ప్రాణం

నేను చూసాను గూటి నుండి కింద పడి పగిలిన ఓ పక్షి గుడ్డుని
అందులో నుంచి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న మాంసపు ముద్ద

గర్భస్రావమైనట్టు
దానికి ఆసరా ఇస్తూ చేతులు చాపిన మట్టి దేహం
తనలోకి దిగమింగడానికి ప్రయత్నిస్తూనే ఉంది రాలిపడ్డ రక్త మాంసాలను

మిగిలిన కొన్ని శకలాలు వాటంతట అవే ఆకాశంలోని కొన్ని అంచులను తాకుతున్నాయి
ఇప్పుడిప్పుడే

నేను చూసాను మళ్ళీ
పసికందు ఆత్రాన్ని
ఓ కీచు శబ్ధాన్ని
తల్లి రొమ్ములో కుతిక నింకున్న ఓ జీవాన్ని
ఆబగా దప్పిక తీర్చుకుంటున్న కణాన్ని

నేను చూసాను
దేహ ప్రక్షాళన గావిస్తున్న ఒక పదార్థాన్ని
పరాన్న జీవి దశ నుండి పరిణమం చెందిన గుండెరెక్కల చప్పుళ్ళను

ఇంకా కంటూనే ఉన్నా రాలిపడుతున్న కొన్ని మాంసపు ముద్దలను నా కళ్ళనుండి
నెత్తురు ఉబికినప్పుడల్లా..
తిలక్ బొమ్మరాజు

మీ మాటలు

 1. నిశీధి says:

  Way to go man .. I am very happy for u . A sweet , lovely poet :) , u really play well with simple words . ..which comes straight from u r heart and reach the reader in no time

 2. balasudhakarmouli says:

  ” ఇంకా కంటూనే ఉన్నా రాలిపడుతున్న కొన్ని మాంసపు ముద్దలను నా కళ్ళనుండి
  నెత్తురు ఉబికినప్పుడల్లా.. ” – కవితకు ప్రాణభూతమైన వాక్యాలు. నాకనిపిస్తుంది – నిజానికి .. ఈ రెండు వాక్యాలే చాలు .. కవిత్వం పూర్తి అయిందని.. ! కంగ్రాట్స్ తిలక్ … కవితలో మొదటి వాక్యాల ద్వారా బాలగంగాధర్ తిలక్ ని గుర్తుకు తెచ్చావ్… !

 3. కెక్యూబ్ వర్మ says:

  సామాజిక భీభత్స చిత్రాన్ని కవిత్వీకరించారు .

  అభినందనలు తిలక్…

 4. narayanashama says:

  మీ కవితలో పరిణతిని బాగా గమనించవచ్చు తిలక్.నాకు చాలా సంతృప్తిగా వుంది.మీ సాధన బాగా అర్థమవుతుంది

మీ మాటలు

*