రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు…

రాఘవ రెడ్డి

రాఘవ రెడ్డి

 

అప్పుడెప్పుడో నాకింకా నటించడం రానప్పుడు


వరిపొలం మీద పరుచుకున్న ఒకానొక ఉదయం 
మెత్తగా గుండెల్లోకి దిగినప్పుడు


అచ్చం ఇలాగే అనిపించినట్లు గుర్తు.

 


ఇక్కడ ఇప్పుడిలా కూర్చుని
పెట్టెలు పెట్టెలు గా పరుగెడుతోన్న ప్రపంచాన్ని చూస్తూ


కాలాన్ని చప్పరిస్తోన్న వేళ

 


గుండెకు గొంతునిచ్చి నువ్ పలకరించినప్పుడు
అనిపించింది చూడు.. ఇలానే-


..
అచ్చం ఇలానే అనిపించినట్లు గుర్తు-

Old_TrainStation_00_1280
. . .
రసవంతమైన బత్తాయినొకదాన్ని 
చేతుల్లోకి తీసుకుని
ఒక సిట్రస్ పరిమళాన్ని సేవిస్తూ


శ్రద్ధగా తొక్కదీసి తొనలు ఒలిచి
ముత్యాలను మురిపెంగా ముట్టుకున్నట్టు..


పదేపదే నీ మాటలు ప్రేమగా తల్చుకుంటాను..


ఇక సెలవంటూ పెట్టేస్తావా.. 

నాతోనే ఉంటావదేంటో!

– రాఘవ రెడ్డి

మీ మాటలు

  1. Thirupalu says:

    -వరిపొలం మీద పరుచుకున్న ఒకానొక ఉదయం
    మెత్తగా గుండెల్లోకి దిగినప్పుడు
    పిల్లా తెమ్మరలు నను ఎత్తుక జోల పాడినట్లు ఉంది!

  2. రవి says:

    పోయెమ్ బాగుందండీ.

    అభినందనలు!

  3. రాఘవరెడ్డిగారి అన్ని కవితలలాగానే ఇది సిట్రస్ జ్యూసీగా ఉంది.

  4. erathisathyanarayana says:

    కవిత బత్తాయిలా ఉంది .

  5. i s t sai says:

    ఇటువంటి కవితలు ఇంకా రాయండి please

మీ మాటలు

*