షో పూర్తయిన గంటలోగా రివ్యూ రాయాల్సి వస్తున్న ఈ కాలంలో అంతకన్నా ఆలోచించే ఓపికా, సమయం సోకాల్డ్ క్రిటిక్ కి ఉండవు. ఫ్యామిలీ హీరోల అజెండాల్ని, బిగ్ బడ్జెట్ సినిమాల ఇంట్రెస్టుల్ని, ఓవర్సీస్ రైట్స్ రేట్లలో తేడాల్ని నిర్దేశించే క్రిటిక్స్ ని వదిలేస్తే మిగతావాళ్ళు కేవలం సినిమా మీద ప్రేమతో తమ ఎన్నో శుక్రవారాల్ని సినిమాలు అనబడే అవమానాల్ని వెండితెరమీద కనురెప్పవెయ్యకుండా చూసి, భరించికూడా ఇంకా అడపాదడపా వచ్చే మంచి సినిమాల కోసం వెతుకుతూ, వేచి ఉంటారనే సంగతి మర్చిపోకూడదు.
ప్రతి ప్రేక్షకుడూ పొటెన్షియల్ రివ్యూయర్/క్రిటిక్ అవుతున్న ఈ సమయంలో “సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రిటిక్” అంటూ సినిమాల గురించి రాసేవాళ్లను ఆరళ్ళు పెట్టడమూ చెల్లదు. వీలైతే మీకున్న జ్ఞానంతో మీ రివ్యూ మీరు రాసుకోండి. అప్పుడు మీరూ క్రిటిక్ అవుతారు. సింపుల్.
-కత్తి మహేష్ కుమార్
సినిమా మీద ప్రేమతో తమ ఎన్నో శుక్రవారాల్ని సినిమాలు అనబడే అవమానాల్ని వెండితెరమీద కనురెప్పవెయ్యకుండా చూసి, భరించికూడా ఇంకా అడపాదడపా వచ్చే మంచి సినిమాల కోసం వెతుకుతూ, వేచి ఉంటారనే సంగతి మర్చిపోకూడదు.
క్రిటిక్ అనేవాడు సినిమా చూస్తుండగా తను పొందిన అనుభవాన్ని, తనకున్న జ్ఞానాన్ని కలగలిపి సినిమా ఎలాంటిది అనే నిర్థారణకు వస్తాడుగానీ, ఆడియన్స్ అనే ఒక కాల్పనిక యూనిట్టు ఆ సినిమాకు ఏ విధంగా రియాక్టు అవుతుంది అనే బేరీజు వెయ్యడానికి రాడు.
అద్భుతం! అంతే!
నైస్ ఎనాలిసిస్ :)
ఇంకా ఉంది కదా? ?? ఈ కొంచెమూ బ్రిలియంట్ గా ఉంది , పరంపర రావలసి ఉంది ….
మీ పేరుకు మల్లే కత్తిలా ఉంది.
ఎనాలసిస్ అద్భుతః మీ భావావేశం అత్యద్భుతః
చదివాక – కళ్ళు, బుర్ర, మనసు – మూడూ చల్లబడ్డాయి!
హైబ్రో, లోబ్రో కల్చర్ల పాలిటిక్స్ మొదలు, సినిమా అనే కొత్త మతం ఇమేజెస్ తో మైండ్ ని ఎంతగా మానిప్యులేట్ చేస్తోందో తెలుసుకోవడంతో పాటూ, “టేస్ట్” పేరుతో మనలోనూ పెరిగే ప్రెజుడిస్ లో ఆధిపత్యభావజాలం ఎంతుందో అదీ అర్థమయ్యింది.
–ఇది చాలా బావుంది .. ఇంకా డీప్ గా రాయండి , నాన్ ఫిలిం పీపుల్ ఇంకా , ఇప్పటి సినిమాల మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నవాళ్లకి అర్ధం అయేలా .. మంచి ప్రయత్నం mahesh గారూ
చాలా చాలా చాలా బావుంది.. :) :) :) :)
కత్తిలా ఉంది.
ఎకసెక్కాలు, ఆరళ్ళు, అడపాదడపా లాంటి తెలుగు పదాలు వాడటం బాగుంది.
చూడటం, విశ్లేషించడం ఒక ఎత్తు, మరొకరు చదివి ఆనందించేలా రాయడం మరొక ఎత్తు.
మీ ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్టు లో ఉన్నందు వల్ల, మీ స్టేటస్ ల పైన మీ నోట్స్ పైన జరిగే గొడవ చూస్తాను కాబట్టి మీరు ఈ పీస్ రాయడానికి స్ఫూర్తి ఎక్కడిదో అర్థమయింది. చాల బాగ convey చేసారు ఒక Film Analyser యొక్క frustration ని. మీ అంత exposure మరియు knowledge లేకపోయినా, నేనూ empathize చేయగలిగాను- ఎన్నో రకాల సినిమాలు చూసి, ఫిలిం థియరీలు చదివిన Critical mind కి మన upbringing మరియు environment వల్ల ఏర్పడ్డ Emotional requirement కి చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది బుర్రలో. అది సరిపోదన్నట్టు, “ఈ దిక్కుమాలిన discussion లు పెట్టకు, సినిమాని అంత సిరియస్ గా తీసుకోకుండ ఎంజాయ్ చేయ” మనె స్నేహితులు కోకొల్లలు. Well written.
మీకు ఈ చర్చ నచ్చుతుందని భావిస్తున్నాను- http://thebigindianpicture.com/2013/01/moveable-feast-critics/