నిష్క్రమణ అంటే…

 ఎల్. ఆర్. స్వామి

ఎల్. ఆర్. స్వామి

ఒక రోజు ,

ఇంటి తలుపులు తెరిచేవుంటాయి

చిరు జల్లు కురిస్తూ ఉంటుంది .

కొలువు మూసిన సూర్యుడు

ఒక సారి తొంగి చూసి నిష్క్రమిస్తాడు

యెర్ర మబ్బుల గాయాలతో ,

పొగమంచుల స్వేద బిందువులతో ,

మరో ఉదయం కోసం ,మరునాటి యుద్ధం కోసం ,

కొత్త వెలుగు నింపుకోవటం కోసం .

నా  మిత్రుడు ,అల్లరి గాలి

ఇంటి లోపకి చొరబడుతాడు

లోలోపల ఇర్రుకు పోతాడు

ఇంటిలో నేను ఉండను –

కాని నా ప్రపంచం ఉంటుంది

అక్షరాల ప్రపంచం ఉంటుంది

నా చూపులుంటాయి ,కళ్ళద్దాలుగా

నా ఇంటి గొడలూ వుంటాయి

కాని వాటికి నేను పామిన రంగులుండవు

ప్రపంచపు రంగులుంటాయి

మా ఇంటి గోడ రంగు

ప్రపంచపు రంగు వైనప్పుడు

ఇక నేనుండను –నిష్క్రమిస్తాను

నిష్క్రమణ అంటే ఒక విస్తరణ

నూతనత్వం కోసం వేసే తొలి అడుగు .

-ఎల్. ఆర్.స్వామి

మీ మాటలు

  1. Rajasekhar Gudibandi says:

    ” నిష్క్రమణ అంటే ఒక విస్తరణ

    నూతనత్వం కోసం వేసే తొలి అడుగు .”

    ——–చాలా బాగుంది సర్ ..

  2. Mangu Siva Ram Prasad says:

    స్వామిగారు ! కవిత బాగుంది. ఒక సూర్యాస్తమయం మరో సూర్యోదయం కోసమే. ఒక నిష్క్రమణం మరో విస్తరణం కోసమే అన్నది మనోజ్ఞమైన భావన. నూతనత్వం ప్రకృతి ధర్మం. ఈ జీవిత మర్మాన్ని విప్పి చెప్పినందుకు ధన్యవాదాలు. .

మీ మాటలు

*