మౌనద్వారం

ఆకస్మిక cosmic చిరునవ్వు
నిన్నే ఎందుకు ముద్దుపెట్టుకుంది
 
దుఃఖకౌగిలి వ్యాకరణంలో వాత్సల్యవాయువు
నిన్నే ఎందుకు చుట్టుముట్టింది
వ్యసననయనాలతో అశ్రువులు
నిన్నే ఎందుకు చూశాయి
నిర్జీవమైన పదాల్లోకి

నిన్నే మనసుశ్వాస ఎందుకు ఊపిరితీసుకుంది
రంగుల్లేని గాలి
నిన్నే ఎందుకు పిలిచింది నిర్బింబ అశూన్యంలోకి
ఇక కలవరపడకులే…
రేయింబవళ్ళు లేవు
భగవంతుడు లేడు
శబ్దాలు లేవు
కన్నీళ్లు లేవు
నీ స్నేహపు దారి
ఎందుకు మూసేసావు యకాయకి

                                                                                (రామిశెట్టి విజయకృష్ణకి)

–  ఎం. ఎస్. నాయుడు

~~~

 రామిశెట్టి విజయకృష్ణ గురించి:

1939847_528475647263744_1268761583591337053_nA 1992 Philosophy gold medalist, a unique personality, took Philosophy and Telugu literature as his options for Upsc – to hit only IPS- lived in the dream to become one!A brave police officer of the State won many awards and medals – always felt he being very strong, exercised physically fit body , no illness would touch him – caught in this vicious cycle – my baby could not understand about his inside illness though knew his Big ‘B”s struggle – struggled to get back to uniform – don’t know how all his near and dear come out of this trauma! No words to express the miss!

1620415_529424560502186_5769099433351538644_n

1482959_650829424991118_5019209609135778675_n

 

మీ మాటలు

 1. వాసుదేవ్ says:

  క్యుడోస్! క్యుడోస్!! నివాళి అంటే ఇలానే రాయాలి. ఓ గొప్ప “వ్యక్తి” కి గొప్ప నివాళి.వెల్ రిటెన్ నాయుడుగారూ.

 2. మూసుకుపోని ఓ దారి అది, ఎప్పటికి తెరవబడే వుంటుంది, ఇలా గుండెల్లో ఓ జ్ఞాపకమై.,

 3. sailajamithra says:

  ఒక అనిర్వచనమైన అనుభూతి. నీ స్నేహపు దారి ఎందుకు ముసేసావు యకాయకి … ప్రశ్నించే దారుల్లో మరెన్నో ప్రశ్నపత్రాలు .

 4. Anil battula says:

  హృదయాన్ని స్ప్రుసించే కవిత రాసారు నాయుడు garu……

 5. బి.అజయ్ ప్రసాద్ says:

  అతడిని తనలోకి తీసుకున్న మౌనద్వారం. మృత్యువుకు ఎన్ని పర్యాయ పదాలు !!
  మాటలు రాని శాశ్వత మూగవాడివి.. నీ ఈ దుఖభారాన్ని ఇలా పంచుకుంటున్నావా నాయుడూ.

 6. NS Murty says:

  ఎం. ఎస్. నాయుడు గారూ,

  చక్కని స్నేహపూర్వకమైన మృత్యంజలి. మీ పదాల ఎంపిక కూడ బాగుంది.

  అభివాదములు

 7. మిత్ర స్మృతి కవిత మీ స్నేహితున్ని ఆయనతో మీకున్న అనుబంధాన్ని అక్షారక్షరంపట్టియిచ్చింది నాయుడు గారు

 8. చాలా బాగుంది. నా చేత అంతా చూసేట్టు చేసింది.

 9. కోడూరి విజయకుమార్ says:

  ‘రంగుల్లేని గాలి
  నిన్నే ఎందుకు పిలిచింది నిర్బింబ అశూన్యంలోకి’…..
  మిత్రుడిని కోల్పోయిన బాధని ఆవిష్కరిచడానికి ఇంతకన్నా మరేముంటుంది నాయుడూ ?

మీ మాటలు

*