ఎవరైనా చేసేది వెదకడమే

Ramachandramouli

 

 

 

 

 

రాత్రి
తలుపులపై దబదబ చప్పుడు కొనసాగుతూనే ఉంటుంది
ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తారో తెలియదు
ప్రక్కనే కిటికీ
గాలి ఒక రైలు కేకను ఇనుప చప్పుళ్ళతోపాటు మోసుకొస్తూ
టక టకా పట్టాలపై చక్రాలు పరుగెత్తుతున్న జీవధ్వని
యాత్రించడమొక వ్యసనం
గడపదాటిన ప్రతిసారీ
ఎవరైనా చేసేది వెదకడమే..రోడ్లను..మనుషులను..కాలపు పొరల లోతులను
ఒంటరిగా వెళ్ళడం..సమూహమై తిరిగి తిరిగి
మళ్ళీ ఒంటరిగానే తిరిగి రావడం
కొన్ని కూడికలు..కొన్ని తీసివేతలు..అంతే
ప్రశ్నలేమో పరుగెత్తే అరికాళ్ళకింది గాజుముక్కలు
కారుతున్న రక్తానికి ఉనికుంటుందా..చిరునామా ఉంటుందా
ఉక్కపోస్తూ ఉక్కిరిబిక్కిరౌతున్నపుడు
మార్చురీ గదుల మౌనరోదన..రక్తహీనతతో పాలిపోయిన చంద్రుడు
అర్థరాత్రులు బీట్ కానిస్టేబుల్ కంకకట్టె కణకణ చప్పుడు
అలసి నిద్రపోలేక దుఃఖించే రోడ్లు
ఎక్కడినుండో ఏడుస్తూన్న కుక్క స్పృహ
ఏదో జరుగుతోంది..అని తెలుస్తూనే
ఏదీ జరుగడంలేదన్న అసత్య నిర్ధారణ
శరీరంలోనుండి బయటకు వెళ్ళిపోవడం
ఎప్పుడో మళ్ళీ తిరిగి రావడం..అప్పుడప్పుడు రాకపోవడం
మరణమా అది.?

ఒక ఖాళీ ఊయల ఊగుతూంటుంది దూరంగా..ఒంటరిగా
ఇనుపగొలుసుల చప్పుడు గాలిని చెరుస్తూ
హృదయంనిండా ఒట్టి ఎడారి
ఇసుకతుఫానులో కొట్టుకుపోతూ ఒక నువ్వూ ఒక నేనూ
శేష నిశ్శేషాల స్పృహ
చేయిని విడిచి నువ్వు కోర్ట్ అవరణలోనుండి నడిచివెళ్తున్నప్పటి
నిశ్శబ్ద వియుక్తత
ఏమిటో..అన్నీ లెక్కలు లెక్కలుగా మనుషులు భాగించబడుతున్నపుడు
కన్నీటిని తుడుస్తున్న వ్రేలు విలువెంత..వ్చ్
కనీసం కంటినిండా నిద్రపోవాలన్న కోరికతీరని వ్యాకులతలో
అన్నీ స్వప్న ఖండాలే శకలాలు శకలాలుగా రాలిపడ్తూ
శేషరాత్రంతా వెదుక్కోవడమే ఎవరికివారు
ముసుగులు తొలగిపోతూ,రంగులు వెలిసిపోతూ
లోపలినుండి దహనం మొదలై మంటలు విస్తరిస్తున్నపుడు
కాలిపోయేదేదో..కాల్చబడేదేదో అర్థంకాని నిశ్చేష్ట –

చాలా దూరమే జరిగింది ప్రయాణం
కదలికలన్నీ వ్యూహాలని అవగతమౌతున్నపుడు
నీ నా చలనాలన్నీ
ఒట్టి అనిర్ధారిత సమీకరణాలే
జవాబు రాదు .. నడక ఆగదు
సరియన జవాబు రావాలంటే
సంధించబడ్తున్న ప్రశ్న సరిగా ఉండాలి
అనిర్వచిత గమ్యంవైపు ఎన్నాళ్ళని నడుస్తూనే ఉంటావు
ఆగు..ఆగి చూచుకో లోపలికి…తొంగి తొంగి గమనిస్తున్నపుడు
దిగుడుబావిలోకి వంగి చూస్తున్నట్టు భయమేస్తోందికదా – ఊc.

– రామా చంద్రమౌళి

 

Everyone has to search…eventually!

-Prof. Raamaa Chandra Mouli

 

It’s night

the banging on the doors continues

who knows who would call whom and for what reason !

Wind blowing through the window carried with it

Taktaka… taktakaa

a hooting and the live trundling noise of wheels on the rails

travel, an addiction

after we step out of the threshold, search is unavoidable:

searching for roads

searching for people

searching the layers of life…

alone we go, as a group we roam and roam

and return alone; some additions, some subtractions

that’s all.

All questions reduce themselves to shards

under the running feet…

does the oozing blood have any identity…an address?

When stifled in humid weather, silent tears are shed

within the confines of the mortuary rooms; bloodless, the moon

appeared pale…night is filled with tap…tap noise of the police-batons…

Unable to sleep, the tired roads weep in insomniac sorrow…

Cognizance of a dog’s wail from somewhere; something is happening…

but a false confirmation of nothing occurring…a feeling of

slipping out of the body and slipping back into it at an impromptu moment;

at times not returning to the body too…is that death?

 

A vacant swing keeps swinging afar…alone;

sound from the iron chains suspended to the swing scatter the wind

desert filling the hearts: a you and an I caught in a simoom

Awareness of all that’s left…

Din of forced separation…of your walking away from the court leaving my hand…

Can’t say anything…when people get divided based on estimates

what might be the value of those loving hands that wipe the tears?

Tch…in the agony of unfulfilled wish for a sound sleep everything is

segments of dreams dropping as fossils;  rest of the night is spent

in each searching for one’s self…the masks lift, colours fade while from within

internal combustion begins and spreads as flames, a shock at

the conundrum of what’s burning and what’s being burnt…

 

it’s quite a long journey.

When it’s realized that all movements are strategies

Your and my efforts are mere unproven equations…

There will not be any answers…the walk is never suspended…

Every answer depends upon the manner the question is put.

How long will you go on walking towards an undefined destination?

Stop…! Stop and look within…deep and deeper…

Aren’t you frightened as if you were bending to look into a very deep well?

 

(original evarainaa cheeseedi vedakatamee)

Transl. Prof. Indira Babbellapati

indira

మీ మాటలు

 1. c.narasimha rao says:

  “అన్నీ స్వప్న ఖండాలే శకలాలు శకలాలుగా రాలిపడ్తూ
  శేషరాత్రంతా వెదుక్కోవడమే ఎవరికివారు
  ముసుగులు తొలగిపోతూ,రంగులు వెలిసిపోతూ
  లోపలినుండి దహనం మొదలై మంటలు విస్తరిస్తున్నపుడు
  కాలిపోయేదేదో..కాల్చబడేదేదో అర్థంకాని నిశ్చేష్ట –”

  ఔను..ఒక లోతైన ఆత్మశోధన.మంచి కవిత.లోపల ఎన్ని దహనాలో.మౌళి గారికి ధన్యవాదాలు.
  – సి.నరసింహారావు,హైదరాబాద్

 2. చాలా దూరమే జరిగింది ప్రయాణం
  కదలికలన్నీ వ్యూహాలని అవగతమౌతున్నపుడు
  నీ నా చలనాలన్నీ
  ఒట్టి అనిర్ధారిత సమీకరణాలే
  జవాబు రాదు .. నడక ఆగదు
  సరియన జవాబు రావాలంటే
  సంధించబడ్తున్న ప్రశ్న సరిగా ఉండాలి
  అనిర్వచిత గమ్యంవైపు ఎన్నాళ్ళని నడుస్తూనే ఉంటావు
  ఆగు..ఆగి చూచుకో లోపలికి…తొంగి తొంగి గమనిస్తున్నపుడు
  దిగుడుబావిలోకి వంగి చూస్తున్నట్టు భయమేస్తోందికదా – ఊc. నిజం ……ప్రశ్న సరిగా వుండాలి …అపుడే సమాధానం అవగతమవుతుంది …….ధన్యవాదములు.

 3. Gyaneswar M says:

  కవిత్వం అధ్బుతంగా ఉంది. చాలా బాగా నచ్చింది..
  “సరియైన జవాబు రావాలంటే సంధించబడుతున్న ప్రశ్న సరిగా ఉండాలి ” …. అవును సరియైన ప్రశ్న వేయడం గొప్ప టాలెంట్..మంచి అవగాహన ఉండాలి సబ్జెక్టు మీద మరియు సందర్భం మీద… ధన్యవాదములు..
  – జ్ఞానేశ్వర్ మామిడాల – పెన్సిల్వేనియా, U S A

 4. rajamohan.k says:

  ఏదో జరుగుతోంది..అని తెలుస్తూనే
  ఏదీ జరుగడంలేదన్న అసత్య నిర్ధారణ
  శరీరంలోనుండి బయటకు వెళ్ళిపోవడం
  ఎప్పుడో మళ్ళీ తిరిగి రావడం..అప్పుడప్పుడు రాకపోవడం
  మరణమా అది.?

  ఔను..అది మరణమే..జీవితంలోకి లోతుగా తొంగి చూడడం ఒక ఆత్మవివేచనతో కూడిన చర్యే.మంచి కవిత.

  -రాజమోహన్.కె

 5. బాగుంది. చాలా లోతైన అర్ధం ఉంది.

 6. buchi reddy gangula says:

  excellent–సర్
  ————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 7. chandramouli raamaa says:

  మిత్రులారా..మీ అభిమానానికి కృతజ్ఞతలు .

  – మౌళి

 8. ఈ కవిత చాలా బాగుంది..

 9. spandana.k says:

  ఈ కవిత చాలా బాగుంది.

  స్పందన.కె,బెంగళూరు

 10. పి.కృష్ణ ప్రసాద్ says:

  A good pun poem Sir ! Congratulations !

 11. సురేష్ says:

  చాల మంచి కవిత. మౌళి గారికి నా అభినందనలు.
  సురేష్, వాషింగ్టన్ డి. సి.

 12. వారిజ says:

  ఎక్స్ లెంట్ సర్.

Leave a Reply to వారిజ Cancel reply

*