రెప్పతెరిచేలోగా…

జాన్ హైడ్ కనుమూరి

జాన్ హైడ్ కనుమూరి

మబ్బుకమ్మిన ఆకాశంలో ఎటో తప్పిపోయిన గాలిపటమై
గాలిపటం – చేతిలోని చరకాల మధ్య
తెగిన దారమైనప్పుడు
ఏది ఆత్మహత్య చేసుకున్నట్టు?
***
వినీలాకాశంలోకి
గాలిపటాలను రంగుల్లో ఎగురవేయడం
దారాలను మాంజాలుగా మార్చడం
తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని
కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం
***
రోషాన్నో పౌరుషాన్నో
కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
ఎగిరిపడ్డ కత్తివేటుకు
రక్తమోడిన నేల
విలవిలలాడే దేహాలమధ్య
వినోదమెవరిది? జూదమెవరిది?
***
అంతా ఎదురుగానే ఉంటుంది
సూర్యాస్తమయానికి వెలుగుపై చీకటికమ్మిట్టు
ఒక భ్రమ ఒకభ్రాంతి
వెలుగురేఖను కత్తిరిస్తుంది
రెప్పతెరిచేలోగా
ఒకదేహం జీవశ్చవమౌతుంది
ఒకదేహం కన్నీరుమున్నీరౌతుంది
***
ఆత్మను ఎవ్వరూ హత్యచేయలేరు
మెలిపెట్టీ  మెలిపెట్టీ
నొక్కేసేచేతులమధ్య స్వరాన్ని కోల్పోతుంది
ఇక శరీరం
తన్నుతాను హత్యకావించుకుంటుంది
గొంతును నులిమిన చెయ్యి కనబడకుండా
“ఆత్మహత్య”  అరుపులు కోలాహలమౌతాయి
***
చెమర్చిన కన్నేదీ
నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు
***
ఎక్కడో
ఒక తీతువు గొంతును
ఒక రాబందు రెక్కలను సరిచేసుకుంటాయి
****
తెగిన గాలిపటం ఏ కొమ్మకో చిక్కుకుంటుంది
రక్తమోడ్చిన పందెపు పుంజు మషాలాలతో ఎవ్వరికో విందు చేస్తుంది
ఇది ఆత్మహత్యేనా అని చెవులు కొరుక్కుంటూనే ఉంటాం

మీ మాటలు

  1. buchireddy gangula says:

    బాగుంది జాన్ జి
    ——————————
    బుచ్చి రెడ్డి గంగుల

    • జాన్ హైడ్ కనుమూరి says:

      థాంక్స్
      బుచ్చి రెడ్డి గంగుల గారు

  2. రాజశేఖర్ గుదిబండి says:

    “రోషాన్నో పౌరుషాన్నో
    కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
    ఎగిరిపడ్డ కత్తివేటుకు
    రక్తమోడిన నేల
    విలవిలలాడే దేహాలమధ్య
    వినోదమెవరిది? జూదమెవరిది?”

    చాలా బాగుంది సర్

  3. Rajasekhar Gudibandi says:

    “రోషాన్నో పౌరుషాన్నో
    కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
    ఎగిరిపడ్డ కత్తివేటుకు
    రక్తమోడిన నేల
    విలవిలలాడే దేహాలమధ్య
    వినోదమెవరిది? జూదమెవరిది?”

    —-చాల బాగుంది సర్

  4. శ్రీనివాసు గద్దపాటి says:

    రోషాన్నో పౌరుషాన్నో
    కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
    ఎగిరిపడ్డ కత్తివేటుకు
    రక్తమోడిన నేల
    విలవిలలాడే దేహాలమధ్య
    వినోదమెవరిది? జూదమెవరిది….

  5. జాన్ గారు,

    కవిత బాగుంది.

    రవి

  6. సగం కవిత వాచ్యమైంది. అయినా మిగతా కవితలో మంచి ధ్వని ఉంది. తాకే గుణమున్న మంచి కవిత.
    సుబ్బాచారి పులికొండ.

    • జాన్ హైడ్ కనుమూరి says:

      మీ పరిశీ లనాత్మకమైన స్పందనకు ధన్యవాదాలు
      “సగం కవిత వాచ్యమైంది.” కొంచెం వివరించ గలరా?

  7. ఈ కవితలో పూర్తి స్పష్టత లేకపోయినా కవితా స్పర్శ,కళాత్మకత ఉండటం విశేషం. కాబట్టి Congratulations .

  8. జాన్ హైడ్ కనుమూరి says:

    స్పందించిన అందరికి మరియు పత్రిక సంపాదకులకు నా ధన్యవాదాలు

  9. Augustus Kanumuri says:

    చెమర్చిన కన్నేదీ
    నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు

Leave a Reply to జాన్ హైడ్ కనుమూరి Cancel reply

*