వేషాలు వేసిన గొంగళి పురుగులు

saif

 

 

 

 

 

రాత్రి  వెన్నెల్లో నాలుక చాపి వెన్నెల రుచి చూసావా ఎప్పుడైనా
ఆకాశం అందకపోయినా అద్భుతంగా ఉంటది కదా.
గులాబి పువ్వు ఒకటే తెచ్చావా
లేదు చదవాల్సిన  పుస్తకం కూడా ఒకటి ఉంది
అక్కడ ఆ చెట్టుకిందకు వెల్దామా
ఆ జాబిల్లి వెనక్కు ఐనా సరే నేను సిధ్ధం
నాకోసం నిన్న చాలా ఎదురు చూసావా
ఈ రోజు నిన్ను చాలా చూడాలి అనుకుంటున్నా
నేను నీకో విన్నపం చెయ్యాలనుకుంటున్నాను
నేను నిన్నని తిరిగి తెచ్చీవ్వలేను సారి
అసలు నా అభిప్రాయం వినవేంది
నీ గుండెల పై చెవి పెట్టి వినడానికే కదా వచ్చింది

1380399_10201616179779262_1021311603_n
నాకు ఏదో వెంటాడుతుంది
నువ్వే దాన్ని వేటాడేసెయ్యి
అందరిలా మాట్లాడకు ఎప్పుడూ
ఫకీర్ల భాషా ఎప్పుడూ అంతే తెల్వదా
అవును మీ అరుగు మీద ఎవరో పడుకోని ఉన్నారేంటి
అతను పడుకున్నంత సేపు మేము మా అరుగు అని అనుకోలేదు
చీపురుంటే బాగుండును ఊడ్చి కూర్చునేటోళ్ళం
మట్టి మనుషులం మనకు మట్టితో భయమెందుకు
అది కాదు తారలు ఏమన్నా అనుకుంటాయేమో
పూలు ఏమనుకుంటాయో పట్టించున్నామా ఎప్పుడన్నా
నువ్వు మొదలు పెట్టేసరికి ఆవలింతలు వస్తుంటాయి
రానీ తలుపుల దగ్గర నేను చూసుకుంటాలే
మొన్న అంతే చెప్పావ్ కాని పాలంతా పోంగిపోయాయి
పావురాలు ఎగిరిపోతే నాదేం తప్పులేదు చెప్పా చెప్పాకదా
ముద్దులు పెట్టేడప్పుడు షరతులు గుర్తున్నాయి కదా
నీకు ఝుంకాలు చాలా బాగుంటాయి ఎందుకు తీస్తుంటావ్
అసలు నిన్ను కాదు నన్ను నేను అనుకోవాలి
ఆ దేవతలు కూడా ఇలా అనుకుంటారంటావా
టైం అయ్యింది నేను వెళ్ళాలి
రేపు ఇదే భూమి మీద కలుద్దామా

-సైఫ్ అలీ గోరే సయ్యద్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    ప్రత్యేకమిన కవిత. బాగుంది. యిదే వరసలో యింకా చాలా జీవిత కోణాలని చదవాలని వుంది.

  2. అఫ్సర్ భాయ్ సలాం వలెకుం . షుక్రియ
    అన్నవరం శ్రీనివాస్ గారి బోమ్మ చాలా బాగుంది.
    వారిని నాకు ఈవిధంగా నాకు పరిచయం చేయించినందులకు మరో షుక్రియ
    కాని
    నేను రాసిన కవితకు అది సరి అయినది కాదు
    కాని …అవును నిజమే.
    ఎడిటర్ల ఇష్టం .
    అందులో నా ఇష్టం ఏం ఉండదు.
    ఉండకూడదు కూడా .
    ప్యార్ మోహబ్బత్ ఇష్క్ మరియు దివానిగీ సే…
    ..
    మీ బేషరం

  3. తమ్ముడూ సైఫ్: నువ్వన్నది నిజమే! కానీ, మాకు వున్న పరిమితమైన వనరుల వల్ల కవితలకు తగిన చిత్రాల ఎంపికలో లోపం జరుగుతోంది. నీ కవితకి తగిన చిత్రం వేయలేకపోయానన్న అసంతృప్తి నాకు కూడా వుంది. కాని,నువ్వు ఇక్కడ రాసిన చివరి వాక్యం తో మన్ ఔర్ దిల్ భర్ గయా!!

  4. Thirupalu says:

    చాలా బావుంది.

  5. jwalitha says:

    kavitha baagundi kaani kavithaku chitraaniki sambandame ledu

    kavi prema lo kalavaristunte ……………

Leave a Reply to balasudhakarmouli Cancel reply

*