ఆమె

Katha ku Bomma (1)

రాత్రి  ఎనిమిదింటప్పుడు రావడంరావడంతోనే తన గదిలోకి వెళ్లిపోయి..
‘డామిట్‌.. ఐ కాంట్‌’ కసిగా అంటూ స్టడీ  వస్తువులన్నీ విసిరేయసాగాడు పద్దెనిమిదేళ్ల ప్రణవ్‌!
ప్రణవ్‌.. వాట్‌ ద హెల్‌ ఆర్‌ j­ డూయింగ్‌! స్టాపిట్‌!’ అంటూ కొడుకుని ఆపే ప్రయత్నం చేస్తోంది వసుధ.
‘నో..’ అరుస్తూ తల్లిని తోసేయసాగాడు. వాడిబలాన్ని నియంతించలేక అక్కడేఉన్న కుర్చీలో చతికిలబడింది. పిచ్చిపట్టినవాడిలా చేతికందిన వస్తువునల్లా విసిరేస్తున్న కొడుకుని చూసి భయపడిపోయింది. వాడిని ఆపడం తన ఒక్కదానివల్ల కాక ‘అస్త్రా…’ అని ఇరవైళ్ల కూతురిని కేకేసింది సాయం కోసం.
‘అమ్మా…’ అంటూ కంగారుగా పరిగెత్తుకొచ్చింది తల్లిపిలుపు వినిపించిన గదిలోకి. అల్లకల్లోలంగా ఉన్న ఆ చోటుని చూసి బిత్తరపోయింది అస్త్ర. వెర్రివాడిలా పవర్తిస్తున్న తమ్ముడ్ని  పట్టలేక తల్లిపడుతున్న అవస్థ చూసింది. వెళ్లి తమ్ముడిని  లాగి చెంపమీదొక్కట్టిచ్చింది. ఆ దెబ్బకు ఈ లోకంలోకొచ్చాడు ప్రణవ్‌.
‘ఆర్‌ యు మ్యాడ్‌? ఏంటిదంతా?’ బెదిరించింది తమ్ముడిని.
‘సాయంతం మాల్‌లో ఆమె కనిపించిందీ….!’ మళ్లీ అరిచాడు.
‘ఎవరు?’ ఏదో అనుమానం వసుధ పశ్నలో.
ప్రణవ్‌ ఏదో చెప్పబోతున్నంతలో ఆ మాటకు అడ్డుతగులుతూ ‘ఆ కనిపిస్తే.. ఇంటికొచ్చి నువ్విలా హంగామా చేస్తావా? బీ గ్రోనప్‌! నువ్వేం చిన్నపిల్లాడివి కాదు. కిందపడేసినవన్నీ తీసి ఎక్కడివక్కడ నీట్‌గా సర్దెయ్‌!’ అని తమ్ముడిని ఆజ్ఞాపించి ‘నువ్‌ రా అమ్మా..!’ అంటూ తల్లి భుజం చుట్టూ చెయ్యివేసి ఆమెను హాల్లోకి తీసుకెళ్లింది. తల్లిని సోఫాలో కూర్చోబెట్టి  ఫ్రిజ్ లోంచి వాటర్‌ బాటిల్‌ తీసుకొని మళ్లీ తమ్ముడి  గదిలోకి వెళ్లింది అస్త్ర. లోపలికెళుతూనే గది తలుపేసి వాటర్‌ బాటిల్‌ ప్రణవ్ కందించింది. బాటిల్‌ ఎత్తి గటగటా నీళ్లు తాగి భుజంతో మూతి  తుడుచుకుంటుండగా అంది అస్త్ర..‘రేయ్‌.. నీకెన్నిసార్లు చెప్పానా అంత ఎమోషనల్  అవొద్దని!  ఎంత సీరియస్‌ విషయాలనైనా మాములుగా  చూడ్డం నేర్చుకోరా…! దట్‌ టూ నువ్‌ ఆవేశపడిపోతున్నదంత సీరియస్‌ థింగ్‌ కాదు!’ వాడి తలనిమురుతూ  అనునయిస్తున్నట్టుగా!
అస్త్ర చేయిని విసురుగా తోసేశాడు. ‘నీకు సీరియస్‌ కాకపోవచ్చు… నాకు సీరియసే! అమ్మ ఎన్ని రోజులు బాధపడిందో నువ్వు మర్చిపోయావేమో … బట్‌ ఐ డోంట్‌!’ అన్నాడు నోరు పెంచి!
‘ష్‌… నెమ్మదిగా!’ అంది గాభరాగా.. హాల్లో ఉన్న తల్లికి వాడి మాటలు  వినపడతాయేమో  అని!
‘మన హ్యాపీనెస్‌ను దూరంచేసి ఆవిడ మాత్రం  నవ్వుతూ తెగహ్యాపీగా తిరుగుతోంది. నాకసలూ…!’ అంటూ ముక్కు పుటాలెగరేస్తూ పిడికిలి బిగించాడు ప్రణవ్‌!
‘సర్లే.. ముందు  కిందపడ్డవన్నీ తియ్‌!’ అంది వాడి సీరియస్‌నెస్‌ను చెదరగొడుతూ! ప్రణవ్‌ చేతిలో ఉన్న బాటిల్‌ తీసుకొని గదిలోంచి హాల్లోకొచ్చింది అస్త్ర. అక్కడ సోఫాలో తల్లికనిపించలేదు. బాటిల్‌ డైనింగ్‌  మీద పెడుతూ హాల్లోని బాల్కనీలోకి చూసింది. తల్లి కనిపించింది. నెమ్మదిగా వెళ్లి వెనకనుంచి వాటేసుకుంది ‘అమ్మా..!’ అంటూ ఆమె మూడ్ ని  తేలికచేయాలని.
అస్త్ర చేతుల్లోంచి తనను విడిపించుకుంటూ అలాగే కూతురు రెండు చేతులను పట్టుకొని తనకెదురుగా నిల్చోబెట్టుకుంది..‘వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?’ అంది కూతురు కళ్లల్లోకి సూటిగా చూస్తూ!
విషయాన్ని దాచడం అనవసరం అని గ్రహించిన అస్త్ర ‘అపర్ణ ఆంటీ గురించి’ అంది అంతే స్పష్టంగా!
దీర్ఘంగా నిట్టూర్చిన వసుధ అలాగే నిలబడిపోయింది.

‘శ్రీరామ్  … ఈవినింగ్‌ షాపింగ్‌మాల్లో ప్రణవ్‌ కనిపించాడు!’ బెడ్‌రూమ్ లోకి వస్తూ చెప్పింది అపర్ణ.
‘ఊ….!’ విన్నాడు శ్రీరామ్ ల్యాప్‌లోంచి తలెత్తకుండానే!
‘వాడేంటో నన్ను శతువును చూసినట్టు చూస్తాడు!’ అంది మంచమ్మీద అవతలివైపు కూర్చుంటూ!
శ్రీరామ్ ఏకాగ్రత చెదిరింది. దాన్ని అపర్ణ గుర్తించకుండా ఉండేందుకు ల్యాప్‌టాప్‌ కీ బోర్డ్‌ మీద వేళ్లు కదిపాడు నటించడానికి.
‘అస్త్ర బాగానే మాట్లాడుతుంది… ప్రణవే ఎందుకలా ఉంటాడు?’ అంది శ్రీరాం జవాబును ఆశిస్తున్నట్టుగా!
‘లైట్‌ తీస్కో అపర్ణా!’ జవాబైతే చెప్పాడు కాని అపర్ణకు అది సంతృప్తినివ్వదని అతనికి తెలుసు.
‘ఎంతకాలమని? అయినా.. నేనెప్పుడైనా వాడిని తక్కువ చూశానా? ఎంత కలుపుకుపోవాలని ట్రై చేసినా.. వాడి బిహేవియర్‌తో ఇన్‌సల్ట్‌ చేస్తుంటాడు!’  ఆ విషయమ్మీద ఎలాగైనా డిస్కషన్‌ పెట్టాలనే ఉద్దేశంలో అపర్ణ.
సీన్‌ అర్థమైంది శ్రీరామ్ కి. ఇంకెంతోసేపు నటించడం కుదరదు అనుకొని ల్యాప్‌టాప్‌ షట్‌డౌన్‌ చేసి ఒళ్లోంచి తీసి మంచమ్మీద పెట్టాడు.
‘నీ బాధేంటి?’ ఇప్పుడు చెప్పు విషయమేంటి అన్నట్టుగా శ్రీరామ్!
‘ఈ విషయంలో నేనోసారి వసుధతో మాట్లాడాలనుకుంటున్నాను!’ స్థిరంగా చెప్పింది అపర్ణ.
‘అంటే వసుధే ప్రణవ్‌తో అలా చేయిస్తోం…!’ శ్రీరామ్ మాటపూర్తికాకముందే అడ్డుపడిరది అపర్ణ ‘ఛఛ…!’ అని.
‘ప్రణవ్‌కి నామీదున్న మిస్‌అండర్‌స్టాండింగ్ను దూరంచేయడానికి!’ తేల్చింది అపర్ణ!
జవాబేమీ ఇవ్వకుండా మంచం పక్కనే ఉన్న టీపాయ్‌ మీది మ్యాగజైన్‌తీసుకుని  అందులో తలదూర్చాడు శ్రీరామ్.

‘నన్నెందుకు రమ్మన్నారు?’ రెస్టారెంట్లో శ్రీరామ్ కెదురుగా ఇబ్బందిగా కూర్చున్న ప్రణవ్‌ సూటిగా అడిగిన మాట!
‘ఏం తీసుకుంటావ్‌?’ ఇబ్బందిని అనుకూలంగా మార్చేప్రయత్నంలో శ్రీరామ్.
‘నన్నెందుకు పిలిచారో చెప్పండి డాడ్‌!’ అదే ప్రశ్న ఇంకొంచెం తీవ్రంగా ప్రణవ్  నుంచి.
బేరర్‌ని పిలిచి రెండు ఫ్రూట్‌పంచ్‌లు ఆర్డరిచ్చి సంభాషణ మొదలెట్టడానికి గొంతు సవరించుకున్నాడు శ్రీరామ్.
‘చిన్నా…’ అంటూ ప్రణవ్‌ చేయినొక్కాడు సున్నితంగా శ్రీరామ్ తను మాట్లాడబోయేమాటలకు నాందిగా..
‘చెప్పండి’ అంటూ మెల్లగా తన చేయిని వెనక్కి లాక్కున్నాడు ప్రణవ్‌!
‘రేయ్‌.. నేను ఇదివరకే నీతో మాట్లాడాల్సింది!’ శ్రీరామ్
‘దేనిగురించి డాడీ…!’ అప్పుడే బేరర్‌ తెచ్చిన ఫ్రూట్‌పంచ్‌ గ్లాస్‌ను తనవైపు లాక్కుంటూ అన్నాడు ప్రణవ్‌.
‘అపర్ణ గురించి!’ కొంచెం ఇబ్బంది ధ్వనించిన గొంతుతో శ్రీరామ్.
ప్రణవ్‌ సైలెంట్‌గా ఫ్రూట్‌పంచ్‌లోని స్టాను గమనిస్తూ ఉండిపోయాడు.
‘నువ్విప్పుడు అన్ని విషయాలూ ఆలోచించే ఏజ్‌కొచ్చావ్‌. ఐ మీన్‌ నౌ ఆర్ యూ  మెచ్యూర్డ్‌ గై! అపర్ణను, ఆమె నా లైఫ్‌లోకొచ్చిన సిట్యుయేషన్‌నూ నువ్‌ అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను..’ అని ప్రణవ్‌ వంక చూశాడు శ్రీరామ్!
ఎలాంటి ఫీలింగ్‌ లేకుండా అలాగే స్టాతో ఆడుకుంటున్నాడు ప్రణవ్‌!
‘ప్రణవ్‌.. ఆర్‌ యు ­ లిజనింగ్‌ టు మి?’ కొంచెం గట్టిగా శ్రీరామ్.
తలపైకెత్తి కళ్లతోనే ‘యెస్‌’ అన్నట్టు సైగ చేశాడు ప్రణవ్‌.
‘అపర్ణ నా లైఫ్‌లోకి రావడం.. ఇట్స్‌ యాన్‌ యాక్సిడెంటల్‌ థింగ్‌!’ అసహనంగా అన్నాడు శ్రీరామ్.
‘యాక్సిడెంటల్‌ అయినా… వాటెండ్‌ అయినా  అమ్మ ఫేస్‌ చేసిన బాధ,  నేను, అక్క మిమ్మల్ని మిస్‌ అయిన మూమెంట్స్‌ అయితే నిజమే కదా!’ నిర్లక్ష్యంగా అన్నాడు ప్రణవ్‌.
‘అఫ్‌కోర్స్‌రా… కాదనడంలేదు. కాని మీ అమ్మ నా సిట్యుయేషన్‌ అర్థంచేసుకుంది… మీరు నన్నెంత మిస్‌ అవుతున్నారో..నేనూ మిమ్మల్ని అంతే మిస్‌ అవుతున్నా..! అయినా నేనేం మిమ్మల్ని కాదని.. మీకు అందకుండా వెళ్లిపోలేదు కదా… మీతో ఉండకపోయినా… కలుస్తూనే ఉన్నా.. మీ అవసరాలు తీరుస్తూనే ఉన్నా!’ సమర్థించుకునే ప్రయత్నంగా శ్రీరామ్!
‘అకేషన్స్‌కి బట్టలు కొనిపెట్టి, వీకెండ్స్‌ మాతో గడిపితే మాకు దగ్గరగా ఉన్నట్టా డాడీ…! ఆవిడే లేకపోతే మిమ్మల్నిలా  వీకెండ్స్‌కి కల్సుకోవాల్సిన అవసరమేంటి మాకు?’  మీద పిడికిలితో చిన్నగా గుద్దుతూ అన్నాడు ప్రణవ్‌!
‘డాడీ… మీరంటే నాకు కోపంలేదు.. ఆవిడంటే కోపం… మిమ్మల్ని మానుంచి తీసుకెళ్లిపోయినందుకు కోపం.. అమ్మ ఎన్ని రోజులు ఏడ్చిందో నాకు తెలుసు. ఐ నెవర్‌ ఫర్‌గెట్‌ దోస్‌ డేస్‌! దానికి రీజన్‌ ఆమే…ఆమే.. ఆమే..!’ దాదాపుగా అరిచేస్తూ ప్రణవ్‌!
బిత్తరపోయాడు శ్రీరామ్. కాసేపటిదాకా నోటమాటరాలేదు అతనికి.
‘నో.. చిన్నా! ఇందులో అపర్ణ తప్పులేదు. ఆమె నాలైఫ్‌లోకి తనంతట తాను రాలేదు నేను ఇన్వైట్‌ చేశాను.  ఆమెను ఇష్టపడ్డాను. నీకు పదేళ్ల వయసప్పుడు.. కంపెనీ అసైన్‌మెంట్‌ మీద సింగపూర్‌ వెళ్లాను. సెవెన్‌మంత్స్‌ ఉన్నానక్కడ. ఆ టైం లో  అపర్ణతో ఫెండ్‌షిప్‌ అయింది. ఆమె లవ్‌చేశాను. తనతో నా లైఫ్‌ షేర్‌ చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం మీ అమ్మకు చెప్పి డైవోర్స్‌ తీసుకున్నాకే తనని పెళ్లిచేసుకున్నాను. నువ్వనుకున్నట్టు తప్పు ఆమెది కాదురా.. నాది. నన్ను వదిలి తననెందుకు ఓ ఎనిమీలా చూస్తావ్‌! మిస్టేక్‌ వజ్‌ మైన్‌!’ శ్రీరామ్ ఆవేశంగానే చెప్పాడు. అంతలోకే స్వరం తగ్గించి
‘చిన్నా… అపర్ణను మీ అమ్మలా చూడమని చెప్పట్లేదు. బట్‌ ఓ ఉమన్‌గా j­ హావ్‌ టు రెస్పెక్ట్‌ హర్‌! ఐ కెన్‌ అండర్‌స్టాండ్‌ యు­వర్‌ ఎగోని. కాని నేను మీ పట్లెప్పుడూ ఇర్రెస్‌పాన్స్‌బుల్‌గా లేను నాన్నా…! నాకు మీరు కావాలి, అపర్ణా కావాలి! అమ్మను చాలా బాధపెట్టాను.. ఒప్పుకుంటా! ఒకవేళ అమ్మ ఇట్లాంటి పనిచేస్తే నేను క్షమించేవాడిని కాదేమో … కాని అమ్మ నన్ను ఫర్‌గివ్‌ చేసింది! అపర్ణను ఓ ఫ్రెండ్ లా  రిసీవ్‌ చేసుకుంది. రెస్పెక్ట్‌ ఇస్తోంది.  ఈవిషయంలో వసుధ హుందాతనాన్ని చూసి సిగ్గుతో చితికిపోయిన రోజులు నాకూ ఉన్నాయ్‌రా! మీ అమ్మనెంత క్షోభపెట్టానో అని కుమిలిపోయిన రాత్రుళ్లు  ఎన్నో!  తనని ఒంటిరిని చేశానే అని చిత్రవధ  అనుభవించిన సందర్భాలు బోలెడు! ఆ తప్పులన్నీ నావిరా! అపర్ణవి కావు! షి ఈజ్‌ ఇన్నోసెంట్‌ ఇన్‌ దిస్‌ మ్యాటర్స్‌! షి నీడ్స్‌ ది సేం రెస్పెక్ట్‌  ఫ్రం యు రా చిన్నా…!’ అంటూ ప్రణవ్‌ చేయి పట్టుకున్నాడు.
తండి కళ్లల్లోని సన్నని నీటి పొర కొడుకు దృష్టినుంచి తప్పించుకోలేకపోయింది!

‘ప్రణవ్‌… యోయో హానీసింగ్‌ షోకి పాస్‌లు వచ్చాయ్‌రా!’ అప్పుడే వచ్చి గదిలోకి దూరి తలుపేసుకున్న కొడుకు వినేలా గట్టిగా చెప్పింది వసుధ.
కొన్ని క్షణాలకు డోర్‌ తీసుకొని టవల్‌తో మొహం తుడుచుకుంటూ  బయటకు వచ్చిన ప్రణవ్‌ ‘హౌ కం?’ అని అడిగాడు.
‘అ..ప..ర్ణ.. ఆంటీ.. తెచ్చిచ్చింది!’ కొంచెం నసుగుతూ చెప్పింది వసుధ.
‘నాకు హానీసింగ్‌ అంటే ఇష్టమని ఆమెకెవరు చెప్పారు?’ డైనింగ్‌  డబ్బాలో ఉన్న బిస్కట్స్‌ తీసుకుంటూ ప్రణవ్‌.
‘అక్క చెప్పి ఉంటదిలే! ఎవరు చెప్తే ఏంరా.. షోకి పాసెస్‌ దొరికాయ్‌ మీ ఫ్రెండ్స్‌తో వెళ్లు!’ ఫ్రిజ్‌మీదున్న పుస్తకంలోంచి పాస్‌లు తీసిస్తూ అన్నది వసుధ.
వాటివైపు చూడకుండా మౌనంగా బిస్కట్స్‌ తింటున్న కొడుకు దగ్గరకి ఇంకో చైర్‌ జరుపుకొని కూర్చుంటూ ‘అపర్ణ ఆంటీ! ఆమె, ఈమె కాదు! పెద్దవాళ్లకు రెస్పెక్ట్‌ ఇవ్వడం నేర్చుకో!’ చిన్నగా మందలిస్తున్నట్టుగా అంది వసుధ.
అలాగే నేల చూపులు చూశాడు కాని స్పందించలేదు ప్రణవ్‌.
‘డాడీ.. కలిశాడా?’ అడిగింది.
‘అపర్ణాం..’ అని నాలుక్కర్చుకున్నట్టుగా వెంటనే ‘ఆమె నిన్ను కలిసిందా?’ అన్నాడు వసుధ మొహంలోకి చూస్తూ!
‘ప్రశ్నకుపశ్న సమాధానం కాదు!’ కటువుగా వసుధ.
‘కలిశాడు!’ తలవంచుకుని చెప్పాడు.
ప్రణవ్‌ జుట్టును ఆప్యాయంగా చెదురుస్తూ ‘అపర్ణ అంటే నాకెప్పుడూ కోపంలేదు. అపర్ణ విషయం మీడాడీ నాతో చెప్పినప్పుడు కోపమొచ్చింది, పోట్లాడాను, చెంపచెళ్లుమనిపించాను.. నీ మొహం చూపించకుపో అని ఇంట్లోంచి గెంటేశాను. తర్వాత మీ కోసం ఆ కోపాన్నీ అణచుకున్నాను. అర్థంచేసుకోవడం స్టార్ట్‌చేశాను. అప్పుడు మీ డాడీపట్ల జాలేయడం మొదలైంది. జరిగింది మర్చిపోలేనురా… అలాగని రాచిరంపానా పెట్టలేను. అపర్ణను మన ఫ్యామిలీలోకి ఇన్వైట్‌ చేయడానికి రీజనైన మీ డాడీనే జాలిపడి ఎక్స్‌క్యూజ్‌ చేసినప్పుడు ఎవరో తెలియని అపర్ణని సాధించి ఏంచేయగలను? మన లైవ్స్‌ని హెల్‌లోకి తోసుకోవడం తప్ప! నా ఫ్రెండ్స్‌ సౌజన్యాంటీ, జయాంటీ, కరుణాంటీని ఎలాగో అపర్ణ కూడా అలాగే అనుకో! ఇగ్నోర్‌ చేయలేని ఇంపార్టెంట్‌ పర్సన్‌! ఆమెకు డాడీ ఎంతో మనమూ  అంతే! షి ఈజ్‌ నాట్‌ అవర్‌ ఎనిమీ! షి ఈజ్‌ అవర్‌ ఫ్రెండ్‌! గౌరవించడం నేర్చుకో… అలవాటు చేసుకో! మీ డాడీ వల్ల నేను ఇబ్బంది పడ్డం నీకెంత బాధనిపించిందో.. నీ వల్ల ఆమె ఇబ్బంది పడ్డం నాకూ అంతే బాధగా ఉంటుంది! ఐ థింక్‌ యు­ గాట్‌ వాట్‌ ఐ సెడ్‌!’ అంటూ  అక్కడి నుంచి వెళ్లిపోయింది వసుధ!
మీదున్న పాస్‌లను తీసుకొని వాళ్లమ్మ ఫోన్‌లోంచి అపర్ణకు కాల్‌ కలిపాడు.
‘హలో ఆంటీ దిస్‌ ఈజ్‌ ప్రణవ్‌! థాంక్యూ ఫర్‌ పాసెస్‌!’ చెప్పాడు!

రమా సరస్వతి

రమా సరస్వతి

–రమా సరస్వతి

 

మీ మాటలు

 1. buchireddy gangula says:

  సహజత్వం ,ఉత్కంట అనే రొండు చక్రాల మీదే కథ సాగాలి —-రాజారం

  కథను ఏ రూపం లో రాసినా కథ ద్వారా పాటకుల కు ఒక సంస్కారాన్ని , ఒక కొత్థ్హ

  దృష్టిని కలిగించడం ముఖ్యం ————–గోపీచంద్

  కథ అ నేది మొదట్లో కుతూహలాన్ని చివర ఆలోచనల్ని కలిగించాలి — మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుక పోవాలి ———————ఆరుద్ర

  సో సో –నేటి తెలుగు సినిమా కథ ల్లా —–
  —————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 2. vakkalanka vaseera says:

  చాల బావుంది .మనసు విశాలం అవుతుంది

 3. Manjari Lakshmi says:

  శ్రీరామ్ కు అతని జీవితంలో 5, 6 పెళ్లిళ్లు చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అపర్ణా ఆంటీ లాంటి వాళ్ళని 5,6 గురిని చూడాల్సి ఉంటుందనీ, అంత ఉద్రేకం పడకూడదనీ కూడా ప్రవీణ్ కి చెపితే ఈ కధ ఇంకా రక్తి కట్టేది.

 4. వెల్లంపల్లి అవినాష్ says:

  వస్తువు విభిన్నంగా ఉంది.
  కానీ కథ ఉద్దేశం ఏంటో, పాఠకుడిలో ఏ భావం కలిగించడానికి రాశారో మాత్రం అర్థం కాలేదు.
  తప్పు ఎవరిదో, సమస్యకు చివరికి ఏం పరిష్కారం చూపారో ఏంటో అంతా అయోమయంగా ఉంది.

 5. కొన్ని వారాల కిందట రమాసరస్వతిగారు ఒక సినిమా(పేరు ?) మీద రాశారు. అందులో భర్త చనిపోయిన ఒక మహిళ, భార్య చనిపోయిన ఒక పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ మహిళ కూతురుకు అది నచ్చదు. అప్పుడు దాని మీద జరిగిన చర్చలో తల్లిదండ్రులు పిల్లలు పుట్టాక సొంతనిర్ణయాలు తీసుకోలేరని, పిల్లల ఇష్టాయిష్టాలు కూడా గమనించాలనీ కొందరు అన్నారు. వాళ్ళను కూడా ఒప్పించాలని చెప్పడానికి ఈ కథ రాసినట్టుగా ఉంది. ఇలాంటివాటికి తేలికైన పరిష్కారం ఉండదనే అనిపిస్తోంది. అందుకే కథకు తగిన ముగింపు ఇవ్వలేకపోయారు.

  • Manjari Lakshmi says:

   అక్కడి కధలో ఇద్దరూ జంటను కోల్పోయిన వాళ్ళు. ఇందులో భార్య ఉండగానే వేరే ఆమె మీద మనసవ్వటంతో మొదటి భార్యకు విడాకులిచ్చి వేరే ఆమెను చేసుకొన్నాడు కదా. నిజానికి సరైన ఆలోచనా దృక్పధం ఉంటే ప్రవీణ్ కు తండ్రి మీదే కోపం ఉండాలి. ఆమె మీద ఎందుకు. అయినా సినిమా టికెట్లు దొరికితే ఆ మాత్రం కోపం కూడా పోయిందనుకోండి ప్రవీణ్ కు. తాయిలాలిచ్చి మంచి చేసుకోవటం ఎంత గొప్ప విషయమో ఈ కధలో బాగా చూపించారు.

   • వెల్లంపల్లి అవినాష్ says:

    ఈ సమస్యకు అబ్సల్యూట్ పరిష్కారం అసలు ఎవరూ చూపెట్టలేరేమో!

    భార్యాపిల్లలు ఉండీ, వాళ్ళతో సంసారం సజావుగా సాగుతున్న సమయంలోనే, మరో అమ్మాయి మీద మనసుపడిపోయి, తన దారి మాత్రం తను చూసుకుని వెళ్లిపోయాడు శ్రీరామ్. (పేరు మాత్రం సూపర్ పెట్టారండి!!)

    తన నిర్ణయం పర్యవసనాల పట్ల పెద్దగా బాధ్యత ప్రదర్శించని శ్రీరామ్ మీద మనం జాలిపడిపోయి, అర్థం చేసుకుని, సర్దుకుపోవాలని ఈ కథ చెప్తున్నట్టు అనిపించింది.

    ప్రణవ్ కి తండ్రి పట్ల ఏమాత్రం కోపం రాదు. తండ్రి ఇంకో ముప్పై పెళ్లిళ్లు చేసుకున్నా వీడికి తండ్రి మీద కోపం అస్సలు రాదేమో!!

 6. Palaparthi Jyothishmathi says:

  మంజరి లక్ష్మిగారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ భవిష్యత్ రచనల విషయంలో రచయిత్రికి ఒక సూచన – ఇంగ్లీషు తగ్గించి తెలుగులో తెలుగు కథలా రాయండి.

 7. ఈ కథని తిరగేసి రాస్తే??? ఒప్పుకుంటారా పురుషస్వాములు???
  అప్పుడు కథలో వసుధ పాత్రలో ఉండే భర్త అలాగే తన కొడుక్కు చెప్పి ఒప్పించగలడా???

 8. ప్రపంచంలో ఇలాంటి వారెందరో ముఖ్యంగా విదేశాల్లో. ఈ కథలో శ్రీరాం కి కనీసం నిజాయితీ , పిల్లల పట్ల బాధ్యత ఉన్నాయి. నయం కదూ!?

మీ మాటలు

*