భూమి స్వప్నాన్ని శ్వాసించిన తెలంగాణ కవిత్వం

10177289_10203107554362740_688223332954052141_n

నిజాయితీగా చెప్పాలంటే, తెలంగాణ కవిత్వం గురించి నాలుగు మాటలు సాధికారికంగా వ్రాసే శక్తి నాకు లేదు. జూన్ 2 వ తేదీన, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పడబోయే సందర్భంగా, జూన్ 1 వ తేదీ రాత్రి 9 గంటల నుండి రాష్ట్ర ఆవిర్భావ ఘడియల వరకు కొనసాగేలా తెలంగాణ కవి గానం ఒకటి, మిత్రులు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాలులో ఏర్పాటు చేస్తున్నారు. ఒక కవిత్వ విద్యార్థిగా, తెలంగాణ లోని వరంగల్ అనే ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా, తెలంగాణ కవిత్వం నన్నెలా చుట్టుముట్టిందో, తెలంగాణ కవిత్వాన్ని నేనెట్లా అర్థం చేసుకున్నానో క్లుప్తంగా చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం ఈ వ్యాసం!    

హైదరాబాద్ రాష్ట్రంలో సజీవంగా వున్న తెలుగు కవిత్వం ఊసు లేకుండా వెలువడిన ‘వైతాళికులు’ సంకలనానికి జవాబుగా సురవరం ప్రతాప రెడ్డి వెలువరించిన ‘గోల్కొండ కవులు’ కాలం నుండి, ‘ఇప్పుడు తెలుగు కవిత్వం అంటే తెలంగాణా కవిత్వమే’ అన్న కాలం దాకా ‘తెలంగాణా కవిత్వం’ చేసిన ప్రయాణం అబ్బుర పరుస్తుంది. మరి, ఆ శక్తి తెలంగాణ కవిత్వానికి ఎవరిచ్చారు? నిస్సందేహంగా, తెలంగాణ జీవితమే తెలంగాణ కవిత్వానికి ఆ శక్తిని ఇచ్చింది. తరాలుగా కొనసాగుతోన్న తెలంగాణ తండ్లాట తెలంగాణ కవిత్వానికి ఆ ఆత్మను ప్రసాదించింది.

కొన్ని వందల ఏళ్ళ పాటు సాంస్కృతిక, ఆర్ధిక దోపిడీకి గురయిన తెలంగాణ, తనను తాను విముక్తం చేసుకోవడం కోసం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సాయుధ పోరాటంలోకి దిగింది. ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ఎక్కడ మొదలైనా పాటే వాటి మొదటి ఆయుధం. తమ శ్రమనీ, తమ శ్రమని దోచుకునే వాళ్ళ మోసాలనీ మరిచిపోయెందుకు సామాన్యులు పాటనే ఆసరా చేసుకున్నారు. తెలంగాణ కవులు కూడా పాటనే ఆశ్రయించారు. ‘బండెనక బండి కట్టి’ అని ఆగ్రహించినా, ‘పల్లెటూరి పిల్లగాడా’ అని దుఃఖించినా, పాటే తెలంగాణ కవిత్వ మాధ్యమం అయింది.

వచన కవిత, కథ, నవల లాంటి సాహితీ ప్రక్రియలు ఐరోపీయ దేశాల నుండి దిగుమతి చేసుకున్నవి. బ్రిటిష్ పాలన లో వున్న కారణంగా, ఇంగ్లీష్ చదువుకూ, సాహిత్యానికీ చేరువైన అప్పటి మదరాసు రాష్ట్రం లోని తెలుగు సాహిత్య సృజనకారులు ఆ ప్రక్రియలలోకి సహజంగానే ప్రవేశించగలిగారు. అయితే, ఉర్దూ చదువు, అది కూడా కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన సమాజం లాంటి పరిమితులు ఉన్నప్పటికీ తెలంగాణ కూడా ఆ సాహితీ ప్రక్రియలలోకి ప్రవేశించింది.

 

//2//

సుదీర్ఘ కాలం పీడనకు గురి కావడం వలన, తెలంగాణ జీవితం లో సహజంగా వున్న ‘సామూహికత’ లక్షణం వలన, తాము స్వీకరించిన ఆధునిక సాహితీ ప్రక్రియలలో కూడా ప్రజా పోరాటాలని ప్రధాన వస్తువుగా చేసుకుని, తమ ప్రజల భాషలో వ్యక్తీకరించారు తెలంగాణ కవులు. పీడితులెప్పుడూ స్పష్టంగానే మాట్లాడతారు. అందుకే, మాటలకు అనవసరమైన పూతలు పూసి, మెరుపులు అద్ది ఆ మాటల వెనుక దాక్కోవడం లాంటి శుద్ధ కళా నైపుణ్యాలు తెలంగాణ కవులు ఔపోసన పట్టలేక పోయారు. అందుకే, పాటలో ధ్వనించే స్పష్టత తెలంగాణా కవితలోనూ ధ్వనిస్తుంది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కవి పలికింది అందుకే!

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భారత దేశ స్వాతంత్ర్యం, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణం తదనంతరం తెలంగాణ కవి, కవిత్వ భాషకు సంబంధించి, కవిత్వ వ్యక్తీకరణలకు సంబంధించి కొత్త పరీక్షలను ఎదుర్కొన్న కాలం. స్వాతంత్ర్యమైతే వొచ్చింది గానీ, ఊళ్ళల్లో ఇంకా కొనసాగుతోన్న దొరల పెత్తనం, అప్పుడప్పుడే యూనివర్సిటీ చదువులు చదువుతున్న తెలంగాణా కవిని ఆందోళనకు గురి చేసింది. అందుకే, 1969 లో ఉధృతంగా వొచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గణనీయమైన స్థాయిలో కవిత్వాన్ని సృష్టించలేక పోయింది. దాదాపు అదే కాలంలో తెలంగాణ లోకి అడుగిడిన నక్సలైటు ఉద్యమాలు, దానికి ముందే ఆవహించిన శ్రీ శ్రీ కవిత్వం, తెలంగాణ కవిని విప్లవ కవిత్వం వైపు నడిపించాయి.

దరిదాపు 80 ల వరకూ, ‘తెలంగాణ కవి అంటే విప్లవ కవి’ అన్నంతగా తెలుగు సాహిత్యం లో ఒక ముద్ర పడి పోయింది. ఇక్కడ గమనించ వలసిన అంశం ఏమిటంటే, ఈ కాలంలో కూడా తెలంగాణ కవులు, దొరల పెత్తనం కింద, పోలీసు క్యాంపుల కింద నలిగిపోయే తన ఊళ్ళ గురించే కవిత్వం రాసారు. ఆ కవిత్వం కూడా, ఏ అర్థం లేని / అవసరం లేని రూపకాల చాటునో కప్పి పెట్టకుండా సాగింది. తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా, ఇట్లాంటి విప్లవ కవిత్వం రాయడం ద్వారా తమను తాము ప్రజా ఉద్యమాలలో మమేకమైన వాళ్ళుగా చూసుకున్నారు తెలంగాణ కవులు!

ఎనభైలలో వొచ్చిన స్త్రీ, దళిత వాదాలు, ‘అందరూ కలిసి చేసే పోరాటం లోనే అందరి విముక్తి ‘ అన్న విశ్వాసం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించి, అస్తిత్వ ఉద్యమాలను మొదలు పెట్టాయి. కాస్త అటూ ఇటూగా అదే సమయంలో, తెలంగాణ లోని కొందరు బుద్ది జీవులు, ‘తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు – అది వెనుకకు నెట్ట బడిన ప్రాంతం’ అన్న స్పృహను తెలంగాణ సమాజంలోకి ప్రవేశపెట్టారు. తదనంతర కాలంలో, ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష’ రాజకీయ రూపం తీసుకుని, తెలంగాణ తెలుగు భాషకు జరుగుతోన్న అవమానం, సంస్కృతి పట్ల అవహేళన, వనరుల దోపిడీ మొదలైన అనేక అంశాలను ఆధారాల సహితంగా చర్చకు పెట్టడం మొదలు పెట్టడం ప్రారంభించారు.

 

//3//

ఇట్లా మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత, తెలంగాణ కవిత్వం గొప్ప సౌందర్యంతో వెలిగిపోయింది. తెలంగాణ కవిత్వం, ఎట్లాంటి శషభిషలూ లేకుండా తన జీవ భాషతో పలికింది. సరళం గానే ఉంటూ, గంభీరమైన అంశాలను స్పృశించింది. దాపునే నది పారుతున్నా, ఫ్లోరోసిస్ బారిన పడుతోన్న తన ఊళ్ళ దుఃఖాన్ని పలికింది. వందల ఏళ్ళు పదిలంగా దాచుకున్న తన భాష ని గేలి చేయడాన్ని సవాలు చేస్తూ పలికింది. తనకే ప్రత్యేకమైన తన పండగల సౌందర్యాన్ని పలికింది. మొత్తంగా, తెలంగాణ కవిత్వం తెలంగాణ జీవితాన్ని ఆవాహన చేసుకున్నది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాటే ఆకాశంలోని సూర్యుడిలా వెలిగిపోయినా, పాట వెలుగు స్పృశించ లేని వేదనని తెలంగాణ కవిత్వం స్పృశించింది. ‘మత్తడి’, ‘పొక్కిలి’, ‘మునుం’ లాంటి బృహత్ సంకలనాలు ఇందుకు దాఖలా ! ఇదే సమయంలో ఒక వైపు తెలంగాణ ఆకాంక్షకు మద్దతు తెలుపుతూనే, రేపటి తెలంగాణ లో తమ అస్తిత్వాన్ని నిలిపుకోవాలనుకునే తెలంగాణ దళిత, బహుజన, ముస్లిం ల ఆకాంక్షని కూడా తెలంగాణ కవిత్వం వ్యక్తం చేసింది. బహుశా, ఈ కాలంలో వెలువడిన తెలంగాణ కవిత్వాన్ని కొంతమేర ఆఫ్రికన్ కవిత్వంతో పోల్చి చూడవోచ్చునేమో!

ముఖ్యంగా, 2009 లో ప్రకటన చేసి, కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళిన తరువాత పెరిగిపోయిన యువకుల ఆత్మహత్యల నేపథ్యంలో వెలువడిన తెలంగాణ కవిత్వం ప్రత్యేకమైనది. వాళ్ళ ఆత్మ త్యాగాలను చూసి దుఃఖించింది. అట్లాంటి యువకులకు ధైర్యం చెప్పింది. వికృత క్రీడలతో తెలంగాణ ప్రకటనలతో ఆడుకున్న రాజకీయాల పట్ల ఆగ్రహం ప్రకటించింది.

ఆగ్రహానికి, దూషణకి సంబంధించి, 2009 ముందు వరకూ దాదాపుగా పరోక్ష ప్రస్తావనలకే పరిమితమైన తెలంగాణ కవిత్వం, ఆ తదనంతర కాలంలో ప్రత్యక్ష ప్రస్తావనలలోకి దిగింది. ఈ కాలంలో వెలువడిన ఒకానొక సంకలనానికి పేరు ‘క్విట్ తెలంగాణ’ !

ఇక ఇప్పుడు తెలంగాణ వొచ్చింది. తెలంగాణ ప్రకటించిన రోజున తెలంగాణ కవులు గొప్ప ఉత్సవ సంరంభంతో కవిత్వం రాసారు. నెరవేరిన తమ ప్రజల ఆకాంక్షలని, అమరులైన యువకుల త్యాగాలను శ్లాఘిస్తూ కవిత్వం చెప్పారు. ఇక ఇక్కడి నుండి తెలంగాణ కవిత్వం ప్రయాణం ఎటువైపు?

చరిత్రని చూస్తే అర్థమయే విషయం – తెలంగాణ కవులు ఎప్పుడూ తమ భూమి పుత్రుల వైపే వున్నారు. తమ భూమి స్వప్నాన్నే తమ కవిత్వంలో శ్వాసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ కవులు, స్టేట్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతీ కాలంలోనూ ‘యాంటీ-స్టేట్’ గానే వున్నారు. తెలంగాణ ఉద్యమాల వారసత్వంగా వొచ్చిన ఆ జీవ లక్షణం కొనసాగుతుందనే అనుకుంటున్నాను. అదే సమయంలో, తెలంగాణ కవిత్వం, కొంగొత్త రూపాలతో వెలువడుతూ ముందుకు సాగుతుందనీ ఆశ పడుతున్నాను –

 

-కోడూరి విజయ కుమార్

vijay

మీ మాటలు

  1. కర్లపాలెం హనుమంత రావు says:

    తెలుగు భాషకు జరుగుతోన్న అవమానం, సంస్కృతి పట్ల అవహేళన, వనరుల దోపిడీ మొదలైన అనేక అంశాలను ఆధారాల సహితంగా చర్చకు పెట్టడం మొదలు పెట్టడం ప్రారంభించారు?! నాకు తెలిసి నాకు పరిచయం ఉన్నంత మేరా ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అందరం తెలంగాణా పలుకును గుందెలకు హత్తుకున్నామనే అనుకుంటున్నాను. తెలంగాణా సంస్కృతి మీద చిన్నచూపు అన్నది ఈ ప్రత్యేక రాష్ట్రకాంక్ష బలీయమైన తరువాత అన్యాయంగా ముందుకు తెచ్చిన అభియోగమనే భావిస్తున్నాను. ఇవన్నీ ఎలా ఉన్నా తెలంగాణా కవిత్వం మీద మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తప్పకుండా ఏకిభవిస్తున్నాను కోడూరు విజయకుమార్ గారూ! నూతన రాష్ట్రావతరణ సందర్బంలో సాటి తెల్ంగాణా కళాకారులందరికి మనస్ఫూర్తిగా అభినందనలు!

  2. కోడూరి విజయకుమార్ says:

    హన్మంత రావు గారు … ఇవాల్టి సందర్భంలో, మొత్తం తెలంగాణ కవిత్వాన్ని స్పృశించే ప్రయత్నం లో భాగంగా తెలంగాణ కవిత్వం పైన ప్రభావం చూపిన అంశాలను గురించిన ప్రస్తావన చేసాను. వ్యాసం మీకు నచ్చినందుకు, మీ అభిప్రాయాన్ని కూడా పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు!

  3. తెలంగాణా కవిత్వం అంటే బూతులు, అబద్దాలు,విషం, విద్వేషం, అసూయ, పక్కవాడి శ్రమ, కష్టాన్ని దోచుకోవడం

    • Masna Venkateshwarlu says:

      మీరు చంద్రబాబు గురించి చెబుతున్నారా?

    • Adavi Visweswara Prasad says:

      అదేమీ మాటండి రామ్ గారు? మీరు నిజంగా తెలంగాణా సాహిత్యం చదివారా? సాహిత్యం అంటే రోజూ newspapers లోను, టీవీ చానల్స్ లోను తెలుసుకుంటున్నది కాదు అని నా అభిప్రాయం.

      మీరు వాడిన పదాలు తప్పండి.

  4. ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.

  5. balasudhakarmouli says:

    నియో గారూ ! అంత నికృష్ఠపు భాష మాట్లాడి మళ్లీ అవమానించారనుకుంటున్నారు. మిమ్మల్ని మీరే అవమానించుకున్నట్టు తప్ప.. మీరన్నట్టు బుద్ధోనోలు ఎవరూ అలా అనుకోరు. మీరెంతటివారైనా అలా ముసుగు కప్పుకుని మాట్లడడంలోనే మీరేటో, మీ తీరేటో తెలుస్తుంది. మీరు చాలా తప్పు మాటాడారు. నాకు చాలా బాధేసింది. ముసుగు తీసి ముసుగులు తీసి మాట్లాడండి.

    రాం గారూ ! తెలంగాణా కవిత్వం అంటే మాకు మట్టి కవిత్వం. మట్టి పరిమళాల కవిత్వం. గుండె వున్న కవిత్వం. గుండె జెండా ఎగరేసిన కవిత్వం. నిజానికి అమితమైన దన్నుని – ప్రపంచానికి యిచ్చిన కవిత్వం. తెలంగాణా కవిత్వం గురించి తెలియాలంటే గద్దర్ ని, గోరటి వెంకన్నని వినండి. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదవండి. ‘ఊరేగింపు ‘ చేసిన వరవరరావ్ కవిత్వం చదవండి. కవిత్వం నిండా తెలంగాణా పల్లెలు పరుచుకున్న శివారెడ్డి కవిత్వం చదవండి. గుండెలకు హత్తుకోండి – నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నిజానికి యిప్పటి తెలంగాణా నుంచి వచ్చిన కవిత్వం లేకపోతే యిప్పటి తెలుగు కవిత్వానికి అంతటి దమ్మూ, ధైర్యం లేకపోదును.

  6. balasudhakarmouli says:

    ‘శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం ‘ – ప్రపంచంలో మట్టి మనుసులకందరికీ వుంటుంది. వొక్క ఆంధ్రావాళ్లకే – అని మీరు మాత్రమే అంటున్నారు.

  7. కోడూరి విజయకుమార్ says:

    మౌళీ!
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో, తెలంగాణ కవిత్వం గురించి రాసిన వ్యాసంతో సంబంధం లేకుండా రాం గారు, నియో గారు పెట్టిన కామెంట్స్ చదివి కొంచెం బాధ పడ్డాను …. ‘తెలబాన్లు’ అని నియో గారు ఉపయోగించిన మాట చదివి … కానీ, నీ వ్యాఖ్యలు చదివి ఆ బాధని మరిచిపోయాను … ధన్యవాదాలు ! … మంచి మాట చెప్పావు – ‘‘శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం ‘ – ప్రపంచంలో మట్టి మనుసులకందరికీ వుంటుంది’ !

  8. ”నాకు తెలిసి నాకు పరిచయం ఉన్నంత మేరా ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అందరం తెలంగాణా పలుకును గుందెలకు హత్తుకున్నామనే అనుకుంటున్నాను. తెలంగాణా సంస్కృతి మీద చిన్నచూపు అన్నది ఈ ప్రత్యేక రాష్ట్రకాంక్ష బలీయమైన తరువాత అన్యాయంగా ముందుకు తెచ్చిన అభియోగమనే భావిస్తున్నాను.” ఈ రెండు వాక్యాలు వాస్తవ దూరమైనవి కర్లపాలెం హనుమంత రావు గారూ.. సామాన్యులు, మంచి రచయితలు తెలంగాణ భాషను హత్తుకున్నారు.. కాని తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఆ భాషకు చాల అన్యాయం చేశారు.. ప్రామాణిక భాష పేరుతో తెలంగాణ భాషకు ఎనలేని నష్టం కలిగించారు.. మేము తెలంగాణ భాషలో కథలు రాస్తే సోకాల్డ్ ప్రామాణిక భాష పేరుతో మా కథలు కూడా అచ్చుకు నిరాకరిస్తూ వొచ్చారు.. వారి భాషలోనే మాతో కథలు రాయించారు. అసలు ఆ ప్రామాణిక భాష ఏ ప్రాంతానిది? ఏ రెండున్నర జిల్లాలది? ఏ ఆధిపత్య కులస్తులది? ఏ కాలంలో ఎవరు నిర్ణయించారు? అని అడిగే వారేరి? దానివల్ల నష్టపోయిన ప్రాంతాల, కులాల, తెగల భాషల గురించి, మాయమైపోయిన పదాల గురించి ఎవరు మాట్లాడారు? కోల్పోయిన ఆ కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు? ఇలా నిగ్గదీసి అడిగితే కోపాలొస్తాయి కాని వీటిలో ఎన్నో విషయాలు.. మరెన్నో నిజాలు ఉన్నాయి. తెలంగాణ లో భాగమైన ఉర్దూ మీద ఎంత చిన్నచూపో.. పదుల ఏళ్ళు తెలంగాణలో ఉన్నాహైదరాబాద్ లో ఉన్నా ఒక్క ముక్క ఉర్దూ పలకని ఆంధ్రులే ఎక్కువ. ఇక తెలంగాణ సంస్కృతి మీద చిన్నచూపు గురించి ఎంత చెప్పినా తక్కువే! తామొచ్చే తెలంగాణ వారికి సంస్కృతి నేర్పామన్నవారితో ఏం చర్చించగలం చెప్పండి…

    • మస్నా వెంకటేశ్వర్లు says:

      ఒక ఇంట్లో బాగా కష్టపడి సంపాదించే వాడి సొమ్ము వాడి అన్నో, తమ్ముడో తిని ఎంజాయ్ చేస్తుంటే సంపాదించిన వాడికి, వాడి భార్యకి విడిపోవాలనే ఆలోచన ఏదో ఒక రోజు రావడం సహజం. తినే వాడు ఎప్పుడూ కలిసే ఉండాలనుకుంటాడు…కోరుకుంటాడు. ఇప్పడు చెప్పు నా ఆధునిక అపరిచితుడా! ఎవడు శ్రమించే వాడో? ఎవడు దోచుకునే వాడో? అయితే ఒకటి నిజం ‘ దోచుకోవడానికి కూడా శ్రమించాలి’…అదే నీవు శ్రమ అనుకుంటే నీ ఖర్మ!

  9. buchi reddy gangula says:

    నియో గారు–
    మీ కామెంట్స్ — చాల చెత్తగా ఉన్నాయి —
    మాటలు — రాతలు జాగ్రత్త సర్ —
    తెలంగాణా — విప్లవ గడ్డ — విప్లవ వీరులు పుట్టిన ప్రాంతం
    బుక్స్ చదవండి — ఎందుకు విడి పోవడం జరిగిందో అర్థం అవుతుంది —కూతలు
    కూయకండి
    చదువుకున్న వాళ్ళు రాసే తిరుగా లేదు — మీ భాష — మీ కామెంట్స్ —
    నియో –??అదే మీ పేరం డి —దమ్ము ఉంటె స్వంత పేరుతో రాయండి — సర్
    ————————బుచ్చి రెడ్డి గంగుల —————————

Leave a Reply to buchi reddy gangula Cancel reply

*