కురూపి భార్య: చిన్న కథలో ఎన్ని కోణాలు!?


KODAVATIGANTI-KUTUMBARAO
కురూపి భార్యలో కథకుడి (అంటే తన కథ చెప్పుకున్నతనే) టోన్ నీ, నాటి సాంఘిక వాస్తవికతని వాచ్యంగా చెప్పిన దాని వెనక ఉన్న వ్యంగ్యాన్నీ అర్థం చేసుకోకపోతే కథ ప్రయోజనం నెరవేరలేదన్నమాటే. మామూలు మనుషుల మనసుల్లో సంఘం చేత ప్రోది చెయ్యబడ్డ (implant చేసి పెంచబడ్డ) కుహనా విలువలూ, మానవ సంబంధాలలో (ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య) ప్రేమరాహిత్యం, డొల్లతనమూవాటి పరిణామంగా హృదయాలు పూర్తిగాఎండిపోయిఅసూయా క్రౌర్యాలతో విరుచుకుపడటమూ (సంఘం ఏర్పాటు చేసినకట్లని ఎవరెపుడు కొంచెం వదులు చేసుకోవాలని ప్రయత్నించినా) – ఇవన్నీ చిన్న కథలో ఇమడ్చగలిగాడు కొ.కు.

నాటి పెళ్ళిళ్ళన్నీరాసిపెట్టినవేస్నేహం, ప్రేమ అనేదాని అర్థంతో కానీ అవగాహనతో కాని సంబంధం లేకుండా (బహుశా నాటికీనేమో!). అలా వచ్చి పడ్డ సంబంధాలలోనే ప్రకృతి సహజమైన సుఖం వెతుక్కునేఅల్పసంతోషిఅయిన కథకుడి మెదడులో అందచందాలకున్న ప్రాముఖ్యాన్ని చొప్పించింది సంఘం. ఆమెతో కాపురం చెయ్యడానికి అతనికి ఉన్న అభ్యంతరంఅతనిలోని సహజ ప్రకృతికీ, సంఘం తయారు చేసిన అతనిఅభిప్రాయానికీజరిగిన సంఘర్షణలోంచి వచ్చిందే. కథకుడు కూడా (మనందరిలాగే) సంఘంలోని మామూలు మనిషి. కురూపి భార్య చనిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకునే వీలు గురించి ఆలోచించడమూ, కురూపి భార్యతో ఎటువంటి స్నేహభావం పనికి రాదన్న తీర్మానమూ, కాటుక రంగుని చర్మం రంగుతో సమానం చేసినోరుజారడమూ” – ఇవన్నీ దీన్నే సూచిస్తాయి. కానీ అతనికి కూడా ఎక్కడో (మనలాగే) చటా్రల నించి బయట పడాలనే జిజ్ఞాసా, స్పందించే హృదయమూ (ఒక్కసారిగా అన్నీ మర్చిపోయిఎందుకు ఏడుస్తున్నావు?” అని అడగడం) ఉన్నాయి. అందువల్లనే అతనిలోని ప్రేమని వెలికి తెచ్చుకోగలిగాడు. “కురూపి అయిన భార్య మీద ప్రేమ చూపించరాదుఅన్న అభ్యంతరాన్ని దాటినాక (ఇక్కడ కూడా కొ.కు అతనిని idealise చేయకుండాకోకిల కంఠస్వరాన్నీ, అందమైన జుట్టునీ ఇంకా అంతకన్నా ముఖ్యం ఆమెలో ఉన్న స్నేహాన్ని, ప్రేమని చిత్రించారు balance tilt అవడానికి) కూడా సంఘం అతన్ని వదల్లేదు. ఇంకో రకం గా చెప్పాలంటే సంఘం చేత ప్రభావితమయ్యే లేత, బలహీనమైన మనసు అతన్ని పట్టుకొని పీడిస్తూనే ఉంది.

దీన్నించి బయట పడటానకి కొంత గడుసుగా ప్రయత్నించినట్లున్నాడు ( నాలుగు రోజులూ ఏదో విధంగా గడిచిపోనివ్వమనికోప్పడటమూ“, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకో అందగత్తె దొరక్కపోతుందా అని భార్యని ఏడిపించడమూ వగైరా) కానీ ఫలితం లేకపోగా చుట్టూ ఉన్న వాళ్ళు భార్య పట్ల స్నేహాన్నీ, ప్రేమనీపశుకామంగా పరిగణించి హేళన చెయ్యడం మొదలుపెట్టారు.

 

సంఘం ఏర్పాటు చేసిన ప్రమాణాలు లేని రూపం ఉన్నవాళ్ళతో (అందునా భార్యతో) స్నేహంగా, ప్రేమగా ఉండటం అనేవి ఆనాటి సాంఘిక పరిస్థితులలో ఊహించడానికి కూడా కష్టమేనేమో చాలా మందికి!

 

ప్రపంచం లోని విషయాలన్నీ తమ అవగాహనకే లోబడి ప్రవర్తించాలనుకునే కుహనా శాస్త్రవాదులు (మేనమామ కొడుకు) చెప్పినది (మరొక స్తీ్రని ఎరుగని కారణం చేతనే పశుకామం కొనసాగుతుందనడం) కథకుడికి సహించరానిదయింది.

 

తన జీవితాన్ని వెలిగిస్తున్న భార్య సాహచర్యమూ, తాము ఎంతో తమకంగా అనుభవిస్తున్న ప్రేమానుభవాలూ (కళ్ళతో మాట్లాడటం, భార్య తన కంటి భాష కోసం వెతకడం, ఒళ్ళు జిల్లుమనడం, ముక్కుతో చక్కిలిగింతలూ); ఇవన్నీ కాక తన అనాకారితనం వల్ల భర్తకు కలుగుతున్న తక్కువతనాన్ని తల్చుకొని ఆమె పడే బాధవీటి వల్ల కథకుడికి తన భార్య మీద ఉన్న ప్రేమ ద్విగుణీకృతం అవుతున్నది ఒక పక్క.

ఇంకో పక్క సంఘం ఇదికేవలం పశుకామమేఅని నిర్థరిస్తున్నది. సమస్యని తెగ్గొట్టడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఇంకో ఆడదాని పొందుని రుచి చూసి తేల్చుకోవడంఅప్పటికీ తన భార్య పట్ల తనకున్న సంబంధం లో మార్పు రాకపోతే అదికేవలం కామంకానట్లే.


కథకుడు ఇంకొక స్త్రీతో  సంబంధం పెట్టుకోకుండా, తనకు భార్యకు మధ్యలో ఉన్న అనురాగం (కథకుడి మాటల్లోనువ్వు కూడా చక్కని దానివేనని“) నిజమేనని తేల్చుకోలేడు. అందుకనే అలా చెయ్యాల్సొచ్చింది.

 

కథకుడిని నవమన్మధుడిగా వర్ణించడం కొ.కు శిల్పం లోని నేర్పు. సంఘటన (ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం అనేది) సులువుగా జరగడానికి వీలుగానే ఇలా కథకుడిని నవమన్మధుడిగా చిత్రించారనిపిస్తుంది.

 – రాధ మండువ

కథకి లింక్  http://ramojifoundation.org/flipbook/201402/magazine.html#/54

మీ మాటలు

 1. గురువు గారి గురించి ఎవరు రాసినా నాకు ఆనందమే బావుంది థాంక్స్ ఇంకా కొంచెం శ్రద గా రాయడానికి ప్రయత్నించ గలరు . కథ మొదటి వాక్యమే శిల్ప సౌందర్యానికి ఒక ఉదాహరణ . రాయండి రాయండి అయన కథలు అన్నిటి గురించి రాయండి . అల్లుడి అలక తిండి దొంగ దుష్ట బుధి తాతయ్య ఆమ్మమ్మ అన్నీ రాయండి రాయండి బావుంది బావుంది బావుంది

 2. చిత్ర గారూ, ధన్యవాదాలు. ఈ కథని చదివి అర్థం కాక భార్య మీద ప్రేమ ఉందని నిరూపించడానికి మరొక స్త్రీతో సంబంధం ఎందుకు పెట్టుకోవాలి? అని అనిపించింది. ఇక రాజశేఖర్ పిడూరి (మా వారు) తో డిస్కషన్ పెట్టుకున్నాను. ఆయన చెప్పిన విషయాన్ని సారంగ పాఠకులకు అందివ్వాలని రాసి పంపించాను.

  ఇప్పుడు మీరు రాసిన కామెంట్ చదవగానే మరో కథ తీసుకుని మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నాను. అవగానే మళ్ళీ రాసి పంపిస్తాను. కొకు మెదడుకి పని కల్పిస్తాడు కదా మరి!!?

  మాకు స్ఫూర్తిని కలిగించినందుకు మరోసారి ధన్యవాదాలతో –

  • చాల మంచి పని వారితో చర్చించండి రాయండి ఏమయినా చెయ్యండి కాని గురువుగారి గురించి రాయండి అది మంచి పని అవసరం అయిన పని ఆనందం కలిగించే పని రాయండి నా నుంచి ఏ పని కావాలన్న అడగండి కాని రాయండి ఇది ఒక కాలమ్ గా మార్చండి రాయండి
   chitramarao@gmail.com

మీ మాటలు

*