ఒక శ్రీశ్రీ, ఒక పాణిగ్రాహి, ఒక చెరబండరాజు తరవాతి తరం…

నీవెవరు?

  • పాంచభౌతిక విగ్రహులు

    ఏమని చెప్పగలరు!

    జీవితకాలంలో

    ఒక్కసారైనా

    ధ్వనించే అడగని ప్రశ్న?

    అందుకేనేమో

    కొన్ని కవితాతరువులు

    ఆకాశపు వేర్లతో

    ఫల-పుష్పభరిత

    బాహువులను మనవైపు సారిస్తాయి.

    ఒక రూమీ

    ఒక కబీర్

    ఒక సిద్దయ్యగురువు

    ఓ దేవీప్రియా…

     

    – పున్నా కృష్ణ మూర్తి

 ~~~

 దేవిప్రియ జీవన దృశ్యాలు ఇవిగో ఇక్కడ:

Devipriya_slideshow_final

 

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను

-దేవిప్రియ

(అరుదైన ఈ స్లైడ్ షో అందించినందుకు దేవిప్రియ గారికీ,  పున్నా కృష్ణ మూర్తి గారికి షుక్రియా)

Devi priyatarangalu_1

పున్నా కృష్ణ మూర్తి

పున్నా కృష్ణ మూర్తి

మీ మాటలు

  1. బాగుంది పున్నా గారు.
    స్లైడ్ షో (7) లో “అమ్మా, అమ్మలు కూడా మరణిస్తారా, అమ్మా!” – ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు. జాలంలో లోనే అలాంటిదే మరెవరివో మాటలు ” ”
    పదిహేనోవ స్లైడ్‌ లో హమీదియాలో వారందరితోను కలిసి 15 పైసల టీని తాగిన రోజులు గుర్తు చేసాయి.
    చివరికి మిగిలేది .. అవే!
    నా వరకు నాకు అద్భుతమని పించే ఒక దిగంబర కవి, ఒక పైగంబర కవి ఒక శివుడు కలిసిఉన్న ఫోటో కూడా ఇందులో ఉంటే బాగుండేది అని పించింది.

  2. పున్నా క్రిష్ణ మూర్తి గారి ఆర్టికల్ ఒక్క సారిగా మళ్లీ మా మిర్యాలగూడ పాతరోజుల్లోకి తీసుకెళ్లింది. అందులో నర్సింగ్ నేనే…నర్సిం ను.ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం కంటే ఆ రోజులు గొప్పవి.శాస్త్రీయంగా బ్రతకమని నేర్పే సాహిత్యం,సిద్దాంతం, శేషు సార్ అన్నీ ఉండీవి.అందరూ ఉండెవారు. ఇప్పుడంతా ఒంతరితనం ఊద్యోగం, జీతం,కట్టెలాంటి ఒక మనిషి తప్ప వేరే ఉనికె లేదు, ఊసే లేదు.

    నర్సిం

  3. Chakrapani Ananda says:

    పున్నా గారికి కృతఙ్ఞతలు. పాత రోజుల్లో దేవిప్రియ గారిని గుర్తుకు తెచ్చినందుకు. దేవిప్రియ గారితో నా పరిచయం 1984 లో. పద్మనాభం అనే దర్శక మిత్రుడి ద్వారా. పద్దు ఇప్పుడు లేడు. పద్మనాభాన్ని దేవిప్రియ గారు ప్రేమగా ‘పద్దు’ అని పిలిచేవారు. నన్ను ఇప్పటికీ ‘చక్రం’ అనే పిలుస్తారు. దాన్నే రమణ జీవి కూడా అలవాటు చేసుకున్నాడు. ఆ పిలుపులో ఆప్యాయతను, ప్రేమను, వెచ్చదనాన్ని అనుభవింప చేసినందుకు, ఇంకా చేస్తున్నందుకు దేవిప్రియ గారికి పాడాభివందనం. దేవిప్రియ గారు బి. నరసింగ రావు గారికి పరిచయం చేయడంవల్లనే నేను ‘దాసి’ సినిమాలో వేషం వెయ్యగాలిగాను. నటుడిగా నాకది తొలి చిత్రం. ఈ రంగంలో భవిష్య ప్రయాణానికి దారిచూపిన పత్రం. ధన్యోస్మి.

  4. శేషు మా నాన్న. చిన్నప్పుడు నాన్న రాసిన కథలకు అర్ధం తెలేయలేదు . ఈ రోజు నాన్న రాసిన కథలన్నీ చదివితే నాన్న ఒక సాంసృతిక కర్తగా, సంఘసంస్కర్తగా , సరళమైన భాష తో పదునుగా రాసిన ఒక కవిగా కనిపిస్తున్నారు

    మీరు న చిన్నప్పటి జ్ఞాపకాలలో ఉన్న నాన్నని తిరిగి అదే విధముగా నా జివితములోకి తెప్పిస్తున్నారు.

    మీరెవరైనా నాన్న గురిచి ప్రస్తావిస్తే నాన్న మీతోనే ఉంది ఇంకా ఇంటికి రాలేదేమో అనిపిస్తుంది

    • Chakrapani Ananda says:

      అమ్మా స్నేహా! మీ నాన్న మా గురువు. మిర్యాలగూడలో హైస్కూల్లో చదివేటప్పుడు శేషు సారు నా లాంటి ఎంతో మందిని సాహిత్యం పట్ల, అభ్యుదయం పట్ల, జీవన విధానం పట్ల ఎంతో ప్రభావితం చేసారు. ఆయన నా లాంటి చాలా మందికి మార్గదర్శకులు. మాకందరికీ ఒక చైతన్య స్ఫూర్తి. ‘హి వాస్ అ ట్రూ రోల్ మోడల్. ఈ సందర్బంగా మా శేషు సార్ ను గుర్తుకు తెచ్చుకోవడం ఆనందంగా వుంది.

  5. Makes me feel proud that my dad inspired many people. I wish I could meet you, krishna murthy uncle, sudarshan uncle, narsim anna. You all are doing great work in your respective fields. Time call s for us to come together and do something good again. Let us get inspired and inspire others. I want to work with less fortunate kids and want to give hope to them that they can dream big. I want to work on my dad’s unfulfilled dreams. My dad is alive today in good works and in all ignited minds and inspired souls. Let us work to support less fortunate students. Thank you for your reply. Let us build good things together

    • Chakrapani Ananda says:

      Thank you amma sneha for your response. Your attitude and principles in life reminds me the great values of our seshu sir. We will surely meet sometime very soon on some occasion. What are you doing now and where do you live. If you are living in Hyderabad it is very easy for us to meet up soon. Me, Punna garu, Narsim are in regular touch. Some times Sudarshan also in touch with us. Good luck and all the very best.

Leave a Reply to Chakrapani Ananda Cancel reply

*