స్నేహం, సంస్కారం రెండూ కలిస్తే …బాపు!

        బాపు

  ఆయన మన అభిమాన చిత్రకారుడు, సినిమా దర్శకుడు, హాస్య ప్రియుడు. బాపు తర్వాత బాపు అంతటివాడు.

          చేయెత్తి దణ్ణం పెడితే, తనని కాదు, ఎవరినో అనుకుని వెనక్కి తిరిగి చూసేంత నిగర్వి.

          మనందరం గర్వించదగ్గ మనిషి. ఆయన చిత్రాలూ, కార్టూన్లూ, సినిమాలూ చూసి ఆనందించటం, ఆయన జీవించిన యుగంలోనే మనమూ వుండటం మన చేసుకున్న అదృష్టం.

          ఆయనతో పరిచయం, నాకు అదృష్టంన్నర. మళ్ళీ మాట్లాడితే ఇంకా ఎంతో బోలెడు ఎక్కువ అదృష్టం.

౦                           ౦                          ౦

మొట్టమొదట బాపూగార్ని1996లో హ్యూస్టన్ నగరంలో కలిసాను. చూడగానే ఈయనేనా బాపుగారు అనుకున్నాను. కొంచెంసేపు కూడా అవకుండానే, ఈయనే బాపుగారు అని తెలిసిపోయింది. ఆయనతో మాట్లాడటమే, గిరీశం అన్నట్టు, ఒక ఎడ్యుకేషన్. ఆయన మాట్లాడుతుంటే, హాస్యానికి భాష్యం చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు పూర్తిగా ఆయనతో గడిపి, ఆ రోజుని నా జీవిత పుటలలో భద్రంగా దాచుకున్నాను. అంతకు ముందే నా కథలు కొన్ని చదివానని చెబితే, ముఖమాటం కొద్దీ అంటున్నారులే అనుకున్నాను. నా కథల ద్వారా నేను వ్రాసిన దేవుడి మీద నా నమ్మకాలు నాకే చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు. నా “అమెరికా బేతాళుడి కథలు” పుస్తకం ఇస్తే, కళ్ళకద్దుకుని తీసుకున్నారు. తప్పకుండా చదివి తన అభిప్రాయం వ్రాస్తానన్నారు. ఏదో బిజీగా వుండే పెద్దమనిషి కదా, సరదాగా అన్నారనుకున్నాను. తర్వాత ఒక నెల రోజుల్లో

తనకి నచ్చిన విషయాలూ, సంఘటనలూ వివరంగా రెండు పేజీల్లో వ్రాసి నన్ను ఆశ్చర్యపరిచిన గొప్ప పాఠకుడాయన.

అప్పుడే ఇంకొక సంఘటన జరిగింది. ఆయన కాలిఫోర్నియాకి అనుకుంటాను, ఫీనిక్స్ మీదుగా వెళ్ళాలి. ఫీనిక్స్ ఎయిర్పోర్టులో ప్లేన్లు మారాలి. కొంచెం గాబరా పడిపోయి, మీకు ఎవరైనా తెలిస్తే అక్కడ ఎయిర్పోర్టుకి వచ్చి సహాయం చేయమని చెప్పగలరా అని అడిగారు. తప్పకుండాను అన్నానే కానీ, నాకు ఆ రోజుల్లో అక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళనీ వీళ్ళనీ అడిగితే, చివరికి అక్కడ వుండే ఒకాయన ఫోన్ నెంబరు దొరికింది. ఆయనకి ఫోన్ చేసి, “నేను ఫలానా, మాకు తెలిసిన వారికి మీ సహాయం కావాలి” అని విషయం చెప్పాను. ఆయన పాత తెలుగు సినిమాలో రేలంగిలా “ఎవడ్రా వీడు.. ముక్కూ ముఖం తెలీకుండా సహాయం అడుగుతున్నాడు” అనుకుని వుంటాడు, అయినా ఆరోజుల్లో ఇంకా సాటి తెలుగువాళ్ళం పరస్పరం గౌరవించుకునే వాళ్ళం కదా, అందుకని మర్యాదగానే, “ఎవరండీ ఆ వచ్చే ఆయన” అని అడిగాడు. “బాపూ గారని..” ఇంకా చెబుతుండగానే ఆయన ఎగిరి గంతేసాడని అర్ధమయిపోయింది. తర్వాత బాపూగారు అన్నారు, “అదేమిటండీ, నాకు సహాయం కోసం ఎవర్నో ఒకర్ని రమ్మని చెప్పమంటే, మరీ పెద్ద బెటాలియన్నే

పంపించారు” అని. అదీ ఆయన గొప్పతనమే అని నమ్మటం ఇష్టపడని గొప్ప మనిషి ఆయన.

తర్వాత ఆయన అమెరికాకి వచ్చినప్పుడల్లా ఎక్కడో అక్కడ కలుస్తూనే వున్నాను. ఎంతో ప్రేమగా పలకరించేవారు.

నా “గవర్నమెంటాలిటీ కథలు” పుస్తకానికి రమణగారు ముందుమాట వ్రాసి ఇచ్చారు. బాపుగారు అట్ట మీద బొమ్మ వేస్తానన్నారు కానీ, భాగవతం సీరియల్ తీస్తూ బిజీగా వుండి, వ్రాయలేకపోయారు.

“నన్ను క్షమించాలి. ఈసారి ఒకటి కాదు, మీకు రెండు పుస్తకాలికి బొమ్మలు వేస్తాను” అని ఉత్తరం వ్రాసిన ఎంతో పెద్దమనిషి.

తర్వాత ఒక సంవత్సరం గడిచిందనుకుంటాను. ఒకరోజు ఉత్తరాల కట్టలో, బాపుగారి ఉత్తరం వుంది. ఆయనకి మెహిదీ హసన్ సంగీతమంటే ప్రాణం. మెహిదీగారి సంగీతమంతా ఆయన దగ్గర వుందిట. మెహిదీ హసన్ కొడుకు అమెరికాలో కొలరాడోలో వుంటాడని తెలిసింది. ఇంట్లో కచేరీ చేసుకునేటప్పుడు పాడుకునే కొన్ని టేపులు ఆయన దగ్గర వుండే అవకాశం వుంది కనుక, అవి తెప్పించి పెట్టగలరా అని సారాంశం. “పుస్తకానికి ముఖచిత్రం వేయమంటే కుంటిసాకులు చెప్పాడు, ఇప్పుడేమో సంగీతం టేపులు కావాలని అడుగుతున్నాడు అనుకోకండి. సంగీతానికి సిగ్గూ ఎగ్గూ వుండవు” అని ఉత్తరంలో వ్రాసారు,

బాపూగారంటే నాకు భోలెడు ఇష్టం కాబట్టి, ఎలాగైనా సాధించాలని పట్టుబట్టాను. వరుసగా నాలుగు రోజులు ఎంతోమందికి ఫోన్ చేసి తారీఖ్ హసన్ గారిని పట్టుకున్నాను. ఆయన కూడా పాటలు చాల బాగా పాడతాడు. పేరున్న మనిషి. ముక్కూ ముఖం తెలియని నాతో మాట్లాడతాడని అనుకోలేదు. అయినా చాల స్నేహపూరితంగా మాట్లాడాడు. బాపుగారి గురించీ, ఆయన కోరక గురించీ అంతా చెప్పాను. అంతేకాదు, మెహిదీ హసన్ మద్రాసు వచ్చినప్పుడు బాపూగారు గీసిన ఆయన చిత్రాన్ని నాకు పంపించారు, తారీఖ్కి ఇవ్వండి అని వ్రాస్తూ. మీరు టేపులు పంపిస్తే, నేను మీ నాన్నగారి బాపూ బొమ్మ పంపిస్తాను అని. ఆయన వెంటనే టేపులు పంపించాడు. నేను ఆయనకి బొమ్మ పంపించాను. బాపుగారు “ఆ టేపుల క్వాలిటీ అంత బాగాలేదు కానీ, పాటలు చాల బాగున్నాయి. సంతోషం!” అని చెప్పారు తర్వాత.

తర్వాత నేను ఇండియా వెళ్ళినప్పుడు, బెంగుళూరు నించీ గుంటూరు వెడుతూ, మద్రాసులో బాపు గారింటికి వెళ్లాను.

“మద్రాసులో మా ఇల్లు ఎవరికీ తెలీదు. టాక్సీ ఎక్కి, సినిమా యాక్టర్ మాముట్టి ఇంటికి తీసుకు వెళ్ళమనండి. ఆయన ఇంటికి ఎదురిల్లే మాది” అని చెప్పారు రమణగారు.

నేను వెళ్లేసరికీ ఎండలో బయట నిలుచుని వున్నారు రమణ గారు “వచ్చారా” అంటూ.

“అదేమిటి సార్, ఎండలో నుంచున్నారు” అంటే, “మీకు దారి తెలుస్తుందో, లేదోనని” అన్నారాయన.

“అమెరికానించీ ఇండియా వచ్చివాడిని, సెంట్రల్ స్టేషన్ నించీ మీ ఇంటికి రాలేనా గురువుగారూ” అంటూ, అయన అలా ఎండలో ఎదురు చూసినందుకు బాధ పడ్డాను.

నా జీవతంలో ఎంతో మరువలేని రోజు అది. బాపుగారు కానీ, రమణగారు కానీ, కష్టాలూ సుఖాలూ ఏం మాట్లాడినా, హాస్యం రంగరించే చెబుతారు. జీవితంలో ప్రతి నిమిషాన్నీ అలా అనుభవించటం ఒక వరం. అప్పుడే గుర్తుకి వచ్చింది రమణగారు పెళ్లిపుస్తకం సినిమాలో వ్రాసిన గొప్ప డైలాగ్.

“నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు. ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!” అని.

ఆ మధ్యాహ్నం వాళ్ళింట్లోనే భోజనాలు. భాగ్యవతిగారు, శ్రీదేవిగారు ఆప్యాయంగా వండి, వడ్డించిన అసలు సిసలు గోదావరి వంటకాలు.

అప్పుడే నాకు అనిపించిది. నేనెవర్ని? అంత గొప్పవాళ్ళకి నేను ఏమవుతాను? బాపూ రమణల కళా వైదుష్యం ముందూ, పేరు ప్రతిష్టలకి ముందూ, నేనెంత? ఎందుకు నాకీ మర్యాదలు?

దానికి ఒక్కటే జవాబు. అది వారి సంస్కారం! మనం ఎవరైనా వాళ్ళు చేసేది అదే!

అది ఏ వ్యక్తిలోనైనా ఒక మనిషిని చూడగలిగే గొప్ప వ్యక్తిత్వం!

చీకటిలో చందమామ, ఎన్నారై కథలు అనే నా రెండు పుస్తకాల వ్రాతప్రతులూ బాపుగారికిచ్చాను. “మీకు వీలున్నప్పుడే ముఖచిత్రం వేయండి, గురువుగారు!” అని చెప్పి.

ఇక సెలవు తీసుకుంటానని చెప్పి, “మీ ఇద్దరి కాళ్ళకీ నమస్కారం చేసి వెడతాను సార్” అన్నాను.

కుర్చీలో కూర్చున్న రమణ గారు కాళ్ళు క్రిందకి దించారు. పాదాభివందనం చేసాను.

కార్పెట్ మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాపుగారు, “మీరు అమెరికా వాళ్ళు. షేఖాండ్ ఇవ్వండి చాలు” అన్నారు.

“లేదు. నేను ఇండియా వాడినే. మీ కాళ్ళు ముందుకి చాపండి” అన్నాను.

“నా కాళ్ళు. నేనివ్వను” అన్నారు బాపుగారు.

“మీరు ఇవ్వక పొతే, నేను వెళ్ళను. ట్రైన్ మిస్సవుతాను” అన్నాను.

మా ఇద్దరి పట్టుదల చూసి రమణగారు తీర్పు ఇచ్చారు. “బాపూ.. నీ కాళ్ళు చాపూ..” అని.

ప్రాణ స్నేహితుని మాట జవదాటని బాపూగారు, కాళ్ళు ముందుకి చాపారు. నేను ఆయన కాళ్ళకి నమస్కరించి బయల్దేరాను.

మర్నాడు ప్రొద్దున్నే గుంటూరుకి ఫోన్ చేసారు బాపుగారు. “బొమ్మలు రెడీ.. పంపిస్తున్నాను” అని.

ఆయన ఆ రాత్రి అసలు నిద్ర పోయారా అని నా అనుమానం! బాపుగారు నా రెండు పుస్తకాలకి ముఖచిత్రం వేస్తానన్న మాట నిలబెట్టుకున్నారు.

తర్వాత కొన్నేళ్ళకి, వంగూరి ఫౌండేషన్ వారు హైదరాబాదులో నిర్వహించిన ప్రప్రధమ ప్రపంచ తెలుగు సదస్సు, బాపు రమణల స్నేహానికి షష్టిపూర్తి సందర్భంగా నిర్వహించారు. దానిలో బాపు, రమణల గురించి మాట్లాడి, వారిని ఆహ్వానించే అదృష్టాన్ని నాకు ఇచ్చారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజుగారు. ఆరోజే బాపుగారు, రమణగారు నా రెండు పుస్తకాలు ఎన్నారై కబుర్లు ఒకటి, ఎన్నారై కబుర్లు మరోటి ఆవిష్కరించారు కూడాను.

బాపూ రమణలు, ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోవటమే కాదు, ప్రతి తెలుగువారి హృదయం మీదా పెద్ద ముద్ర వేసారు. చెరపలేనంత ప్రేమ ముద్ర అది. మనిషికీ మనిషికీ మధ్య ఏముంటుందో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ద్వారా చెప్పిన సహృదయులు. కళాకారులు. స్నేహితులు.

మిమ్మల్ని మేం మరచిపోలేం గురువుగారూ!

అంతేకాదు మీరెక్కడికీ వెళ్ళలేదు, సార్. మా హృదయాల్లో అలా నిలిచేవున్నారు! నిలిచే వుంటారు!

౦                           ౦                           ౦

సత్యం మందపాటి

satyam mandapati

మీ మాటలు

  1. balamurali krishna goparaju says:

    Very nice article. I can almost visualize evety scene you described in the article. Though I do not have any personal touch with them, I am one if several millions of telugus whom they touched in their own way. Every bit of your description of the great characters is very apt.
    Thanks Satyam garu.

    • Satyam Mandapati says:

      అది పదహారణాలా నా మనసులోని మాట. అందుకే బాగా వచ్చుంటుంది. మీకు నచ్చుంటుంది! ధన్యవాదాలు.

      సత్యం

  2. వార్త వినగానే, మనసు మూగబోయింది, మెదడు మొద్దు బారింది, మాట నోట రావడం లేదు, మీకు అనుభవాలు అనుభూతులయినా మిగిలాయి,సంతసం, మాతో పంచుకున్నందుకు.

  3. Koteswar Rao says:

    akshara satyaalu raasaaru.

  4. బాపుగారు ఎవరిమీదనైనా కోపం ప్రదర్శించిన సందర్భం గురించి ఒక్కరూ ఇంతదాకా చెప్పలేదు. ఇంత సౌమ్యుడు చిత్రసీమలో ఎలా ఇమిడారో అందరికీ ఆశ్చర్యమే.

    • Satyam Mandapati says:

      నేను విన్నదేమిటంటే ఆయనకీ కోపం కొంచెం ఎక్కువేనట! కాకపొతే, నాలాగా మీలాగా పెద్దగా అరవకుండా, కోపం వచ్చినప్పుడు అక్కడినించీ వెళ్ళిపోయి నిశ్సబ్దంగా బొమ్మలు గీసుకునేవారుట! అలా చూస్తే, బాపుగారికి ఎంత కోపం వస్తే అన్ని బొమ్మలు ఎక్కువగా వస్తాయేమో!

  5. P.Jayaprakasa Raju. says:

    Kandukuri Ramesh Babu
    23 hrs · Edited · ·
    ఎవరు మరణించినా సహజంగానే బాధ ఉంటుంది. కాని ప్రతి మరణాన్ని మనం ఓన్ చేసుకో కూడదు. జీవితాని తప్ప.
    …………………………………………………………………………………
    మొతానికి బాపు గొడవ ముగిసింది. ‘కోతి కొమ్మొచ్చి’కథకు సెలవు. ప్రధానంగా ఆంధ్ర పెట్టుబడికి పుట్టిన పత్రికా -ప్రచురణ మాధ్యమం, సినిమా మాధ్యమాల ద్వారా బాగా గుర్తింపు లోకి వచ్చిన ‘బాపు’ పోయారు. వారు లేని లోటు నాకేమి లేదు. ఒక కాపు రాజయ్య గీత, కొండపల్లి బొమ్మ గురించి తెలిసిన వారికి సహజంగానే publicity designer మరియు illustratorకు -artistకు ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది. ఆ తేడా తెలియకుండా చేసిన మీడియా, మేధావులు బాపు గురించి ఇప్పుడు మల్లి too much చేస్తారు. కాని వారు లేని లోటు హాయిగానే ఉంది. పోయిన వాళ్ళంతా మంచోల్లు. కాని, బాపు మరణించడం తో ఇక వారం పది రోజులు తెలుగు జాతి, తెలుగు సంస్కృతి పేరుతో మీడియా ముక్యంగా తెలంగాణా వాళ్ళను ఎంత ఎదిపిస్తుందో చూడాలి. బాపు నుంచి ప్రేరణ పొంది, ఆర్టిస్ట్ లు కాకుండా cartoonists, illustratorsగానే మారిన మన మిత్ర కలా కారుల గొడవ కూడా ఈ వారం భరించాలి. తప్పదేమో! చివరగా -ఆంధ్ర మధ్య తరగతి తీరుబడి నుంచి పుట్టిన బాపుకు – వారి బొమ్మకు, బొమ్మల కథలకు తెలంగాణా బిడ్డగా నా నివాళి. పోయిన వాళ్ళంతా మంచోల్లు. ఇది నాఅభిప్రాయం . argue చేయాలని కాదు, just sharing మై ఫీలింగ్.
    ఎవరు మరణించినా సహజంగానే బాధ ఉంటుంది. కాని ప్రతి మరణాన్ని మనం ఓన్ చేసుకో కూడదు. జీవితాని తప్ప.
    …………………………………………………………………………………
    మొతానికి బాపు గొడవ ముగిసింది. ‘కోతి కొమ్మొచ్చి’కథకు సెలవు. ప్రధానంగా ఆంధ్ర పెట్టుబడికి పుట్టిన పత్రికా -ప్రచురణ మాధ్యమం, సినిమా మాధ్యమాల ద్వారా బాగా గుర్తింపు లోకి వచ్చిన ‘బాపు’ పోయారు. వారు లేని లోటు నాకేమి లేదు. ఒక కాపు రాజయ్య గీత, కొండపల్లి బొమ్మ గురించి తెలిసిన వారికి సహజంగానే publicity designer మరియు illustratorకు -artistకు ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది. ఆ తేడా తెలియకుండా చేసిన మీడియా, మేధావులు బాపు గురించి ఇప్పుడు మల్లి too much చేస్తారు. కాని వారు లేని లోటు హాయిగానే ఉంది. పోయిన వాళ్ళంతా మంచోల్లు. కాని, బాపు మరణించడం తో ఇక వారం పది రోజులు తెలుగు జాతి, తెలుగు సంస్కృతి పేరుతో మీడియా ముక్యంగా తెలంగాణా వాళ్ళను ఎంత ఎదిపిస్తుందో చూడాలి. బాపు నుంచి ప్రేరణ పొంది, ఆర్టిస్ట్ లు కాకుండా cartoonists, illustratorsగానే మారిన మన మిత్ర కలా కారుల గొడవ కూడా ఈ వారం భరించాలి. తప్పదేమో! చివరగా -ఆంధ్ర మధ్య తరగతి తీరుబడి నుంచి పుట్టిన బాపుకు – వారి బొమ్మకు, బొమ్మల కథలకు తెలంగాణా బిడ్డగా నా నివాళి. పోయిన వాళ్ళంతా మంచోల్లు. ఇది నాఅభిప్రాయం . argue చేయాలని కాదు, just sharing మై ఫీలింగ్.

    • Satyam Mandapati says:

      రాజుగారు:
      మీరు ఏం వ్రాస్తున్నారో మీకు తెలుసుననే అనుకుంటాను. ఇక్కడ ఆంధ్రా, తెలంగాణా రాజకీయాలు లేవు. ఇతర చిత్రకారుల ప్రసక్తే లేదు. మీకీ అలోచనలు ఎక్కడినించీ వచ్ఛాయో , ఎందుకు ఇలా వ్రాస్తున్నారో కూడా అర్ధంకాలేదు. నా వ్యాసం మీకు నచ్చకపోతే అలా వ్రాయండి. నాకేం అభ్యంతరం లేదు. మేము అందరి హృదయాలలోనూ ఎన్నో దశాబ్దాలుగా నిలిచివున్న, ఒక కళాకారుడి నిర్యాణ సమయంలో ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. దయచేసి ఇలాటి కష్ట సమయంలో మీ కుళ్ళు రాజకీయాలను ఇక్కడికి తీసుకువచ్చి, ఇలాటి వాతావరణాన్ని దయచేసి నాశనం చేయకండి! ధన్యవాదాలు.

      • P.Jayaprakasa Raju. says:

        అది నేను వ్రాసింది కాదండి. మరొక్కసారి నా పొస్ట్ చూడండి.

      • Satyam Mandapati says:

        మరి మీరెందుకు పోస్ట్ చేసారు? వాళ్ళే చేసుకోవచ్చు కదా.. ఎవరో ఏదో ఎక్కడో పిచ్చిపిచ్చిగా వాగినవన్నీ ఇక్కడెందుకు? ఇది సాహిత్య పత్రిక. రాజకీయ పత్రిక కాదు. కనీసం ఇలాటి వాటిని ఖండిస్తున్నానని మీరు చెప్పవచ్చు కదా.. అప్పుడు మీ ఉద్దేశ్యం ఏమిటో మాకు తెలిసేది కదా.. అయినా ఇక్కడ అది మీరు పోస్ట్ చేయవలసిన అవసరంలేదే.. ఇంత చక్కటి స్థబ్ద వాతావరణాన్ని నాశనం చేసిన పోస్ట్ అది. బాపూగారి మీద మా అభిమానాన్ని దిగజార్చిన పోస్ట్ అది..

  6. P.Jayaprakasa Raju. says:

    Kandukuri Ramesh Babu added 16 new photos.
    11 hrs ·
    ఇవి కాపు రాజయ్య రేఖా చిత్రాలు. తెలంగాణా కట్టు బొట్టు నడతకు, సంసృక్రుతికి ప్రతిబింబాలు. వీటి నుంచి నా వరకు నాకు బొమ్మలు స్ఫూర్తి. నా తొలి ఛాయా చిత్ర ప్రదర్శన వారికే అంకితం చేసాను. చెప్పడం ఏమిటంటే, మా జాతి వేరు మా నీతి వేరు. మా కష్టం వేరు, మాకు జరిగిన నష్టం వేరు. మా బొమ్మ కూడా వేరు. తెలుగు జాతి ఒకటే గాని బొమ్మలు వేరని| స్పూర్తులు వేరని. good day friends.

    • g b sastry says:

      భాషకి దేశానికి వారు చేసిన సేవ మరచి ఆంధ్రా వాళ్ళన్న పేరు పెట్టి (రాయలు ఆంధ్రావాడు ఎలా అయాడో వారి విజ్ఞతకే తెలియాలి) తెలుగువారిగా పెట్టుకొన్న విగ్రహాలని విరగ్గొట్టిన వారికి బాపు తెలుగులకు/తెలుగుతనానికి చేసిన దేమిటో ఎలా అర్ధం అవుతుంది? యద్భావం తత్ భవతి అని పెద్దలు అందుకే అన్నారుగదా !
      క్రీస్తు అన్న మాట ఒక్క సారి స్మరించుకుని వారిని వదిలేద్దాం .
      ‘భగవంతుడా వారేమి చేస్తున్నారో వారికే తెలియదు వారిని క్షమించు ‘
      G B శాస్త్రి.
      మొబైల్ 9035014046

  7. P.Jayaprakasa Raju. says:

    కొందరి ఆలొచనలు ఎలా వుంటావో తెలుపడానికి పై పోస్టులు పెట్టాను.

  8. Ramani Vishnubhotla says:

    బాపు గారి బొమ్మలతో పెరిగిన వాళ్ళం. బాపు రమణల గార్ల కార్టూన్లతో, చిత్రాలతో లోకాన్ని చూసిన వాళ్ళం. ఈ కాలంలో జీవించి ఉండడం మన అదృష్టం ….. ఇంకా బోలెడు ఎక్కువ అదృష్టం…
    వారి గీతలని, రాతలని, సృజనాత్మక శక్తిని, చలన చిత్రాల భావుకతని, తత్ద్వారా వారు మిగిల్చిన సంస్కృతిని పది కాలాల పాటు ఆస్వాదించగలమని, కొంతైనా ఆచరించగలమని ఆశిద్దాం..

    • Satyam Mandapati says:

      బాపుగారు ప్రతి తెలుగువాడి హృదయంలోనూ ఎన్నో దశాబ్దాలనించీ పదిలంగా కూర్చున్నారు. మీరు చెప్పినట్టు ఆయన కాలంలో మనం అందరం జీవించి వుండటం మన అదృష్టం.

  9. రమణ బాలాంత్రపు says:

    ఆత్మీయులు సత్యం గారూ
    నమస్తే

    మీరు మనస్సు లోతుల్లోంచి వ్రాయడం వల్ల గాబోలు మనసుకి హత్తుకుపోయింది. నేను సినిమా రంగంలో మసిలిన నాలుగయిదు సంవత్సరాలలో, బాపు గారిని ఎన్నో సార్లు కలిసాను.
    నేను ఎంత ప్రయత్నించినా బాపు గారి కాళ్ళకి నమస్కరించలేకపోయాను. కానీ వారిని ఎప్పుడు కలిసినా నేను ఉన్న చోటునుంచే నేలని తాకి కళ్ళకి అద్దుకోనేవాడిని. లేచి చూసేసరికి బాపు గారు రెండు చేతులూ జోడించి నాకు నమస్కరిస్తూ కనిపించే వారు.
    భవదీయుడు
    రమణ బాలాంత్రపు
    సానా, యెమెన్

    • Satyam Mandapati says:

      అవును. బాపుగారు ఒక కళాకారుడుగానే కాక ఒక వ్యక్తిగా కూడా ఆయన్ని తెలిసినవాళ్ళు ఎంతో ఇష్టపడతారు. చాల నిరాడంబరులు. ఏనాడూ గుర్తింపు కోసం కానీ, అవార్డుల కోసం కానీ, కొందరు చౌకబారు మనుషుల్లా వెంటపడలేదు.

  10. అయ్యా సత్యం గారూ ! మరీ అంత అసహనం ప్రదర్సించకండి. బాపూ గారి మరణం మాకూ బాధ కలిగించింది.
    సారంగ సాహిత్య పత్రికే కాదు , రాజకీయ అభిప్రాయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
    సారంగలో పోష్టు చేయడానికి మీ అనుమతి అక్కరలేదు. అది ఎడిటర్ గారు చూసుకుంటారు.
    బాపూ గారి మరణం గురించి బాధపడి , వారిని గుర్తు చేసుకునే వారే కాక , ఇలాటి హ్రస్వద్రుష్టి కలవారు , అన్నీ ప్రాంతీయ సంకుచితత్వంతో చూసేవారు కూడా వుంటారని చెప్పడమే నా వుద్దేశ్యం. వారి అభిప్రాయాలను ఖండించడం కూడా జరిగింది. అది వేరే విషయం.
    ఈ పోష్టు పెట్టడం వలన మీ అభిమానం దిగజారితే , అనుమానించాలిసిందే !!

  11. radhakrishna vunguturi says:

    bapugariki Satyamgari nivali chala bagundi.

  12. g b sastry says:

    తెలుగు వారందరమూ ఇక బాపుగారు లేనివారమైనాము ,తెలుగుతనానికి పెట్టని కోటగానిలిచిన వారిరువురూ కూడ బలుక్కున్నట్టు ఒకరితరవాత ఒకరు మనలని విడిచి పోయారు
    జీ బీ శాస్త్రి
    919035014046

మీ మాటలు

*