ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
ఒక్క సారి మనసు వర్షపు జల్లులో తడిసింది తృష్ణ గారు :)
@sasikala:మాకు ఇందాకా నిజం వాన కూడా పడిందండీ..:-)
ధన్యవాదాలు.
మీ పాటలకు మురిసి వాన వచ్చిందండీ ఇవాళ …
@జి.ఎస్.లక్ష్మి: వ్యాసం పోశ్టయిన రోజు వాన అప్దడం నాక్కూడా సంబరాన్ని కలిగించిందండి..ధన్యవాదాలు.
“స్కార్ఫ్, రెండు పూలజడలతో నన్ను భయపెడుతుందావిడ”…నన్ను కూడా :)
మామూలుగా తెలుగు సినిమాల్లో వాన పాటలనగానే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది మనసులోకి. మీరు ఏరి, కూర్చిన ఈ వాన పాటల లిస్టు ఆ ఇమేజి కి హట్కే గా ఉంది.
నాకు వాన అనగానే గుర్తొచ్చే ఇంకొన్ని పాటలు…
“చినుకు తడికి చిగురు తొడుగు” వర్షం కాసేపే అయినా ఆ చిత్రీకరణ, మా తాతని గుర్తు చేసే విశ్వనాథ్ గారు…one of my fav songs.
“ఎవ్వరినెప్పుడు తన వలలో” చిన్న బిట్టే అయినా ఎందుకో వర్షంలో ఏడిచే ఉదయ కిరణ్ :(( బాగా గుర్తు ఈ పాటలో.
జ్యోతి గారూ, ఉష పాడిన మంచి పాటగా నాక్కూడా ఆ పాట ఇష్టం కానీ వర్షం ఎక్కువ ఉండదనే అది పెట్టలేదండి..థాంక్యూ!
ఇంక ఉదయకిరణ్ ని తలుచుకుని మళ్ళి దు:ఖపడాలని ఆ పాట పెట్టలేదు!
ఇందాక కామెంట్లో పెట్టాలనుకుని మరచిపోయా…ఎక్కడో చదివిన గుర్తు “చిటపట చినుకులు” చిత్రీకరించేటప్పుడు, బి.సరోజా దేవి గారికి ఏదో ఆక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలి, ఆ కట్టు కనపడకుండా, తడవకుండా స్కార్ఫ్ కట్టారని.ఇప్పుడు ఆ పాట చూస్తే మీకేమైనా ఆవిడ డెడికేషన్ మీద అడ్మిరేషన్, లేదా జాలి కలుగుతుందేమో…ఒకసారి చూడండి :)
మరి రెండు పూల జడలకు ఇలాంటి ఏమి రీజన్ ఉందో తెలీదు…
వ్యాసంలో రాసినట్లు అసలావిడంటే నాకు ఇష్టమేనండీ.. మీరు రాసినట్లు కాస్త కన్సిడర్ చెయ్యగలనేమో… ఆలోచిస్తాను :-)
అన్నట్లు, ఆ పాటలో చూసాకే మా అమ్మావాళ్ళందరూ(సిస్టర్స్) రెండు పూల జడలకోసం పేచీలు పెట్టి మరీ వేయించుకునేవారుట :)
ఎండకెండిన ప్రాణాలకు కాసింత ప్రాణమొచ్చినట్టైంది..తృష్ణ!
:-)
కాన్సెప్ట్ బావుంది.
ధన్యవాదాలు దమయంతి గారూ.
తృష్ణ గారు , మీ బ్లాగ్ నేను ఫాలో అవుతాను. కానీ ఇప్పుడు నాకు ఓపెన్ కావడం లేదు, ఎందుకో తెలియ పరచ గలరా?
వానపై ఇలాంటి వ్యాసం ఇంత వరకూ చూడలేదు.. వాన పాట అనగానే అదో జాణ పాటగానే చూస్తున్న చాలామందికి(ని) వానలో తడిపేశారు.. ముఖ్యంగా ..సహజంగానే రోజూ వర్షంలో (వచ్చినప్పుడు) తడవాలనుకునే నేను ఈ వ్యాసంలో తడిసి ముద్దయిపోయాను.. ధన్యవాదాలు తృష్ణ గారు