వేకువతో వెంటాడే సున్నితత్వపు పాట – గుల్జార్

photo.php

చిత్రం: అన్వర్

 

 

ఇవాళ గుల్జార్ పుట్టినరోజు.

ఎనభై వసంతాల నిత్య వసంతపు పాట కి, రోజూ ఎక్కడో ఒకచోట వినబడే గుల్జార్ కీ రోజూ పుట్టిన రోజే .. అసలు ఒక రోజేంటి ?

అది కూడా విచిత్రంగానే అనిపిస్తుంది నాకు .

ఆనేవాలా పల్ జానేవాలా హై’ అని తెలిసిన గుల్జార్ అనబడే పంజాబీ పెద్దాయన కి మనం ఏం చెప్పగలం ? అతని పాట లేకపోతే ఎన్నో రాత్రులూ , కొన్ని చోటీ బాతోన్ కీ యాదేం ఎలా చెప్పాలో మనకి రాదనీ నిజాయితీ గా , నిర్మొహమాటం గా వోప్పుకోవటం తప్ప ..!!
గుల్జార్ పాటల మీద ఎలా విపరీతమైన ప్రేమ ఏర్పడింది అని హిందీ పాటల ప్రేమికులని మాత్రం అడగమాకండి.. మనల్ని కొట్టినంత పని చేస్తారు .. అసలు అతని లిరిక్స్ లేకపోతే , హిందీ పాటకి సంపూర్ణత్వం లేదని అందరూ వొప్పుకొనే విషయం .. బడీ బెవజే జిందగీ జా రహీ హై .. అని ఆయన తన పాటలోనే చెప్పినట్టు ..!
ఒక కవి తలచుకుంటే ఇంత ప్రభావితం చేయగలడా .. అది కూడా కమర్షియల్ స్ట్రీంలో పాటలు రాసి కూడా అనేది నాకొక ఆశ్చర్యకరమైన విషయం .. “చయ్య చయ్య ” నుండీ జిందగీ న మిలేగీ దోబారా వరకూ ఆయన రాసిన పాటలే ఉదాహరణ.

Gulzar_signature
కానీ నాకొక ఉద్విగ్నభరితమైన జ్ఞాపకంగా గుల్జార్ మారిన సంఘటన కూడా జరిగింది . ఏదో పని మీద భోపాల్ వెళ్ళిన నేను అక్కడ ఉన్న ఒక మానసిక వికలాంగుల సంస్థ ” అరుషి” ని చూద్దామని అనుకోవటం , చూడటం జరిగింది . వెళ్ళేదాకా తెలియలేదు, దానివెనుక ఉన్న దిల్దార్ గుల్జార్ అని .
ఏం చెప్పను.. ప్రతీ మానసిక, శారీరక వికలాంగులైన పిల్లల నవ్వుల్లో , వాళ్ళ పాటల్లో , మాటల్లో ..గుల్జార్ ని చూడగలిగాను. పిల్లల చేత పాడించి , రికార్డ్ చేసేందుకు, అక్కడ ఒక రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది. ఒక గుడిని దర్శించినట్టు నా గుండె కొట్టుకుంది. ఎంత గొప్ప బలహీనతనైనా , అవకరానైనా , జయించగలడు కవి .. అతని అక్షరాలు అని అర్ధమైన క్షణం అది.

అరుషి అంటే , సూర్యుని మొదటి కిరణం అంట .. అక్కడ రాసిన ప్రతీ పదం .. భావం గుల్జార్ వి.. ఎలా అనిపించిందో తెలుసా …” యెహ్ జిందగీ గలే లగా లే .. హం నే భీ తేరే హర్ ఎక్ గమ్ కో గలే సే లగాయా హై.. హై నా ”

gulzar4
కొన్ని భావాలకి పదాలు రాయటానికి మనం గుల్జార్ కాము.  కానీ కవి అక్షరాలు ఒక వేకువ పాటగా, జీవితాంతం తోడు గా మారిన క్షణాలవి.
గుల్జార్ సాహిత్యం రంగుల హరివిల్లుగా మారి .. ఆందోళనల వాన వెలసి, మనసు తడితో, తేలికపడ్డ క్షణాలవి .. మనఃస్పూర్తి గా కళ్ళనీళ్ళు పెట్టుకున్న అపురూపమైన ఘడియలవి .. ఎవరైనా అరుషి వెళ్లి చూడొచ్చు.
అంజానా సా .. మగర్ కుచ్ పెహచానాసా….. హ్మ్మ్ ..
గుల్జార్ సాబ్ …. తు సీ గ్రేట్ హో యార్ …!! నా జియా లాగేనా ..ఆప్ కే గానే బినా జియా లాగేనా ..!!

 

-సాయి పద్మ

saipadma

 

 

 

https://www.youtube.com/watch?v=WAOwwdsN9sU

మీ మాటలు

 1. బాగా రాశారు, పద్మ గారు.. గుల్జార్‌ గురించి చెప్పడమంటే పెద్ద సాహసమే నా దృష్టిలో.. ఎక్కడ మొదలుపెట్టి ఎంతవరకూ వెళ్ళాలో తేల్చుకోలేము.. కేవలం ఆ కవిత్వంలోనూ, పాటల్లోనూ మునకలు మాత్రం వేయగలం!

  “……గుల్జార్ పాటల మీద ఎలా విపరీతమైన ప్రేమ ఏర్పడింది అని హిందీ పాటల ప్రేమికులని మాత్రం అడగమాకండి.. మనల్ని కొట్టినంత పని చేస్తారు…”
  ఇది మాత్రం నిజం.. గుల్జార్ రాతల మీద ఇష్టాన్ని చెప్పాలంటే ప్రేమ, పిచ్చి లాంటివి సరిపోవు.. ఉన్మాదమనేది ఒక్కటే సరైన పదం! :)

  అన్వర్ గారి చిత్ర కూడా బావుంది.. నాకు గుల్జార్ పరిచయమయిందే ఆ పాట, ‘మేరా కుచ్ సామాన్ ‘ తో!

  • సాయి పద్మ says:

   నిషి గారూ ..
   ధన్యవాదాలు.. అసలు పాటల గురించి మొదలు పెటితే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెల్చుకోలేము ..మీరన్నట్టు .

   ఏదో ఉడత ప్రయత్నం ఆ అక్షర సముద్రానికి , మనకీ , వారధి కట్టేద్దామని .. అత్యాశ కదూ

   థేంక్ యు

 2. kurmanath says:

  చిన్నగా, చిక్కగా, చక్కగా వుంది .

  • సాయి పద్మ says:

   కూర్మనాద్ గారూ ,

   చాలా చాలా థాంక్స్

 3. కోడూరి విజయకుమార్ says:

  పద్మ గారూ !
  ఒక కవి రచనల పట్లా, తద్వారా ఆ కవి పట్లా ఒక అవ్యాజమైన అభిమానం ఏర్పడితే, అతడిని గురించి మనం రాసే నాలుగు మాటలూ ఎంత అద్భుతంగా వెలిగిపోతాయో మీ ఈ చిన్ని వ్యాసం మరో సారి చెప్పింది –
  ‘పురస్కారాలకు గౌరవం దక్కింది ‘ అనే విశేషనానికి అర్హులైన అతి కొద్ది మంది భారతీయులలో గుల్జార్ మొదటి వరుసలో వుంటారు –
  ‘ఆనే వాల పల్ జానే వాలా హై’ …. నా మొబైల్ రింగ్ టోన్ (గుల్జార్ వాక్యానికీ , కిషోర్ దా గానానికీ ఫిదా కాని వారెవరు ?)

 4. సాయి పద్మ says:

  విజయ్ గారూ..
  నిజమే .. నా దృష్టిలో సున్నితత్వాన్ని బలహీనత గా కాకుండా .. బలమైన స్వరంగా చేసుకొని వెలుగుతున్న కవి .. గుల్జార్

  When he published a new book titled :some forgotten poems .. Someone ( dont remeber the name) said .. if forgotten poems are this brilliant .. what the remebered poems will contain..

  i have huge respect for him.

  thank you so much for your compliments and i am humbled n honoured

 5. మైథిలి అబ్బరాజు says:

  ‘ అరుషి ‘ – చూడాలి ఒకసారి విశాఖపట్నం వెళ్ళి

  • manjarilakshmi says:

   అరుషి భోపాల్లో ఉందన్నట్టున్నారు పద్మ గారు. విశాఖలో కూడా ఉందా?

   • మైథిలి అబ్బరాజు says:

    అవునండీ. ఎన్నైనా ఉండచ్చు, ఎన్ని ఉంటే అంత బాగు :) :)

  • sai padma says:

   భోపాల్ లో ఉంది అండీ.. ఎన్ని ఉన్నా మంచిదే మీరన్నట్టు.. అన్నిచోట్లా గుల్జార్ లు ఉండాలి కదా.. థేంక్ యు మైధిలి గారూ.. మంజరి గారూ

 6. Syamala Kallury says:

  మీ గుల్జార్ వ్యాసం బాగుంది సాయి పద్మ గారూ. అయితే ఆయన మనందరికీ తెలిసింది సినీగేయరచయితగా. అంతే కాకుండా ఆయన ప్రచురించిన కవితా సంకలనాలు కూడా అంతే బాగుంటాయి. పదచిత్రాలు, పద్యంతోవచనకవితలతో ఆయన చేసిన ప్రయోగాలు సినిమాలాంటి పాపులర్ కల్చర్ లో మమేకమైన అనేక మంది కవులలో చాలా తక్కువమంది చేసారు. త్రివేణీ అనే ఒక ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రయోగం చేసారు. మూడులైన్ల కవితలలో మూడోలైను పంచ్ లైన్. విలక్షణంగా వుంటుంది. రూపా అండ్ కో ఇంచుమింఛు అన్ని సంకలనాలు ప్రచురించారు. పవన్ వర్మ గుల్జార్ కవితల్ని ఆంగ్లంలోకి అనువదించారు.

  ఆయన ఒక సందర్బంలో నాకు చందమామమీద కాపీరైట్ వుంది అని చెప్పుకుంటారు. నాకు చాలా నచ్చిన కవి, వీలుంటే ఆయన సినీసంగీతం తో పాటు కవితలు కూడా చదవండి. శ్యామల కల్లూరి.
  మనం అమరేంద్ర గారు విశాఖ వచ్చినప్పుడు కలుసుకున్నాం

  • sai padma says:

   తప్పకుండా చదువుతాను. కొన్ని అక్కడా అక్కడా చదివినవే తప్ప ..అయన కవిత్వం తో గాఢమైన పరిచయం తక్కువ. అవును మీరు తెలియక పోవటం ఏమిటి ? మీ దగ్గర ఉన్నా ఇవ్వండి గుల్జార్ కవిత్వం . ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ ..శ్యామల గారూ

మీ మాటలు

*