కవి రామా చంద్రమౌళికి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్ -2013’ పురస్కారం

ramachandramouliవరంగల్: వచన కవిత్వ పితామహుడు  కుందుర్తి ఆంజనేయులు   స్థాపించిన ప్రతిష్టాత్మక పురస్కారం ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్   అవార్డ్  -2013 ‘ ఈ సంవత్స్తరం వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళి ని వరించింది  . ఆయన ఇటీవల విడుదల చేసిన  ‘ అంతర’ కవిత్వ సంపుటికి ఈ గౌరవం దక్కింది  . పురస్కార కమిటీ కన్వీనర్ శీలా వీర్రాజు ఈ పురస్కార విషయాన్ని ప్రకటిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ లో  జరిగే ప్రత్యేక సభలో పదివేల రూపాయల నగదు,ప్రశంసా పత్రం,జ్ఞాపిక మరియు శాలువాతో ఘనంగా రామా చంద్రమౌళి ని సత్కరిస్తామని చెప్పారు. ఇంతవరకు 20 నవలలు,250 కి పైగా కథలు,9 సంపుటాల కవిత్వం వెలువరించి వరంగల్లు ప్రతిష్టను ఖండాంతర పరచిన మౌళి గారికి ఈ పురస్కారం రావడం ఈ కాకతీయుల గడ్డకు ఒక అదనపు అలంకారంగా సాహిత్యాభిమానులు భావిస్తూ రామా చంద్రమౌళి ని అనేక సాహితీ ప్రియులు అభినందించారు .

మీ మాటలు

 1. bathula vaami apparao says:

  hearty congrats

 2. హృదయపూర్వక అభినందనలు రామాచంద్రమౌళి గారూ

 3. తనదైన స్వంత గొంతుతో , విలక్షణమైన కవిత్వాన్ని పాఠకులకందించే మా అభిమాన కవి శ్రీ రామా చంద్రమౌళి గారికి ‘
  ఫ్రీ వర్స్ ఫ్రంట్ -2013 ‘పురస్కారం రావడం ఎంతో ఆనందకరం. మౌళి గారికి అభినందనలు.
  అరుణ.కె,హైదరాబాద్

 4. మంచి కవికి మంచి పురస్కారం. .రామా చంద్రమౌళి గారికి శుభాభినందనలు.
  రమణి.ఎల్.విజయవాడ

 5. Gundeboina Srinivas says:

  అభినందలు సార్,

  గుండెబొయిన శ్రీనివాస్ ,
  హన్మకొండ,
  21/12/2013.

 6. Gundeboina Srinivas says:

  అభినందనలు సార్

 7. KOLIPAKA SHOBHA RANI says:

  RAAMA CHANDRAMOULI GAARIKI SHUBHABHINANDHANALU.

 8. హృదయ పూర్వక అభినందనలు ….. రామా చంద్ర మౌళీ గారూ

మీ మాటలు

*