ఎవరు తవ్విన గోతులివి??

2007062553850301

పెద్ద రోడ్లపై, చిన్న రోడ్లపై,

సందులు గొందుల సన్న రోడ్లపై,

జూబిలి హిల్సూ, చింతల బస్తీ,

పెద్దల నగరూ, పేదల వాడా

భేదభావమే లేకుండా

                   గుంటలు! గుంటలు! గుంటలు! గుంటలు!

                   గోతులు!! గోతులు!! గోతులు!! గోతులు!!

సంకురాతిరికి ముగ్గులు వేస్తూ

తాటకి పెట్టిన చుక్కలు గోతులు,

నగరారణ్యపు మనుషుల వేటకు

యముండు పన్నిన ఉచ్చులు గోతులు

అనిపించేలా రోడ్లన్నీ

                   గుంటలు! గోతులు! గుంటలు! గోతులు!

                   గోతులు!! గుంటలు!! గోతులు!! గుంటలు!!

బురద గుంటలూ, మురుగు గుంటలూ,

లోతు గోతులూ, లేత గోతులూ,

మ్యాను హోలుసూ, మ్యాన్ మేడ్ హోల్సూ,

చిన్నా పెద్దా, ఎన్నో సైజులు,

ఎన్నో గుంటలు, ఎన్నో గోతులు!!

                   గోతులు! గుంటలు! గోతులు! గుంటలు!

                   గోతులు!! గోతులు! అబబా!! గోతులు!!

తుచ్ఛపు నోట్లకు బ్రహ్మాస్త్రాలను

అమ్మిన పాపం తలలకు చుట్టగ

ఉచ్చుకు చిక్కిరి పిచ్చిజనం!

తమ గోతిని తామే తవ్వుకుని

అందులో దూకిరి వెర్రిజనం!!

— వెల్లంపల్లి అవినాష్

మీ మాటలు

  1. శ్రీ శ్రీ “గంటలు’ కవితకు పేరడీ బావుంది.

  2. venkata ramana says:

    తుచ్ఛపు నోట్లకు బ్రహ్మాస్త్రాలను

    అమ్మిన పాపం తలలకు చుట్టగ

    ఉచ్చుకు చిక్కిరి పిచ్చిజనం!

    తమ గోతిని తామే తవ్వుకుని

    అందులో దూకిరి వెర్రిజనం!! చాలా బాగుంది అవినాష్ గారు

  3. ఏల్చూరి మురళీధరరావు says:

    శ్రీ వెల్లంపల్లి అవినాష్ గారికి
    నమస్కారములతో,

    స్విన్ బర్న్ రచనలోని శబ్దాలంకారం శ్రీశ్రీ గుండెగుడిలో గంటలను మ్రోగింపగా, దాని ‘లోతులను’ స్ఫురింపజేస్తున్న మీ హాస్యానుకరణ చిత్రోక్తి బాగున్నది. :)

    • వెల్లంపల్లి అవినాష్ says:

      ధన్యవాదాలు మురళీధరరావు గారూ! :)

Leave a Reply to వెల్లంపల్లి అవినాష్ Cancel reply

*