డాంటే, ఓ డాంటే!

Michelino_DanteAndHisPoem

డాంటే, ఓ డాంటే!

సమాధుల తలుపులు మూసాక తెరుచుకున్న
నరక ద్వారాల గురించి  మాత్రమే రాసినప్పుడు
బ్రతికున్నప్పుడు మూసుకున్న మనసు ద్వారాల
వెనక కాలుతున్న శ్మశానాలు మర్చిపోయావా??

లేదా అజ్ఞానపు ఆజ్ఞలలో ఇరుక్కొని సూర్యుడి
నీడలన్నీ చీకట్లలో నిండిపోయినప్పుడు
సాల్వేషన్ ఆకర్షణలు అన్నీ  పత్తికాయలే
ఆకర్షణ వికర్షణ అగ్ని వత్తిళ్ళల్లో  కాలిపోతున్న
హృదయం డివైన్ కామెడిని మించింది అని భయపడ్డావా ?

ఇంటెలిజెన్స్ అంతా ఈగోల ముసుగుల్లో
దూరి పెయింట్ ఇట్ రెడ్ అంటూ
ప్రపంచం కక్షల ఎరుపులు చల్లుతున్నప్పుడు
అమానవత్వం అంటువ్యాధి లా ప్రబలుతుంటే
శారీరక యుద్ధాలు తట్టుకోలేని సున్నితపు మనస్సుల్లో
మానసిక హింస ని చూసి బిత్తరపోయి
బిగుసుకుపోయిన నీ కలం మరిక కదల్లేదా ?

దురదృష్టాలు తప్పుడు సంపాదనలా పెరిగిపోయి
పవిత్రాత్మల వైన్ లో విషం చుక్కలు కలిసాక
జీవితాలు చిరుజల్లుల్లా  మనసు ని తడపడం మానేసి
కుంభవృష్టిలా ఎడాపెడా కొడుతుంటే బ్రతుకే నరకమైనప్పుడు
నరకం ఎక్కడో గీసుకున్న  ఇల్యూజన్స్ లో కాకుండా
బ్రతుకు రిఫరెన్సుల అల్యూజన్స్ లోనే దాగి ఉందని
మర్చిపోతే ఎలా  పిచ్చి డాంటే ?

అయినా ఇంత బాధ ఎందుకు ?

రెక్కలు తెగిన గువ్వ పిట్టలాంటి మనసు ని
ఒక సారి చేతుల మధ్యలోకి తీసుకొని
దిల్ యే తో బతా ..క్యా ఇరాదా హై తేరా ?
అని మార్దవంగా అడిగితే నరకంలో
కూడా నీకూ, నాకొక  “లా విటానౌవా”
ది న్యూ లైఫ్ కి రాచ మార్గం పరిచేది కాదా ?
మరిచిపోయిన మృదుత్వాలు గుర్తు చేస్తూ
ఇంకోసారి  బ్రతకటం నేర్పించేది కాదా ?

నిశీధి

* Durante degli Alighieri, simply called Dante ( 1265–1321), was a major Italian poet of the Middle Ages. His Divine Comedy, originally called Comedìa and later called Divina by Boccaccio, is widely considered the greatest literary work composed in the Italian language and a masterpiece of world literature. La Vita Nuova (“The New Life”), the story of his love for Beatrice Portinari, who also served as the ultimate symbol of salvation in the Comedy.
: source wikipedia

మీ మాటలు

  1. నిత్యా ప్రసాద్ says:

    పచ్చి నిజాలనే ప్రశ్నించారు. జవాబు కావాల్సిన ప్రశ్నలే

  2. వాసుదేవ్ says:

    మరో అద్భుత రచన. Excellent word play from your mighty pen. Dante rediscovered and Dante re-introduced to this misery stricken world. Your message once again reasserts that Poverty of thought is more dangerous than any of its other forms.
    “మానసిక హింస ని చూసి బిత్తరపోయి
    బిగుసుకుపోయిన నీ కలం మరిక కదల్లేదా ?” మళ్ళీ చదివింపచేసే వాక్యాలు. క్యుడోస్ నిషీధి గారు.

  3. madan mohan patel says:

    Idhi chadivina nenu nesheedhi swapnam vaipu nishacharudila nisha lekunda payanam modhalu petta..

  4. madan mohan patel says:

    సూపెర్

  5. madan mohan patel says:

    ఇది చదివిన నేను నిశీధి స్వప్నం వైపు నిశాచారుడిలా నిషా లేకుండా పయనం మొదలు పెట్టా …

  6. madan mohan patel says:

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ .

  7. మీరెప్పుడూ ఇలానే ఓ పెద్ద కాన్వాసుని( లాస్ట్ సప్పరంత ) రోడ్ మీద చాలా ఈజీగా సుద్దతో రాసే చిత్రకారుడిలా వేస్తూ సూటిగా గుండెల్లోతుల్లోకి దిగే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు నిషీ… మౌనంగా వుండలేమూ అలా అని అరవలేని స్థితికి చేరిన వారం ఏమనగలం.. అభినందనలు

  8. తిలక్ బొమ్మరాజు says:

    ఇంత అద్భుతంగా కవిత్వం రాయడం ఎలా సాధ్యమో అనిపిస్తుంది మీ కవిత చదువుతుంటే,పదాలన్నీ ఇంత అందంగా పేర్చడం చాలా బాగుంది,భావాలను సజీవంగా కళ్ళ ముందు పరిచారు.అభినందనలు.

  9. అబినందనలు

  10. దేవివర్మ కొవ్వూరు says:

    అభినందనలు నిషీధి గారు..!!

  11. ఫస్ట్ 4 లైన్స్ చాలా నచ్చాయి……బ్రతికున్నప్పుడు మూసుకున్న మనసు ద్వారాలు ….
    సూపర్బ్ వర్డ్స్ ,యు అర్ గ్రేట్

  12. Maddali Srinivas says:

    చాలా బాగుంది అనటం తక్కువుతుమ్ది. Divine కామెడీ లో వున్న tragedy అర్ధమయ్యింది.

  13. KVRB.SUBARHAMANYAM says:

    మొదలు పెట్టాక మీ మాటలు కోసవరకు చదివించేలా nanu paragulu pettinchayi

  14. mahesh panchala says:

    చాలా బాగుందండి నిశీధి గారు..

  15. అత్యద్భూతం….The way you think and write is more than what I could praise…The usage of words, the flow of thoughts….Nope…No more words to express the feel that I get when I read your poetry….Your thoughts n writes ups are fantastic

  16. నిశీ, మీ బుర్ర/ఆలోచనల కర్మాగారం నుంచి జారి పడిన ఆలోచనలని (ఎప్పటికప్పుడు fresh thoughts నింపుకుంటూ పాతవి మా మొహాన కొడుతూ ) కలం సాయంతో ఇక్కడ గుట్టలుగా పోసిపారేస్తే చదివి మేము ఏమైపోవాలి…మాకు కూడా మీ స్పూర్తితో రాయాలనే పాడు బుద్ది పుట్టించేంత బాగా రాసిపారేస్తే మేం రాస్తే పాపం లోల్ జనం ఏమైపోవాలి…మీరలా రాస్తూ మా బుర్రల మీద మీ ట్రేడ్ మార్క్ ఆలోచనల ముద్రని ఇంకా ఇంకా బలంగా వేసేస్తే ఆలోచించటం మర్చిపోయిన మా బుర్రలు ఏమైపోవాలి…

    అసలా పదాలని అలా పేర్చటం ఎక్కడ నేర్చారో గానీ… కొత్త కొత్త పద ప్రయోగాలు ఎలా చేస్తారో గానీ… నాకైతే నాలుగు లైన్లు మీరు రాసినవి చదవగానే అసూయతో ఒళ్ళు మండిపోతుంది మీలా రాయలేనందుకు. మీకిదే ఆఖరి సారి చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ అడగద్దు ముఖపుస్తకంలో ద్వారా నాకు తెలిసిన నే చదివే వారిలో నా ఫేవరెట్ పోయట్ పోస్ట్ మీకిచ్చేశా… ప్రతీ విషయం/అంశం/కవిత లో నాబోటి వాళ్ళకు తట్టని మరో యాంగిల్ ని టచ్ చేయటం, దానిని మీ స్టైల్ సిగ్నేచర్ తో రాయటం, వాహ్.. అదే ఆ ధాట్ ప్రోసెస్ కే నే అభిమానినైపోయింది.

    మీ డాంటేని ఇప్పుడే చదివి/పలకరించి వస్తున్నా. యాజ్ యూజువల్ చాలా బాగా రాశారు. మీ ప్రశ్నలకు ఊపిరాడక అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయా. మీకు నా అభినందనలు. లవ్ యూ డియర్. Believe me, You are one of the best personalities in my ముఖపుస్తకం/friends list.com.

  17. నిశీధి says:

    మాములుగా ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకోవటం కంటే కూడా ఎడిటర్ కళ్ళద్దాల లోంచి జల్లెడై వెబ్ మేగజైన్ లో రావటమే ఒక మంచి అనుభూతి అనుకుంటే ఇంత మంది స్నేహితులు ఆత్మీయం గా వచ్చి సారంగాలో మరీ అభినందించడం నిజంగా చాలా గొప్పగా ఉంది , థాంక్స్ అల్ .

Leave a Reply to madan mohan patel Cancel reply

*