మగతవాక్యాల మేల్కొలుపు నిశీధి కవిత…!

ఎప్పుడో కానీ ఓ కవిత నిద్రలేపదు. ఎప్పుడో కానీ ఓ కవిత గుండెగదుల ఖాళీలని పూరించదు. ఎప్పుడో కానీ కొన్ని వాక్యాలు ఆలోచనని రేకెత్తించవు. ఇదిగో ఇప్పుడు దొరికింది అలాంటిదే ఓ కవితలాంటి పిలుపు, మేల్కొలుపూనూ. నిశీధి కవితలో!

ఈమె కవితలలో కనిపించే strong metaphors కోసం కనపడిన ప్రతీసారీ ఈ కవితలని చదువుతూంటాను. దానికి మించి అంతకంటే బలమైన ఆవేశపూరిత వాతావరణాన్ని సృష్టించే పదచిత్రాలకోసమూ వెతుకుతుంటాను. ఎక్కడో ఒకటో రెండొ కవితల్లో తప్ప ఈమె నన్ను నిరుత్సాహపర్చలేదు. ముఖ్యంగా కవిత్వానికున్న శృంఖలాల్ని తెంచడానికోసమేనన్నట్టుగా రాసే ఈ కవితల్లో శీర్షికనుంచీ ఎంచుకున్న డిక్షన్ వరకూ తనదైన ఓ ముద్రకోసం తపించకుండా వాడిన డిక్షన్నే మళ్ళీ వాడకుండా ఓ ప్రవాహంలా సాగిపోయే ఈమె కవితల్లో ఓ మాజిక్ ఉంటుంది. పైడ్ పైపర్ ఆఫ్ హామ్లిన్ లాగా నిశీధి పైడ్ పైపర్ ఆఫ్ మాడర్న్ పొయిట్రీ!! ఓ సారి మొదలుపెట్టాక చివరివరకూ చదవాల్సిందే.

ఓ బలమైన జలపాతాన్ని అనుభూతిస్తుండగా హఠాత్తుగా మనల్నేవరో అందులోకి తోసేస్తే అంతే స్పీడుగా బయటకొచ్చి చూసుకుంటే ఒళ్లంతా ఆ నీళ్ళన్నీ మనఒంటిమీదే ఉన్నాయన్న ఓ అద్భుత ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి కొంచెం సేపు పడుతుంది. దాదాపు అదే అనుభూతి నిశీధి కవితలు.

తన ఓ కవిత “ఫైట్ ఫర్ లైఫ్ ” లో

“జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి

నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని

ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు ”

 

జారిపోతున్న ఇసుకల్లాంటి–ఓ సిమిలీ

నిజాల నీడ, సూర్యుడి కాన్వాస్, ఉమ్ముల రంగూ– ఓ స్ట్రాంగ్ మెటాఫర్

 

మనక్కనిపించే చాలా కవితల్లొ ఇలాంటి ఉపమానాలక్కొదవేమీలేదు. ఐతే ఇదే ఎందుకంత ప్రత్యెకంగా చెప్పుకోవాలంటే దాదాపు ప్రతీ వాక్యంలోనూ ఇన్నేసి ఉపమానాలున్నా అవి విసుగనిపించక మళ్ళీ ఓ సారి వెనక్కెళ్ళి చదివి గుండెకెక్కించుకుని ఊరేగుతూ నలుగురికీ చెప్పాలనే తపన కలగచేయటంలో నిశీధి ఎఫోర్ట్‌‌లెస్ ప్రయత్నం అభినందనీయం.

 

ఇదేకవితలో–

“మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు

రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి ”

అసలేవరీమె? ఎలా శాసించగలుగుతుందిలా? ఏమిటి తనకున్న ఆయుధాలు? ఒఠ్ఠి మాటల మంత్రమేనా? ఒఠ్ఠిమాటల యుధ్ధమేనా?

కొత్తైనా, కొంతైనా పాతవాసనేమీ లేని ఈ యువతరపు ఫీమేల్ వాయిస్‌‌కి కావల్సిందేమిటి?

మనచుట్టుపక్కలే ఉన్నా మనమేత్రాం పట్టించుకోని ఇన్ని ఖతర్నాకీలనీ ఎలా ఒడిసిపట్తుకుందేమో కానీ అవన్నీ ఓ నిశీధి శతకంలా మారి మన డెడ్ బ్రెయిన్ని ఉరకలెత్తిస్తుంటే మరి ఆమెందుకు తన కలంపేరుని బ్రెయిన్ డెడ్ అని పెట్టుకున్నట్లు? ఆమె కవితల్ని ఇంకొన్ని చదవాల్సిందే!

 

“అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని

ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ

ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు”

 

బహుశా మొదటి వాక్యంలో “దాచుకోని” కాదేమో, “దాచుకుని” అనుకుంటా!

ఐనా ఇంధ్రధనుస్సు కిరణాలలోనూ సమతత్వపు సమాధానాలు వెతకమనడంలో ఉద్దేశ్యం మనకి మనమే ఓ అద్దంలా మారి మనలోకి మనమే తొంగిచూసుకుంటే ఏం కనిపిస్తుందో నిర్మొహమాటంగా చెప్పమంటుందనుకుంటాను.

 

please unlock yourself blatantly and reveal shamelessly

 

“గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు

రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే

స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు”

 

తోకచుక్క శంకువులా పగలటం కొంచెం అసమంజసమైనా తరువాతి వాక్యపు గాఢతలొ అది కొట్టుకుపొతుంది. అలాగే “స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు” ఇదీ కొంచెం బలమైనదే. “ఆగి వెళ్ళుము” అన్న సైన్ బోర్డ్ లాగా మనసు స్టాగ్నేటేడ్ వాసనరాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని అలోచింపచేసే కమాండ్‌మెంట్.

 

“నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో

చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు” ఈ ముగింపే కాదు కవితలోని మరికొన్ని వాక్యాల్లోనూ విభిన్నభావాలనీ, different trends నీ కలిపేసిమరీ అతికినట్లు కుట్టినట్లుగా అనిపించినా పాఠకుడికొచ్చే నష్టమేమీలేదు. చదవాల్సిన కవిత ఇది అనటంలొ నిర్మొహమాటేదీలేదు.

 

ఇదీ పూర్తి కవిత—

 

నిశీధి | ఫైట్ ఫర్ లైఫ్ |

వైవిధ్యపు వైర్ చివర జీవితానికో జడ్జ్ మెంట్ డే దొరుకుతుందో లేదో అంటూ

పూల కోసం యే మార్గం లో వెతుకుతున్నావు చీకట్లో

పరిపూర్ణత కోసం ఎన్ని సార్లు పాత మొహాన్నే పగలకోట్టుకుంటూ

అసందర్భంగా యే వాదాన్ని యాచిస్తున్నావు రెస్క్యూ కోసం

జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి

నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని

ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు

యుద్ధాలన్నీ శాంతికోసమేనట

ఇంకా మొదలవని యుద్ధాల వెనక

అశాంతి నీడల కదలిక తెలుస్తుందా నీకు

జనోద్దరణ పేరుతో భారీహస్తాల

పెట్రోలు యుద్ధాలు తెలుస్తున్నాయా ?

మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు

రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి

నిన్ను శాశ్వత నిద్ర కి పంపి నీ ఎముకల పొడి తో వ్యాపారం చేసే

నయా వలస వాదం మరో సారి మతం ముకౌటా తగిలించుకొని

నీ రక్తం తాగడానికి సిద్దమయింది

అందుకే

అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని

ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ

ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు

గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు

రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే

స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు

నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో

చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు

భయాలన్నీ సమూలంగా బహిష్కరించి బ్రతుకు కోసం పోరాడు .

 

 – వాసుదేవ్

541392_4595388722851_1575449086_n

 

 

 

 

 

మీ మాటలు

  1. కెక్యూబ్ వర్మ says:

    అవును మగత నిద్రలో జోగుతున్న నేటి తరాన్ని తట్టిలేపే చర్నాకోలా నిశీధి కవిత్వం. చదివాక ఒళ్ళు జలదరించని మనిషి ఇంక చావడమే మేలన్నట్టు రాస్తారామె. ఇది నేటి అవసరమైన కవిత్వం కూడా. వైయక్తిక ప్యూపాలుగా మారుతున్న కవులను కూడా తమ అక్షర అవసరమేంటో చెప్పే కవి నిశీధి. మీ పరిచయం చాలా బాగుంది వాసుదేవ్ గారు. ఇరువురికీ అభినందనలు..

    • M.V.Patwardhan says:

      బ్రెయిన్ డెడ్ కవితల్లో బలం ఎక్కడుందీ అంటే తమను ఎవరో మెచ్చుకోవాలని,తాము ఎవరినో మెప్పించాలనీ రాయరు.అనుకున్నది అనుకున్నంత బలంగా చెప్పేస్తారు. అయితే అప్పుడప్పుడు ఆ తీక్ష్ణతలో కొన్ని సాధారణ ఔచిత్య ప్రయోగాలకు దూరం అయితే అవుతారు. అంతిమంగా ఆకర్షించేది ఆ కవితల్లో కనబడే ఫ్రెష్ నెస్స్ మాత్రమే కాక అవి సమాజానికి ఉపయోగ పడాలనే తాపత్రయం కూడా! కానీ ఉండీ ఉండీ ఒక్కోసారి నిస్పృహతో కూడిన నైరాశ్యంలోకో,ఆగ్రహంతో కూడిన అనాచరణీయ ఆదర్శంలోకో జారిపోతారు.నేటికాలంలో బ్రెయిండెడ్ గారి కవిత్వ చెర్నాకోల చరుపులు.ముందు ఇంకేం అవుతాయో చూడాలి ! చక్కగా విశ్లేషించిన శ్రీనివాస్ వాసుదేవ్ గారికి అభినందనలు.

    • వాసుదేవ్ says:

      వర్మా, ఒక్కోసారి ఓ మాటే చర్నాకోలా లా తగిలి మనల్ని మేల్కొలిపే కవిత్వం గురించే ముచ్చటపడుతుంటాం. మీరన్నట్టు మొత్తం కవితంతా అలా ఉంటే ఎలా ఉండేదో అన్న ఆలొచనకి ఇలా రూపం కల్నించి మరీ పెద్ద చర్నాకోలానే వాడుతుంటారు నిశీధి. థాంక్యూ ఫర్ ది కామెంట్.
      పట్వర్ధన్ గారూ మీ స్పందన చదివాక నేను నేర్చుకున్నది–ఇలా చక్కగా ఓ పేరాలోనే చెప్పగలిగినప్పుడు అనవసరంగా ఎక్కువ రాసానా అనిపించింది. చెప్పాల్సిందింత కొన్ని వాక్యాల్లోనే సమర్ధంగా చెప్పారు. థాంక్యూ

  2. నడవాల్సిన దూరం చాలా వుంది,. ఇలా భుజం తట్టే ప్రోత్సహించే వారి స్ఫూర్తితో,.అభినందనలు బ్రెయిన్,.

  3. భయాలన్నీ సమూలంగా బహిష్కరించి బ్రతుకు కోసం పోరాడు-నిశీధి ……………….పొరాడడం మొదలెడితే మన్సులొ పాతుకుపోయిన పాడు , పాచి ఆలోచనలతోనే అని, ప్రక్షాలన అంతరంగంతోనే అనే నర్మ గర్భమైన భావ వికాసపు వెలుగు రేకలు నిశీధి గారి లాంటి భావి భవిత ప్రదాతల ఆకాంక్షల దీవెనలు…స్పూర్తి స్పురణలకు శుభాకాంక్షలు…

  4. తిలక్ says:

    నిశీధి గారు రాసే కవిత్వాన్ని ఎన్నిసార్లు చదివినా ఆర్ద్రత తగ్గదు.అమ్మ ఒళ్ళోకూర్చుని వెండివెన్న ముద్దలు తిన్నంత కమ్మగా ఉంటుంది.
    గర్వానికి అతీతంగా
    గళానికి సమీపంగా రాస్తారు.
    ఏదో తీరని దాహం ఇక్కడ తీరినట్టు ఉంటుంది నిశీధిగారి కవిత్వం చదువుతుంటే…
    అసమానతలను తుంచేయాలన్నా
    కుల వ్యవస్థను తూలనాడాలన్నా ఆవిడ కవిత్వంలోనే.

    ఎక్కడో చదివినట్టుగా తోస్తుంది ప్రతిఅక్షరం
    కాని కొత్తగా ఉంటుంది మునుపుచూడనట్టుగా
    అదే నిశీధి గారికవిత్వం.
    నిశీధి గారికి శుభాకాంక్షలు.

  5. Nisheedhi says:

    చూడగానే ముందు సర్ప్రైజ్ అయిపొయాను ..చదువుతూ ఉంటే నేను నిజంగా ఇంత అర్ధం తో ఇంత బాగ రాసానా అనుకున్నను .. తీరా చదివేసాక వెంటాడుతున్న గిల్టీ ఫీలింగ్ తట్టుకోవటం కస్టంగా ఉంది . సీరియస్ స్టఫ్ఫ్ రాస్తున్నానేమో కాని ఎప్పుడు సీరియస్ గా కుదురుగా కూర్చోని రాసింధి లేదు నేను . ఒక రకంగా వాసుదెవ్ గారు నా చేత కరెచ్ట్
    గా ఇంకా బాగా రాయించాలి అన్న ప్రయత్నంలో భాగంగానే ఇంత అభిమానం తో విశ్లేశించారు అనిపించింది . థాంక్యూ సర్ . వొంట్ లెట్ యూ డౌన్
    .Its a wonderful of work and I am really amused the way u spoke my heart out . Thanks once అగైన్

    • వాసుదేవ్ says:

      నిశీధి గారూ! మీ కవిత్వం పై అది నా అభిప్రాయం మాత్రమే. అది విశ్లేషణ అయికూర్చుంటే నా బాధ్యతలేదు. సీరియస్ స్టఫ్ ని ఇంకా సీరియస్‌గా ఎలా రాయొచ్చోకూడా మీరు చెప్పాలి ఇక. Thanks for the promise and I expect more from your heart and pen

      • Brain dead Nishee..e peru chudagane naku ventane ‘guri chusi vadilina baanam’ gurtostundi..anthaga aavida maatala thutaala prabhavam na meda undi..alavataina moosa lo kottuku potunna neti yuvatha ni thatti lepi laagi petti oka lempakaaya kotti ‘yuvatha badhyatha’ni dts lo arichi cheppinatlu untundi aavida maatala pravaham..
        spurthi niche dheera vanitha..
        Anduko na abhinamdana mandhaara maala :)

  6. వాసుదేవ్ గారూ,

    శంకువు తోకచుక్కలా పగిలినప్పుడు అని కవితలో వుంటే తోకచుక్క శంకువులా పగలటం కొంచెం అసమంజసమైనా అని రాశారు మీరు. ఇది చూసుకోకుండా జరిగిన పొరపాటా లేక శంకువు తోకచుక్కలా పగలటం కూడా అసమంజసమని మీ ఉద్దేశమా? నిశీథి గారు ఈ విషయంలో వివరణ ఇవ్వకపోవడానికి కారణం ఆమె మోడెస్టీయే. ఏది ఏమైనా మీ విశ్లేషణ బాగుంది.

    • వాసుదేవ్ says:

      ఎలనాగ గారూ నమస్తె.
      మీ పరిశీలన నిజమే! కానీ నా వరకూ రెండింటికీ పెద్ద తేడా లేదు ఉపమానం వరకూ. నిజానికి శంకువు పగలడంకంటే తోకచుక్క పగలడమే ఇంకా ఆశ్చర్యం. రాలడమూ పగలడమూ ఒకటెనన్న ఉద్దేశ్యం కవయిత్రిది అన్న సమాచారం లేకపోవడంతో అది అసమంజసం అన్నాను. కొంచెం అస్పష్టంగా ఉందన్న ఉద్దేశ్యంతో. అయితే ఇది సమర్ధింపు కాదు. కేవలం సవరణ మాత్రమే.
      బొల్లోజు బాబా గారు– ధన్యోస్మి.
      నాకు పని తగ్గించారు. నిజమే. నిన్ననే ఇది చూసిఉంటే దాదాపు ఇలానే రాసేవాణ్ణేమో. ఆలస్యమవ్వటం మంచిదయ్యింది. మీరూ ఓ మాట కలిపారు.

  7. NS Murty says:

    వాసుదేవ్ గారూ,

    మంచి కవిని పరిచయం చేశారు. Thank you.

    with regards

  8. మంచి కవిత. అంతకు మించి చక్కని విశ్లేషణా

    గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు …. గురించి నా అవగాహన మేరకు చిన్న వివరణ…

    ఆబ్ స్ట్రాక్ట్ ఇమేజెస్ ని పేర్చుకొంటూ పోవటం వలన వచ్చే చిక్కే ఇది.

    ఇక్కడ రెండు సమస్యలు అర్ధం చేసుకోవటంలో
    ఎ. గత సమస్యల శంకువు అన్నప్పుడే విషయం సంక్లిష్టమై పోయింది. సాధారణ అవగాహనా స్థాయిని దాటి మరో మెట్టెక్కేసింది
    బి. ఆ శంకువు తోక చుక్కలా పగలటం అనేది ఇక తారా స్థాయి.

    ఆబ్ స్ట్రాక్ట్ ఇమేజ్ ను సుదూరంగానైనా కాంక్రీట్ ఇమేజ్ గా మెదడు మార్చుకోలేని స్థితి వచ్చినప్పుడు అలాంటి వాక్యం కవిత్వం లో అస్ఫష్టత గానే మిగిలిపోతుంది.
    కవితలో బి అంశం లోని శంకువు పగలటం, తోకచుక్క పగలటం రెండూ అసాధారణ అంశాలే. రెంటినీ మరలా కాలంతో (అప్పుడు అనే పదంతో) ముడి వేసినపుడు మరింత సంక్లిష్టత చేరిపోయింది. బహుసా అస్పష్టత ఒడిలోకి చేరిపోయిందన్నంతగా….

    బహుసా వాసుదేవ్ గారు చెప్పాలనుకొన్నది ఇదేనేమో

    నా పరిశీలన తప్పనిపిస్తే మన్నించగలరు

    మరొక్కసారి వాసుదేవ్ గారికి ధన్యవాదాలు గొప్ప కవితను పరిచయం చేసినందుకు. నిశీధి గారికి అభినందనలు

    బొల్లోజు బాబా

  9. వాసుదేవ్ గారూ,

    నమస్కారం.
    తోకచుక్క పగలటం అసమంజసమనే మీ భావన పూర్తిగా న్యాయమైనదే. ఎంతో మందికి కూడా మీాగే అనిపించ వచ్చు. అయితే ఒక కవి ఒక పదాన్ని ఉపయోగించేటప్పుడు అతడు/ఆమె తన జీవితంలో పొందిన అనుభవం నేపథ్యమౌతుంది ఒక్కొక్కప్పుడు. అదే అనుభవం ఇతరులకు కలగకపోవచ్చు. ఈ కారణంగా ఆ పదానికి సంబంధించిన యెరుక, స్వభావం వివిధ వ్యక్తుల్లో, కవుల్లో వేరువేరుగా ఉంటుందేమో. తోకచుక్క పగలటం అటువంటిదే అని నా ఊహ. చిన్నప్పుడు రాత్రుల్లో ఆరుబయట మంచం వేసుకుని పడుకున్నప్పుడు పైకి చూస్తే ఆకాశంలో ఒక్కోసారి ఒక నక్షత్రం పగిలినట్టు అయి, వెలుగును వొదుల్తూ గీతలాగా ఆకాశం మీద జారిపోయిన దృశ్యాలు నాకింకా గుర్తే. అవేమిటని ప్రశ్నిస్తే “తోకచుక్కలు” అన్న సమాధానం వచ్చేది పెద్దలనుండి. పగిలి పడిపోయేదే తోకచుక్క – అనే యెరుక కలగటానికి ఆ దృశ్యానుభవాలే కారణాలవుతాయనుకుంటాను. శాస్త్రీయంగా చూస్తే తోకచుక్కలు పగలటం వాస్తవం కాకపోవచ్చు. అట్లాంటి అనుభవమేదైనా నిశీథి గారిచేత ఆవిధంగా రాయించిందో ఏమో తెలియదు నాకు. ఇదంతా Much ado about nothing (చిన్న విషయానికి పెద్ద గోల/రాద్ధాంతం) లాగా అనిపిస్తే నేను క్షంతవ్యుణ్ని. ఆసక్తికరమైన ముక్తాయింపు ఏమిటంటే, అట్లా పగిలి వెల్తురును చిమ్ముతూ నింగిలో జారిపోయే వాటిని తోకచుక్కలు అనరు, meteors అంటారు. Meteors are different from comets. అందుకే మీ ఉగ్గడింపు సవ్యమైనదని అనటం. కవితను రాసిన నిశీథి గారికీ,మంచి విశ్లేషణ చేసిన మీకూ మరొక్కసారి నా అభినందనలు.

Leave a Reply to Elanaaga Cancel reply

*