంవత్సరాలకు బదులు 80 సంవత్సరాలు అని చదువుకోవాలి. టైపు చేసటపుడు పొరపాటు జరిగింది.

 16. కుక్క తోక వంకర. జనం సొమ్ము తినే తెగ బలిసిన నిజాం కుక్క తోక మరీ వంకర. కుక్కలు ఎంత చదువుకున్నామొరగ్గలవే తప్ప మాట్లాడ లేవు.

 17. కుక్క తోక వంకర. జనం సొమ్ము తిని తెగ బలిసిన నిజాం కుక్క తోక మరీ వంకర. కుక్కలు ఎంత చదువుకున్నా మొరగ్గలవే తప్ప మాట్లాడలేవు.

 18. sangishetty srinivas says:

  ఆడ కూసోని తినొద్దు బిడ్ద అంటే అండ్లనే అద్దుకోని తింటా అంటే ఈగ నీ ఇష్తం అనదం తప్ప వేరే మార్గం లేదు.

 19. మీ సలహాకు ధన్యవాదాలు. “అది” అంటే కుక్కలకు ఎంతో ఇష్టం కనుక దాన్ని వాటికే వదిలేస్తున్న. పాపం.. నిజాం బొందల పడినంక తినేటందుకు ఏమీ లేక అవి బక్కచిక్కి నకనకలాడుతున్నై కూడానూ..

 20. నేను కవిని కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్త.. నాది రచన కాదన్నవాణ్ణి రాయెత్తి కొడత..

 21. Vijay Krishna says:

  తెలంగాణా చరిత్రను తెలంగాణ భాషలో రాయాలన్న ఉత్సాహమే తప్ప రచయితకు బొత్తిగా భాష విషయంలో సంయమనం ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయన ఈ పత్రిక లో రాసిన ప్రతి వ్యాసమూ అంతే! ఒక వాక్యం శుద్ధాంధ్ర వ్యావహారికంలోనూ, రెండో వాక్యం శుద్ధ తెలంగాణమూ.. ఇలా నడిచాయి.

  తెలంగాణ వేరు, తెలుగు వేరు అని ప్రభువులే బల్ల గుద్ది ప్రచారం చేస్తున్నా వీరు మాత్రం తెలుగే రాస్తున్నారు. అదీ దండిగా అచ్చు తప్పులతో! తెలంగాణ మాట్లాడ్డం వేరు, రాయడం వేరు. పూర్తిగా తెలంగాణమే రాస్తే పాఠకుల సంఖ్య శూన్యమవగలదు. అందుకే శుద్ధాంధ్ర వ్యావహారికంలో రాస్తూ, మధ్య మధ్యలో ఆవేశం కోసం తెలంగాణ భాషను అద్దుతున్నట్లున్నారు.

  ఇక విషయానికొస్తే…ఉద్యమం చల్లారినా ఆ నివురుని వూది వూది నిప్పు పుట్టించే వ్యర్థ ప్రయత్నాలు ముఖ్య మంత్రితో సహా ఎవరూ ఆపరు. ప్రతి వ్యాసంలోనూ నిజాం ని తలకెత్తుకు మోస్తూ, ఆంధ్ర ద్వేషం అడిషనల్ గా వెళ్లగక్కే సంగిసెట్టి గారి వ్యాసాల్లో కొత్తదనం ఎలా ఆశిస్తాం?

  అసలు వీరి వ్యాసాల్లో అచ్చుతప్పులను దిద్దేవారే కరువయ్యారా?

 22. sangishetty srinivas says:

  మీకు అలా అర్తమయ్యిందా!
  నేను రాసిన దాంట్లో అబద్దాలుంటే ఎత్తి చూపండి సరిదిద్దుకంటా.
  ఇకనైనా ఆడిపోసుకోవడం ఆపండి.

 23. srinivas sangishetty says:

  మిత్రులారా! విగ్రహాల గురించీ భాష గురించీ 20 ఏండ్లుగా చేప్పిందే మల్లీ మల్లీ చెప్పాల్సి వస్తుంది. ఆయినా మీ సౌలభ్యం కోసం మరొక్క సారి చూడండి.

  https://www.facebook.com/photo.php?fbid=186965344681716&set=pb.100001047568724.-2207520000.1412130788.&type=3&ధియేటర్

  https://www.facebook.com/photo.php?fbid=344563752255207&set=pb.100001047568724.-2207520000.1412130788.&type=3&theater

 24. srinivas sangishetty says:

  మిత్రులారా భాష గురించీ, విగ్రహాల గురించీ యేండ్ల సంధి కాళోజి, జయశంకర్ సార్ దగ్గర నుంచి చాల మంది చాల చ్ప్పిండ్రు. ఆహ్యినా మీకు ఎప్పటికీ అది కొత్తగానే అనిపిస్తుంది. ఈ విషయాల ఫై బోల్డంత చర్చ జరిగింది. అయినా మల్ల కొత్తగా మొదలెట్టాలని మీరు టైం పాస్ కు వాదన జేస్తుండ్రు. అయినా మీకోసం

  https://www.facebook.com/photo.php?fbid=344563752255207&set=pb.100001047568724.-2207520000.1412130788.&type=3&ధియేటర్

  https://www.facebook.com/photo.php?fbid=186965344681716&set=pb.100001047568724.-2207520000.1412130788.&type=3&theater

 25. srinivas sangishetty says:

  మిత్రులారా భాష గురించీ, విగ్రహాల గురించీ యేండ్ల సంధి కాళోజి, జయశంకర్ సార్ దగ్గర నుంచి చాల మంది చాల చ్ప్పిండ్రు. ఆహ్యినా మీకు ఎప్పటికీ అది కొత్తగానే అనిపిస్తుంది. ఈ విషయాల ఫై బోల్డంత చర్చ జరిగింది. అయినా మల్ల కొత్తగా మొదలెట్టాలని మీరు టైం పాస్ కు వాదన జేస్తుండ్రు. అయినా మీకోసం

  https://www.facebook.com/photo.php?fbid=186965344681716&set=pb.100001047568724.-2207520000.1412130788.&type=3&ధియేటర్

  https://www.facebook.com/photo.php?fbid=344563752255207&set=pb.100001047568724.-2207520000.1412131946.&type=3&theater

 26. srinivas sangishetty says:
 27. srinivas sangishetty says:

  మిత్రులారా భాష గురించీ, విగ్రహాల గురించీ యేండ్ల సంధి కాళోజి, జయశంకర్ సార్ దగ్గర నుంచి చాల మంది చాల చ్ప్పిండ్రు. ఆహ్యినా మీకు ఎప్పటికీ అది కొత్తగానే అనిపిస్తుంది. ఈ విషయాల ఫై బోల్డంత చర్చ జరిగింది. అయినా మల్ల కొత్తగా మొదలెట్టాలని మీరు టైం పాస్ కు వాదన జేస్తుండ్రు. విషయాలు తెలుసుకోవాలంటే నా పేస్ బుక్ అక్కౌంట్ లో పాత వ్యాసాలూ ఉన్నాయి చూడగలరు.

 28. buchi reddy gangula says:

  నిజాం పాలన స్వర్ణయుగం కాదు — కాబోదు —అ పాలనలో

  దొరలూ –అగ్రకులాల వాళ్ళు మాత్రమె —లాభపడటం — కూడా బెట్టు కోవడం —

  దోచుకోవడం జరిగింది —అ రోజుల్లో కూడా లేని తనం — పేదరికం —ఆకలి చావులు

  లేకపోలేదు —

  రవీందర్ గారు —-దొరలూ — అగ్రకులాలు పాలించిన తెలుగు రాష్ట్రం లో —

  సర్కారు వేలుగాబెట్టింది అంటూ ఏది లేదు సర్ —- p.v..గారి ని — చివిరి సారిగా

  ఎలా సాగానంపామో —- మీకు telusu—-

  కాని తెలంగాణా పాలన లో గుర్తింపు — కొంతవరకు అయినా మెరుగు అయిందని వోప్పు

  కోవాలి —

  రవీందర్ ji— కొమురం భీమ — వేడుకలు నెక్స్ట్ వీక్ — తెలంగాణా సర్కారు నిర్ణయం —

  సర్ —-

  జయశంకర్ ji- తెలంగాణా జాతిపిత — అంటూ pata..పాడింది మిరే కదా ????

  ——————————బుచ్చి రెడ్డి గంగుల

 29. kv ramana says:

  భలే ఉంది మీ అడ్డగోలు వాదం. ఒకసారి వెనక్కెళ్లి కామెంట్లు చూసుకోండి. విగ్రహాల చర్చ మొదలెట్టింది మీరే. అయినా ఆ చర్చ ఒద్దంటే కుదురుతుందా? మీ ధ్వంసచరిత్ర మిమ్మల్ని శాశ్వతంగా వెంటాడుతూనే ఉంటుంది. బుద్ధ విగ్రహాలను కూల్చేసిన ఆఫ్గన్ తాలిబన్ల తర్వాత అలాంటి పని చేసింది మీరే. అలా వాళ్ళతో పాటు మీరూ చరిత్రలో ఉండిపోతారు. మీరు చర్చ ఒద్దంటే ఆ చరిత్ర చెరిగిపోతుందా? మొత్తం తెలంగాణ అంతా తలవంచుకునేలా చేశారు. నేనన్నది ఒకటే. మీ రాష్ట్రం మీకొచ్చింది కనుక, మీరు మొదలెట్టిన విగ్రహ విధ్వంసాన్ని పూర్తి చేయండనే. ఈసారి పూర్తి పోలీస్ కాపలాతో ఆ పని చేయచ్చు. మీరు 20 ఏళ్ళు వెనక్కెళ్లండనీ, నేనేం రాశానో చూడండనీ అంటూ డిఫెన్స్ లో పడద్దు. చేసిందానికి జవాబుదారీ అవండి. మిగిలిపోయిన పనిని పూర్తి చేయండి.

 30. sangishetty srinivas says:

  డెఫెన్స్ ఏమి లేదు సోదరా
  ఎవరివి ఉంచాలో ఎవరివి తొలగించాలో మాకు తెలుసుం మీరు ఆ ఫికర్ ఏమి పెట్టుకోకండి. మీ సలహాలకు సలాములు.

మీ మాటలు

*