ఇంకో నేను

15-tilak

 

 

 

 

నేను నేను కాదు అప్పుడప్పుడూ

రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని

అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని

అసంకల్పితంగా

రాలే ఋతువులు

నాలో కొన్ని

నిర్లిప్తాలో

నిస్సంకోచాలో

గోడ మీద అందంగా పేర్చబడ్డ సగం పగిలిన ఆత్మలో

గుర్తులేదు కానీ ఇంకా ఎన్నింటినో

వెలిసిన వర్షం తర్వాత కరెంటు తీగను పట్టుకుని వేలాడే నీళ్ళ బిందువులు

ఆత్మహత్యకు తయారవుతూ

మునుపో

నేడో

ఎప్పుడో

నిశ్శబ్దం నవ్వులో నుండి

పదాలన్ని వెచ్చని పందిర్లుగా

తెరిచి మూసిన తలుపులు

ఒరుచుకున్న ఆకాశపు మట్టి

భావాలు ఇంకొన్ని

కళ్ళనూ

కడుపునూ కన్నీళ్ళతో కుట్లేస్తూ

పగలో ఆకలి పొట్లం

ఇప్పుడు మళ్ళా నేను కాదు

మధ్యాహ్నం కడుకున్న ఎంగిలిని

కూసింత ఎర్రటి ముసురు

ఒక నిద్ర

మరో మెలకువ

రెండూ నాలోనే

నాతోనే

రాళ్లు పడ్డ పదార్థం

తరంగాలుగా పగులుతూ

నన్ను గుర్తుచేస్తూ

మనిషి నిక్షేపాలు

చెరిగిన చెమ్మ అంచు అంచుపై నిలబడుతూ

నన్ను నేను శోదిస్తూ

 

-తిలక్ బొమ్మరాజు

మీ మాటలు

  1. You invoke a pain and then you sooth it again …..same experience every time . I try not to read you to avoid the pain but cannot stop rrading u for obvious reasons .kudos thilak garu

  2. వెలిసిన వర్షం తర్వాత కరెంటు తీగను పట్టుకుని వేలాడే నీళ్ళ బిందువులు……….

    మీ కవిత్వంలోని పొందికైన పద చిత్రాలు ఆకట్టుకుంటాయెప్పుడూ. అభినందనలతో..

Leave a Reply to Nisheedhi Cancel reply

*