ఉన్నా లేని నేను…

alone-but-not-lonely

సన్నగానో
సందడిగానో
దిగులు వర్షం మాత్రం మొదలయ్యింది.

మనసంతా గిలిగింతలు పెట్టిన క్షణాలు
గుండెలో గుబులుగా తడుస్తూ
ఇపుడింక జ్ఞాపకాలుగా.

ఎన్నిసార్లు విసుక్కోవాలో
సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ
రమ్మనో పొమ్మనో

తడిమిన ప్రతిసారీ

నిశ్శబ్దమే నవ్వుతోంది
వెచ్చగా ఉండే వెన్నెల
కొత్తగా చలిగా.

నిస్సహాయత పలకలేని కళ్ళతో
పదే పదే రెప్పలని కసురుకొంటూ.
కమ్ముకోమనీ  తప్పుకోమని

———-

ఉన్నా లేని నేను.

-శ్రీలేఖ

మీ మాటలు

 1. wow …
  సింప్లీ సూపర్బ్ …

  రమ్మనో పొమ్మనో
  గుండెలో గుబులు
  సన్నగా దిగులు
  కలిగిస్తూ …

 2. G vidya sagar says:

  గుండెకి హత్తుకు పోయీ చాల జ్ఞాపకాలు గుర్తుకోచాయి

 3. “…ఎన్నిసార్లు విసుక్కోవాలో
  సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ
  రమ్మనో పొమ్మనో…”

  చాలా బావుంది :)

 4. మణి వడ్లమాని says:

  “హాయ్, శ్రీలేఖ

  నిస్సహాయత పలకలేని కళ్ళతో
  పదే పదే రెప్పలని కసురుకొంటూ.
  కమ్ముకోమనీ తప్పుకోమని”

  బావుంది కవిత ,చిరు అలకలుపోతూ

Leave a Reply to G vidya sagar Cancel reply

*