నీ గది

 srikanth

 

 

 

 

 

తళతళలాడింది నీ గది: ఆనాడు. అప్పుడు, ఇంకా మబ్బు పట్టక మునుపు –

నీకు నచ్చిన

అగరొత్తులను వెలిగించి నువ్వు కూర్చుని ఉంటే, నీ చుట్టూతా

నిన్ను చుట్టుకునే

 

సన్నటి, పొగల అల్లికలు.

అవి, నా చేతివేళ్ళు  అయితే బావుండునని ఊహించాను నేను, ఆనాడు:

అప్పుడు

 

చిరుగాలికి, చిన్నగా కదిలాయి

కర్టెన్లూ, నేలపై నువ్వు చదివి ఉంచిన దినపత్రికలూ, నువ్వు రాసుకున్న

కాగితాలూ

 

పచ్చిక వలే

నీ ముఖం చుట్టూ ఒదిగిన నీ శిరోజాలూ, చివరిగా నేనూనూ. “కొమ్మల్లోంచి

ఒక గూడు రాలిపోయింది

సరిగ్గా

 

ఇటువంటి

వానాకాలపు మసక దినాన్నే. చితికిపోయాయి గుడ్లు – వాటి చుట్టూ

గిరికీలు కొట్టీ కొట్టీ

అలసిపోయాయి

 

రెక్కలు. తెలుసా నీకు?

అమ్మ ఏడ్చింది ఆ రోజే ” అని చెప్పాను నేను. “నాకు తెలుసు” అని అన్నావు

తిరిగి పొందికగా నీ గదిని

 

సర్దుకుంటూ నువ్వు:

t1

నేలపై పరచిన తివాచీ, తిరిగిన ప్రదేశాల జ్ఞాపకార్ధం కొనుక్కు వచ్చిన బొమ్మలూ

పింగాణీ పాత్రలూ

 

ఓ వెదురు వేణువూ

ఇంకా సముద్రపు తీరం నుంచి నువ్వు ఏరుకొచ్చుకుని దాచుకున్న శంఖమూనూ.

ఇక నేనూ పొందికగా

 

ఆ వస్తువుల మధ్య

సర్ధబడీ, అమర్చబడీ, బొమ్మగా మార్చబడీ నువ్వు ముచ్చటగా చూసుకుంటున్నప్పుడు

ఎక్కడో అలలు

 

తెగిపడే వాసన –

nos6

తీరాలలో అవిసె చెట్ల హోరు. ఒడ్డున కట్టివేయబడిన పడవలు అలజడిగా కొట్టుకులాడే

తీరు. కళ్ళల్లో కొంత

ఇసుకా, ఉప్పనీరూ-

 

మరి, తళతళలాడి

ఆనక మబ్బుపట్టి, ఈదురు గాలికి ఆకులూ, పూవులూ, ధూళీ రాలడం మొదలయ్యిన

ఆనాటి నీ గదిలో

 

ఇక ఇప్పటికీ ఒక వాన కురుస్తూనే ఉందా?

 

– శ్రీకాంత్

మీ మాటలు

 1. తిలక్ says:

  ఒక భావపూరితమైన గొప్ప కవితను అందించారు శ్రీకాంత్ గారు.

 2. నిరంతరాయంగా ఎప్పటికి కురిసే అక్షరాల వాన,. శ్రీకాంత్.కె :)

 3. చాలా గాఢమైన నిగూఢమైన అనుభూతి మీ ప్రతి కవితలోనూ ఆస్వాదిస్తూ ఉంటాను. నన్ను నేను సర్దుకుంటూ సరిచూసుకుంటూ.. ధన్యవాదాలు శ్రీకాంత్ గారూ..

 4. Nisheedhi says:

  simple sweet words with loads of magic . Every write up from u looks so very simple yet..filled with so much ” Life” . kudos buddy .

 5. ఎక్కడో అలలు

  తెగిపడే వాసన –

 6. Jayashree Naidu says:

  అతి నెమ్మదిగా ప్రసరిస్తూ ఆక్రమించుకునే ఉదయపు ఎండలా భావం తో చుట్టు ముట్టేసింది మీ కవిత శ్రీకాంత్ గారు

 7. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

  ఎప్పుడో, ఎక్కడో గుండెలోతుల్లో
  మిగిలిపోయిన అనుభూతిని తవుడుకున్నట్టు
  నిన్ననో, మొన్ననో, ఆ మొన్ననో, ఒక జీవిత కాలపు క్రితం
  కలని మళ్ళా తెలిసీ తెలియని తెల్లవారుజావు నిద్రలో కలకన్నట్టు
  చేతికి అందినట్టే, మనసుకి తెలిసినట్టే, కానీ భాషకందని భావన
  కాస్త సుఖం, కూసింత కష్టం, ఐ కెన్ నాట్ పుట్ మై ఫింగర్ ఆన్ ఇట్
  కానీ సముద్రపు హోరుతో కటీఫ్ చెప్పడం నాకు గుర్తుకొస్తుంది
  అమావాశరాత్రిలో తెల్ల జరీ వెండి జారీ చీరలో మేవిద్దరం మునిగి తేలటం నిజవే కదా
  అమరిపోవటం బహుశా ఒక గొప్ప స్కిల్ కావచ్చు, కానీ
  ఇసుకనీ, ఉప్పునీరుని మరచిపోగలవా?
  హోరు గాలిని, నల్ల మబ్బుని,
  మెరుపు వెలుగుని, ఆ మల్లెల వాసనని మరచిపోగలవా?
  గదిలో ఆ వాన ఎప్పటికీ కురుస్తూనే వుంటుంది
  నిన్నా, ఈరోజు, రేపు, సర్దటం ఒక ప్రేటెన్షన్ కానీ
  తెగిపడే ఆ వాసన బతుకంతా ఆక్రమిస్తుంది.

  శ్రీకాంత్, నాకు చాలా నచ్చింది నీ పోయట్రీ, ఎందుకంటే మాత్రం నేను చెప్పలేను.

  రవికిరణ్ తిమ్మిరెడ్డి .

మీ మాటలు

*