‘హలో యూసుఫన్నా! నేను రాజుని… మీ మామయ్య బిడ్డ రేష్మా లేదన్నా.. ఆమె మా మాదిగ ఇద్దయ్య కొడుకు సురేష్‌తోటి సిటీ కొచ్చేసిందన్నా.. యూనివర్సిటీల ఉంది. మీ మామలకు తెలిస్తే ఇద్దర్ని సంపేస్తరే.. జర నువ్వు సమ్జాయించి చెప్పు.. వచ్చి ఆ పిల్లను తీస్కెల్లిపొమ్మను అన్నా!’ అన్నడు రాజు మా ఊరి నుంచి.
సెల్‌ఫోన్ ఆగకుంట మల్ల మల్ల మోగుతుండేతలికి రోడ్డు పక్కన బండి ఆపి ఫోనెత్తి ఉంటి. అతని మాటలు విని కాసేపు ఏం మాట్లాడలేక పొయ్‌న. కొద్దిసేపట్ల సంభాలించుకొని, ‘అది కాదు రాజు, ఎప్పుడు జరిగిందిది? ఇప్పుడెక్కడ ఉన్నరు? మన ఊర్లో వాళ్లకు తెలిసిందా?’ అన్నా పరేశాన్గ.
‘రాత్రి ఒచ్చిన్రటన్నా. లేడీస్ హాస్టల్లో పిల్ల నుంచిన్రంట. పిలగాడు బాయ్స్ హాస్టల్ల ఉండు. ఊర్లె ఇంక తెలియదన్నా..’
‘పిలగాడు ఏం చేస్తడు?’
‘సదువుకుంటుండన్నా! వాళ్ల నాయన లేడు. వాళ్లమ్మ, వాడే ఉంటరు. షానా బీదోల్లన్నా. నేనే ఆనికి సదువుకు పైసలిస్తున్న. ఆడి సదువు ఖరాబైతదన్నా. మీ మామలు గుడ ఊకోరు. కొట్లాటలైతయ్.. వచ్చి పిల్లను తీస్కపొమ్మనన్నా..’
నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. ఏం చెప్పాల్నో ఏం చెయ్యాల్నొ సమజ్ కాలె. సుతరాయించుకొని ‘రాజు! నేను రోడ్డు మీదున్న, జరసేపాగి ఫోన్ చేస్త’ అన్న. ‘సరె అన్న, మీ మామలకు ఎవరికన్నా చెప్పన్నా, మల్ల ఫోన్ చెయ్యి’ అని కట్ చేసిండు రాజు.
ఫోన్ జేబుల పెట్టుకొని బండి స్టార్ట్ చేసి ఇంటి దిక్కు పోనిస్తున్న. షానా గజిబిజిగ అనిపిస్తున్నది. మనసంత ఏదొ అయిపొయినట్లున్నది. ఇంటికి పొయి కుర్సీల కూలబడ్డ. ఏమైంది అన్నది మా ఆమె.
‘మా నడిపి మామ బిడ్డ రేష్మ, ఎవరో మాదిగ పిలగానితోటి సిటీ కొచ్చేసిందంట!’ అన్న.
‘అవునా.. ఎవరు చెప్పిన్రు?’ అన్నది పరేశాన్గ మా ఆమె.
విషయమంత చెప్పిన. కొద్దిసేపు ఆమెతో చర్చించిన. రాజుకు ఫోన్ చేసిన.
‘…పిల్ల, పిలగాడు ఒకర్నొకరు బలంగ ఇష్టపడుతున్నరా.. ఏమంటున్నరు రాజు?’
‘నేను వాళ్లతోని మాట్లాడలేదన్న. వాళ్ల వయసుకు ఇప్పుడేడ సమజైతదన్నా? పిలగాడు చెప్తె ఇంటడన్న. మీ మామలకు చెప్తె ఆల్లే వచ్చి పిల్లను ఎట్లన్న ఒప్పిచ్చుకొని తీస్కపోతరు’ అన్నడు రాజు.
‘…మా మామోల్లకు నువ్వే ఫోన్ చెయ్ రాజు. నాకు చెప్పిందే వాళ్లకు చెప్పు. వొచ్చి పిల్లను తీస్కపొమ్మని నేనెట్ల చెప్త? లవ్ మ్యారేజ్‌లను నేను సపోర్ట్ చేస్త గదా.. నాది గుడ లవ్ మ్యారేజేనాయె!’ అన్న.
‘అట్ల కాదే.. మీ మామలు వాన్ని బతకనియ్యరన్నా.. వాళ్ల బిడ్డ మాదిగోల్ల పిలగానితోని లేషిపొయిందన్న పేరొస్తె ఊకుంటరా అన్నా?! పిలగాని వాల్లమ్మ బయపడి రాత్రే ఎటో ఎల్లిపొయిందంట! నువ్వే ఎవర్తోనన్న మీ మామోల్లకు చెప్పిస్తె ఆల్లే వొచ్చి ఎట్లన్న జేసి తోల్కపోతరు..’
‘నువ్వు చెప్తె ఏమైతది రాజు!’ అన్న ఓపిగ్గ.
‘నేను చెప్పలేనన్నా.. అసలు ఈ విషయం నాకు తెల్సని, నేను చెప్పిన్నని గుడ ఆల్లకు చెప్పొద్దన్నా.. మల్ల నాకు పరేశానైతది..’ అన్నడు రాజు.
‘..సరె, నేను ట్రై చేస్త.. నువ్వు పిల్ల, పిలగాని సంగతి తెల్సుకో.. మల్ల ఫోన్ చేస్త’ అని ఫోన్ పెట్టేసిన.
‘ఏందంట?’ మా ఆమె.
సంగతి చెప్పిన. కాలుగాలిన పిల్లిలెక్క అటు ఇటు తిరుగుతున్న. ఏం తోస్తలేదు నాకు. కొద్దిసేపు నా వాలకం జూసి.. ‘ఇట్ల కుర్సీల కూసొ నువ్వు.. నిమ్మలంగ ఏం జెయ్యాల్నొ ఆలోచించు..’ అన్నది మా ఆమె.
కూసున్న. ఒక్కసారిగ ఎన్నో ఆలోచనలు నా మీద దాడిచెయ్యబట్టినయ్..
ఈ విషయం తెలిస్తె మా మామ తట్టుకోగలుగుతడా? బి.పి, షుగర్ ఉండె.. పెద్ద పిల్ల మెంటల్లీ రిటార్టెడ్. ఇంకో చిన్న పిల్ల ఉండె. ఇగ మిగతా ఇద్దరు మామల పరిస్థితి ఎట్లుంటదో.. ఎట్ల చెప్తం ఆల్లకు. అసలు ఆల్లకు చెప్పకుంటనె, ఈ పిల్లతోటి ఒక్కసారి మాట్లాడి సూస్తె బాగుండు. ఏం చెయ్యాలె…
మల్ల రాజుకు ఫోన్ చేసిన, ‘రాజు! యూనివర్సిటీల ఎవరు ఈల్లకు తోడున్నరు? ఆల్లతోటి ఒకసారి నేను మాట్లాడాలె’ అన్న.
‘లెనిన్, భరత్‌లు ఈల్లతోటి మాట్లాడుతున్నరన్న. వాళ్లతోటి నువ్వొకసారి మాట్లాడు..’ అన్నడు.
ముందుగాల భరత్‌కు ఫోన్ చేసిన.
‘హలో అన్నా! ఏం సంగతే?’ అన్నడు భరత్.
‘భరత్! మీ మాదిగోల్ల పిలగానితోటి వొచ్చిన పిల్ల కాస మా మామ బిడ్డనే’ అన్న.
‘అవునా అన్నా..! సొంతం మావ నా?!’ అన్నడు.
‘అవునా…!’ అని పరేశానై, తర్వాత ‘మామ వాళ్లకు చెప్దామా మరి?’ అన్నడాడు సందిగ్ధంగా.
‘సరె’
రాజు నారాజై ఫోన్ కట్ చేసిండు. నాగ్గూడ టెన్షన్‌గ అనిపించింది. రేష్మ తొందరపడుతున్నదేమొ.. ఐటెంక ఇబ్బందులు పడతదేమో.. అది ప్రేమ కాకుండా ఆకర్షణే అయితే మాత్రం కష్టమే.. ఏం చెయ్యాల్నో తోచక అటు ఇటు తిరుగుతున్న.
‘లేదు మామా! నేను వెళ్లలేను. నేను వెళ్లి మీరొచ్చేదాంక పెండ్లి ఆపమన్నా నేను మీ వైపు నుంచి వచ్చినట్లు యూనివర్సిటీ అంతా నన్ను బద్నాం చేస్తరు. నేను అందరికీ తెలుసు కదా..’
‘సరె, అట్లనన్న చెయ్. మేం బయలుదేరుతం’ అన్నడు.
‘సరె మామా!’
మామ గొంతు పలికిన రకరకాల ధ్వనులకు నా మనసు గిలగిలలాడింది. అయ్నా ఏం చేయగలను..!
నేను పరేశానై, ‘అంటె.. మీరు చేసిన్రా?’ అన్న.
ఐటెంక- ఆఫీసుల ఉన్ననన్న మాటేగనీ ఇదే మనాది.. ఏం జరుగుతదో ఏమోనని.
‘సరె, జాగ్రత్తగ పోరి’
పెద్ద మామ ఏమన్నడంట అని అడిగి తెలుసుకున్న- ఇజ్జత్ తీసిందని, నేనైతె నరికేద్దును అని అరిషిండంట.. నడిపి మామ మా అత్తను బాగ కొట్టిండంట..
ఇటు మా అమ్మ వాళ్లూ, అటు మా అమ్మమ్మ అంతా పరేశాన్ ఉన్రు.. అందరు నాకు ఫోన్ చేసి నన్నేదైన చెయ్యమంటున్నరు..
‘నువు చెబితె రేష్మ ఇంటదని నీకు నమ్మకముందా మామా?’ అనడిగిన.
కొద్దిసేపు సైలెంట్‌గ ఉండిపొయ్‌న మా మామ, ‘సరె, సూద్దాం యూసుఫ్! ముందు నేనొకసారి రేష్మాతోటి మాట్లాడాలె. రేష్మా నాతోని గుడ ఆ పిలగాన్నే చేసుకుంట అంటె ఇగ నువ్వన్నట్లె చేద్దాం’ అన్నడు.
‘అయితె ఒక చిన్న పని చెయ్యాల్సొస్తది. మా ఇండ్లల్ల ఒట్టిగ మజీదుల నిఖా చదివించడానికైనా ముస్లిం పేరు పెట్టుకోవాలె. అట్లనె నిఖాకు ముందే సున్తీ చేయించుకోవాల్సి ఉంటది’ అన్నడు మా చిన మామ.
కొద్దిసేపటికి మల్ల వాళ్లు మమ్మల్ని లోపలికి పిలిషిన్రు. పిలగాడు రెండ్రోజులు టైమ్ కావాలన్నడు, తమ వాళ్లను అర్సుకొని చెప్తనన్నడు. సరె, అట్లనె కానివ్వమని అన్నరు వీళ్లు. బైటికొచ్చినంక నాకొక మీటింగ్ ఉండడంతోని నేను వొచ్చేసిన.
నాకు చికాకేసింది. అతనికి వీళ్ల ప్రేమ వివాహం ఇష్టం లేదని ముందునుంచే అతనిపై ఉన్న డౌటు నిజమైంది. కాని ఇంతగనం వ్యతిరేకత ఉందని మాత్రం నేను అనుకోలే. అణగారిన కులం నుంచి వొచ్చి లెక్చరర్‌గ పనిచేస్తున్నవాడే ఇట్లంటె ఇగ మామూలు ‘హిందువుల’ సంగతేంది? అనుకున్న.
‘అట్లనె మేం గుడ అడిగినమన్నా.. ఇట్ల ఎటూ తేల్చుకోలేకపోతె కష్టమని, ఏదో ఒకటి చెప్పమని గట్టిగనె అడిగినం.. దాంతోటి వాడిక మమ్మల్ని గుడ కలుస్తలేడే! ఏమైందని తెల్సుకుంటె అసలు వాళ్లిద్దరు ఇక్కడ్నుంచి ఇంకెక్కడికో ఎల్లిపొయిన్రని తెలిసిందే.. యాడికి పొయిన్రో తెలుస్తలేదే..!’ అన్నడు భరత్.
–స్కైబాబ
నాకు తెలిసి ఇది వాస్తవం . కధ చెప్పటం మొదలు పెడితే ముగింపు ఉంటుంది … వాస్తవం కధగా మారినప్పుడు పాటకుడిని ఆలోచింప చేస్తుంది …. ముగింపు చదివిన మనసు ఆలోచన బట్టి ఉండేలా చేయటం రచయిత ప్రత్యేకత … స్కై బాబా గారు బాగుంది … అభినందనలు
కద ప్రదమ పురుష లో ఉండటం వలన/ ప్రధాన పాత్ర ముస్లిం కావడం వలన కావచ్చు ఇదంతా నిజంగా స్కై బాబా గారి అనుభవం చెప్తున్నట్లు గా ఉంది. ఈ కధ లో మూడు ప్రత్యేకతలు నేను గమనించాను. 1) కులభేధాలకు తావు లేని మతస్తుల మనసులు కూడా భారత దేశ అర్ధ భూస్వామ్య సామాజిక వ్యవస్థ ప్రభావం తో ఎలా కలుషితం అవుతున్నారో చూపించారు. 2)భారత రాజకీయ వ్యవస్థ రిజర్వేషన్లు అమలు చేస్తున్న తీరు ప్రజలమద్య అంతరాలు తొలగడానికి ఎలా అడ్డుగా వుందో చూపించారు.(బాబాసాహెబ్ అంబేత్కర్ కుల నిర్మూలన కి కులాంతర వివాహాలు ఒకానొక పరిష్కారం గా చూపించారు.) 3)కులాంతర వివాహాల కంటే మతాంతర వివాహాలు ఎలా ప్రత్యేకమో వివరించారు. అంతిమంగా చాలా కొత్త అంశాన్ని పరిచయం చేశారు. కధ చాలా బాగుంది. ధన్యవాదాలు.
బాగుంది
కలిసిన రెండు మనసులు కలిసి కాపురం చేయటానికి ఎన్ని అడ్డంకులు,ఎన్ని కట్టుబాట్లు కత చాలా బాగా రాశారు స్కై బాబా గారు
ఫేస్ బుక్ లో కామెంట్స్
– – – – — – – — — – –
జీ. శ్రీ, Shaik Azharuddin, Nandini రెడ్డి, Sandeepreddy Kothapally, Kurella Swamy and Mamidi Amarendar and 27 others like this. (33 మంది like చేశారు)
Prasannanjaneyaraju సరికొండ: ఈ కధ లో మూడు ప్రత్యేకతలు నేను గమనించాను. 1) కులభేధాలకు తావు లేని మతస్తుల మనసులు కూడా భారత దేశ అర్ధ భూస్వామ్య సామాజిక వ్యవస్థ ప్రభావం తో ఎలా కలుషితం అవుతున్నారో చూపించారు. 2)భారత రాజకీయ వ్యవస్థ రిజర్వేషన్లు అమలు చేస్తున్న తీరు ప్రజలమద్య అంతరాలు తొలగడానికి ఎలా అడ్డుగా వుందో చూపించారు.(బాబాసాహెబ్ అంబేత్కర్ కుల నిర్మూలన కి కులాంతర వివాహాలు ఒకానొక పరిష్కారం గా చూపించారు.) 3)కులాంతర వివాహాల కంటే మతాంతర వివాహాలు ఎలా ప్రత్యేకమో వివరించారు. అంతిమంగా చాలా కొత్త అంశాన్ని పరిచయం చేశారు. కధ చాలా బాగుంది. ధన్యవాదాలు.
December 27, 2013 at 2:05pm · Unlike · 6
Showreelu పూదోట: కలిసిన రెండు మనసులు కలిసి కాపురం చేయటానికి ఎన్ని అడ్డంకులు,ఎన్ని కట్టుబాట్లు కత చాలా బాగా రాశారు స్కై బాబా గారు
Uma ఉమా: బాగా రాసారు.. కానీ కథ ముగింపు నచలేదు.. నా ఒపీనియన్.. నేను తెలంగాణ అమ్మాయినే, బట్ did not feel comfortable reading the first few paragraphs..
Krishna రమేష్: సర్, కథ బాగుంది
Yadav స్వామి: బయ్య. కథ చాల బాగుంది.
Gouse పాషా: Exlant. ……
Vemula ఎల్లయ్య: నిజాయితి లేనిది ఏది నిలవదు. అంటును ఎరుక పర్శినందుకు షుక్రియా… రాత్రి గంటసేపు ఇఫ్లు యునివర్సిటి లో చర్చించుకున్నాం..
Madhavi అన్నాప్రగడ: బాగుంది మీ కథ “అంటు” ..ప్రేమ పెళ్ళిళ్ళు కూడా రిజర్వేషన్ కోరల్లో చిక్కుకున్నట్టు చెప్పే అంశం బాగుంది ..ముగింపులో ఏమన్నా చెప్పిఉంటే ఇంకా బాగుండేది…..
Shaik Imran పర్వేజ్: కథ బాగుంది అన్న…
Srujan ఆర్టిస్ట్: గొప్ప కథ. అభినందనలు సర్
Mamidi Amarendar : భయ్యా.. ఇది కథనా నిజంగా జరిగిందా..
ఇది సదువుకుంట సదువుకుంటనే ఆలోచన్ల పడ్డా..
పిల్ల పర్షాని పిల్లకే ఉంది, పేరెంట్స్ పర్షాని పేరెంట్స్ కే ఉంది.. పిలగానిది పిలగానికే ఉంది.. వీలందరిది ఇటుంచి బయట రాజు అసొంటల్లది ఆల్లకే ఉంది..
Sandeepreddy Kothapally : కథ చదివాను..కాకపోతే కథలోని పాత్రలకు మాదిరే మీరు కూడా హిందూ ..ముస్లిం అనుబంధాల పట్ల కన్ఫూజన్ లో ఉన్నారు అని నాకు కథ ముగింపు చూసి అనిపించింది. తెలంగాణ లోని కొద్ది పట్టణాలు మినహా గ్రామీణ ప్రాంతాలలో అన్ని వర్గాలతో ముస్లింలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంఘటన కథనా ? వాస్తవమా ?
Tipparthi Yadaiah : ఈ జరిగిందె కత మొత్తానికి వాస్తవాన్ని కత గ మార్చావ్ హట్సా స్కై
సుబద్ర జూపాక: (మెయిల్ లో)
పెళ్లి ఇరు సామాజిక సమూహాల్ని గౌరవించేటట్టు ఉండాలే. ఎవరు
తమ సొంత అస్తిత్వాలని ధ్వంసం చేసుకోవద్దు. సుంతీ అనేది ముస్లిమ్స్
ని abuse చేయనీకి కూడా use చేసింది హిందూ సమాజం. సుంతీ ని
సామాజికం చేస్తే ఈ ప్రాబ్లం వుండేది కాదు. ఇక్కడ రేష్మని, మాదిగోల్ల పిలగాన్ని నిన్దించొద్దు. వాల్లనట్ల సమాజంలోకి పోనిద్దాం…
సాహిత్యాన్ని అడ్డం పెట్టుకుని అవార్డులు, పోటిలలో బహుమతులు అడిగే వెధవ.
ెల్లో.స్కి.నేను రాజు ను మాట్లాడుతున్న.వాస్తవాలని వక్రీకరించి వ్రాస్తే గొప్పకతకుడి వైతవ .నీలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టిన మాదిగ జాతిని అంతమొందించ లేరు.ముస్లిం గ మారక పోతే మా వాళ్ళు చంపేస్తారని నీవు అంటివి గద.అది రాయలేదు ఎందుకు.ఇప్పటి కైనా గుర్తు పెట్టుకో మాదిగవాడు మాదిగోనిగానే చస్తాడు గాని ముస్లిం గ మారదు.బుద్ధి మార్చుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు.ఖబడ్దార్ .
కథ మధ్యలో ఆపేశావు .మిగతా నాటకం గుర్తుకు రావటం లేదా .నీ ముసుగు నేను తొలగించి ముగింపు ఇస్తాను చదువుకో .
పాత్ర తిరగబడడం అంటే ఇదే!