నువ్వు మళ్ళీ!

Thilak

కొన్ని సంభాషణల వల్లో
మరిన్ని సందిగ్దాల వల్లో
నిన్ను నువ్వు కొత్తగా రాసుకోడానికి యత్నిస్తుంటావు చూడు…

అప్పుడే రాలిపడుతున్న పక్షి రెక్కల్లాగా
బొడ్డుతాడుతో కుస్తీ పడుతూ గర్భాశయంలో అప్పటిదాకా పాతుకుపోయిన తనని తాను
లోకానికి పరిచయం చేసుకునే మాంసపు ముద్దలా
నువ్వుహించుకున్నపుడు

నిన్ను మరచి నీది కాని స్తన్యంలోకి ఆబగా చొచ్చుకుంటూ వడగళ్ళ దాహార్థిని
మునివేళ్ళ సందుల్లో బందిస్తూ పసిపిచ్చుక తపన

అప్పుడనుకుంటావు నీకునువ్వుగా ఏదో సాదించావులే ఈ వెదవ జీవితాన ఎందరో
మనసులకు అంత్యక్రియలు జరిపినతరువాత

చినుకుల్ని లెక్కెడుతూ
మబ్బుల్ని తోసేస్తూ
దొరికిన కూసింత స్థలంలోనే ఆరడుగుల స్వార్థ పీలికలను ఒక్కొక్కటిగా నీలోకి
చేర్చుకుంటూ ఒదిగిపోతావు మళ్ళీ నీలోకి నిన్ను దాచేస్తూ….

తిలక్ బొమ్మరాజు

మీ మాటలు

 1. నిన్ను మరచి నీది కాని స్తన్యంలోకి ఆబగా చొచ్చుకుంటూ వడగళ్ళ దాహార్థిని
  మునివేళ్ళ సందుల్లో బందిస్తూ పసిపిచ్చుక తపన…

  కళ్ళు చెమర్చాయి తిలక్.. కవిత్వ దాహం యిలా తీరుతున్నందుకు అభినందనలు…

 2. దొరికిన కూసింత స్థలంలోనే ఆరడుగుల స్వార్థ పీలికలను ఒక్కొక్కటిగా నీలోకి
  చేర్చుకుంటూ ఒదిగిపోతావు మళ్ళీ నీలోకి నిన్ను దాచేస్తూ….అభినందనలు మిత్రమా

 3. నిశీధి says:

  పదాలు ఎంత కటినంగా వాడాలని చూసినా మొత్తంలో మీరే కనిపిస్తున్నారు స్మూత్ న్ స్వీట్ . కంగ్రాట్స్ :)

 4. మీలో మంచి భావన ఉన్నట్లు మీ కవిత చెబుతూ ఉంది. దీన్ని ఇంకా పదును పెట్టుకోవచ్చు కూడా.
  కానీ మీరు భాష పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఇంత చిన్న కవితలో ఇన్ని అక్షరదోషాలు వ్యాకరణ దోషాలా.
  దోషాలనే కాదు మృదు మధురమైన భాననుచెప్పడానికి దానికి తగిన మార్దవం ఉన్న పదాల్ని ఎన్నుకుని ఉంటే కవిత ఇంకా అందం చిందేది. స్వార్థపీలికలు సమాసం అంగీకార్యం ఏమాత్రంకాదు. వ్యాకరణం సంగతి వదిలినా అది వినడానికి కటువుగా ఉంది. శుభం. పులికొండ సుబ్బాచారి.

మీ మాటలు

*