కోరుకున్న సంభాషణ

1461640_10201799207174515_2052934506_n
  వేళ్ళలోతులలో రంగులు ముంచి
  మనసు గుమ్మాలకి కుంచెలు ఆనించి
  ఉదయం నుంచి అర్దరాత్రి వరకు రంగులలో నానిన చిత్రం
   ప్రదర్శనలో
   గోడ గుండెల మీద నిల్చోగానే
   సముద్ర అగాడత్వం, ఆనందం, ఆత్మపిలుపు   చూస్తారని
   ఎదురుచూడడం మొదలు పెట్టింది
   ఎన్నో జతల కళ్ళు నీరెండమెరుపులా వాలి
   సౌందర్యాన్ని దిగులులో ముంచి చర్చిస్తూ
   అర్దంకాని సమూహాలుగా
పక్షుల గుంపులై ఎగిరిపోయాయి
ashok12
   దేహాన్ని ఆవరించిన ప్రేమ నేత్రాలలో ప్రకాశించడం
   తామరపూలు వికసించి నవ్వడం
   ప్రేమించిన స్త్రీ పెదవులమీద
మోహరించిన నవ్వుని చూస్తారని
    వెతకడం మొదలుపెట్టింది
   పడకగది గోడలమీద ఆనుకుని వాళ్ళనే చూస్తూ
    రంగులతో ఎప్పటికైనా సంభాషిస్తారని
  రంగులలో ముఖాలు స్పర్శలు వెతుకుతారని
   కళ్ళువిప్పార్చి చూస్తూనే ఉంది
     ఒక మాటకోసం
     ఒక ముఖం కోసం
     ఒక సంభాషణ కోసం….
(కృ ష్ణ ఆశోక్  గారి చిత్రాలు చూసాక)
– రేణుకా అయోల

మీ మాటలు

 1. దేహాన్ని ఆవరించిన ప్రేమ నేత్రాలలో ప్రకాశించడం
  తామరపూలు వికసించి నవ్వడం
  ప్రేమించిన స్త్రీ పెదవులమీద
  మోహరించిన నవ్వుని చూస్తారని
  వెతకడం మొదలుపెట్టింది…

  చాలా బాగుంది. సంభాషణ కోసం ఎదురు చూడ్డం నచ్చింది మేడం..

మీ మాటలు

*