ఉహూ ….కారణాలేమయినా ?

జిందగీ మౌత్ నా బన్ జాయే సంభాలో యారో :

శరత్కాలం ఆకుల్లా కలలన్ని రాలిపడుతున్నపుడు
జ్ఞాపకాల వంతెన పగుళ్ళు పాదాలని
సుతిమెత్తగానే అయినా కోస్తూ ఉంటే
గుండె మంటలను చల్లార్చే మేజిక్ నైపుణ్యాలు
నిశ్శబ్దం గా నిద్ర పోతూనప్పుడు
తడి ఆరని కళ్ళు రాత్రి పాటల నైటింగేల్ లా
రెప్పలు అలారుస్తూ

ప్రపంచాన్ని ప్రేమించాల్సిన  చిన్న హృదయం
ఒకే వ్యక్తి ప్రేమ కోసం మరింత చిన్నబోతుంటే
నైతికతల జలదరింపు లో శూన్యమైన
ఆకుల గుస గుస లలో ఒక ఉత్కంఠభరితమైన నిట్టూర్పుతో
శరదృతువు ఇంకోసారి ఎర్రబడినప్పుడు
ఒంటరి రాత్రుల నిదురలనెందుకు లేపటం ?

ఎన్నిసార్లో

చీకటి కి మెలుకువకి మద్య మగతల్లో
జీవితాన్ని ఇంకో సారి దగ్గర కి తీసుకొవాలని
గుండెల్లో దాచుకొని హత్తుకోవాలని
మునివేళ్ళతో  తన బుగ్గలను మృదువుగా సృశించాలని ,
తన చెంపల మీద కన్నీటి మచ్చలను నెమ్మదిగా తుడవాలని
తన కి మాత్రమే వినపడేటట్లు సుతిమెత్తగా
మృదు స్వరం లో లాలి పాడి నిద్రపుచ్చాలి

అని ఎన్ని సార్లు మనసు కొట్టుకుంటుంది
బహిష్కరించలేని బాధలు భూమ్మీద
ప్రతి ప్రాణికి విజయపు ఓటములంత నిజం
అని చెప్పాలని ఎన్నిసార్లు అనుకుంటాను

అలాగే

ఉదయపు ఎండలు శరీరం తో ఆటలడుతున్న వేళ
ఊహల ఉచ్చుల ఇమేజ్ అద్దం లో ఉండదని
ఫెయిరీ టేల్ కవిత్వం కనులముందు కనిపించదని
నిజం అబద్ధం కి మధ్య గీతలు చిన్నవని
మనసుకు గోలుసులేసి అవి తమతో
లాగుతూ ఉంటాయని
గుండె చప్పుడు స్థిరంగానే ఉంటుంది
కాని (వి)శ్వాసలే విరిగి ముక్కలవుతాయని
మనసుకు మనసుకు మద్య  ద్వేషాల చైనా వాల్
స్థిరంగా , బలంగా ఉండిపోతుందని
స్మైల్స్ మద్యలో మైళ్ళ దూరం దాగుందని
చెప్పాలి అని గుండె విప్పాలి అని  అనుకుంటాను

Van_Gogh-09

ఉహూ ….కారణాలేమయిన ?

విరిగిన అద్దం ముక్కల ను అతికించి
పైన  ఎంత gloss పెయింటింగ్ చేసినా
నవ్వుతున్న పగిలిన పెదవుల లా
గాయాల వికృతత్వం కనిపించకుండానే
కనిపిస్తూ ఉన్నంతవరకు
వర్షించని నల్ల మబ్బుల్లో నీళ్ళు ఉంటాయని
కనిపించని ఆకాశం ఉక్రోషంలో గర్జిస్త్తే
వర్షం పడుతుంది అని
ముసుగుల వెనక దాగిన
గుండెల్లో ఎక్కడో వినిపించని
మానవత్వం చిరుమువ్వలు సవ్వడి చేస్తూంటాయని
నమ్మని  , నమ్మించలేని వెక్కి వెక్కి ఏడ్చే వెర్రి గుండె
మౌలా మేరి లేలే మేరి జాన్ పాడే  పాటల్లో
కష్టం వెనక మిగిలిన నిజం ఒక్కటే

అబ్సొల్యూట్ ట్రూత్స్ అంటూ  లేని జీవితం లో
వందలు గా వేలుగా కూడి చేరి
గూడు కట్టిన నిస్పృహల ప్రయాణం
దేవుడి మేనిఫెస్టో నుండి
రొమాంటిక్ మేనిఫెస్టో దార్లను వెతుకుతూ
కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కి చేరి ఓడిపోయినపుడు
కన్నీళ్ళకు తప్ప యూనివర్సల్ ఈక్వాలిటీ  ఎవరికీ సాధ్యం ?

జిందగీ తో జి తే జి మౌత్ బన్ గయా
అబ్ క్యా సంభాల్నా మేరె దోస్త్ ?

నిశీధి 

చిత్రరచన: వాంగో

మీ మాటలు

 1. Beautiful poem.

 2. బాగుంది,. ఒక అబ్సల్యూట్ ట్రూత్,.. బ్రెయిన్ ,..?

 3. నిశీధి says:

  నేనేనా రాసింది అనిపిస్తుంది .. ఈ అక్షరాల్లో నా ఆలోచనలు ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి . Thanks to the Sarangaa team who made a difference in my small ,tiny poetic journey .It’s an awesome overwhelming experience. A special mention to “Afsar” sir who converted this dream into reality . Thank you sir .

 4. నిశీధి says:

  మానస గారు , భాస్కర్ గారు థాంక్స్ అండి. ఎస్ బ్రెయిన్ హియర్ :D గుర్తుపట్టేసారే

 5. ఉహు… కారణాలేమైనా… అంటూ చాలా అర్ధవంతంగా రాసారు…

 6. మీ కవిత్వంతో ఉన్న కాస్త పరిచయం నేపధ్యంగా చదివాను. మీ ఈ కవిత రెండు రకాలుగా చదవొచ్చు. ఓ స్టాంజాకా స్టాంజా ఓకవితగానూ మొత్తం కవితంతా ఓ కావ్యంగానూ చదవొచ్చు. “జీవతాన్ని ఇంకోసారి దగ్గరకు తీసుకోవటం” లాంటివి కవితకి ఓ అందాన్నిచ్చాయి.

 7. నిశీధి says:

  నిర్మలా గారు థాంక్స్ అండి

 8. నిశీధి says:

  వాసుదేవ్ సర్ … కవితలు అంటే ఏమిటి .. అసలు ఏమి రాస్తే ఎలా రాస్తే కవిత అంటారో నాకసలే తెలియదు అని మీకు ఈ కొద్ది పరిచయం లోనే తెలిసిపోయిన్దిగా . మీ కామెంట్ చూసాకా మళ్ళి చదివి చూసా … మీ మాటల్లో భావం వెతుకుతూ చదివితే నచ్చింది . థాంక్స్ అండి

 9. నిశీధి says:

  వాంగో సర్ మనసు దోచారు కవిత ఏమో కాని ఇమేజ్ కూల్ గా ఉంది థాంక్స్ అలోట్

  • నిశీధి says:

   seriously lol me … When I saw the image named Wango (వాంగో)I thought a new age artist with the same name … lol lol lol … so dumb of me , Now I am more exited suddenly .

 10. మీరు ఫేస్ బుక్ వాల్ పై వుంచిన లింక్ పై మీ స్పందనలోని ఆనందం నిజమే మాకు కూడా యిలా మీ కవిత అక్కడే కాకుండా వెబ్ మేగజైన్ లో చదివే భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు. జీవితం ఓ ఉత్సవంలా గడిచిపోవాలని ఆశ వుంటుంది కానీ అది ఎక్కడికక్కడ ఎగసిన అల విరిగిపడినట్టుగా మారుతూ పయనం సాగించడమే విషాదమో ఆనందమో తెలియకుండా ముగిసిపోవడం సత్యం. కవిత్వాన్ని విశ్లేషించేంత జ్ఞానం లేదు నాకు. యిలా తోచింది చదవగానే. మరో మారు అభినందనలతో.

 11. balasudhakarmouli says:

  గొప్ప కవితను అందించారు… బ్రెయిన్ డెడ్ గారు.

 12. బహిష్కరించలేని బాధలు భూమ్మీద
  ప్రతి ప్రాణికి విజయపు ఓటములంత నిజం
  అని చెప్పాలని ఎన్నిసార్లు అనుకుంటాను…వహ్….చాలా బావుంది మిత్రమా అభినందనలు

 13. నిశీధి says:

  సర్ జి జీవితం ఎక్కడికక్కడ ఎగసిన అల విరిగిపడినట్టుగా మారుతూ పయనం సాగించడమే విషాదమో ఆనందమో తెలియకుండా ముగిసిపోవడం సత్యం అని ఎంత బాగా చెప్పారు . మొత్తం పోయెమ్ సారం అంతా ఒకే లైన్ లో ఇమిడి పోయింది థాంక్స్ @ వర్మ గారు

 14. నిశీధి says:

  మౌళి గారు , Knvmverma sir :D కృతజ్ఞతలు

 15. వాహెద్ says:

  శరత్కాలం ఆకుల్లా కలలన్నీ రాలిపోతున్నప్పుడు అన్న వాక్యం కమ్యునిస్టు మానిఫెస్టోకు చేరి ఓడిపోయినప్పుడు అన్న వాక్యంతో కలిపి చదవాలన్న టెంప్టేషన్ ఆపుకుంటూ…. కన్నీళ్ళకు తప్ప యూనివర్శల్ ఈక్వలిటీ ఎవరికి సాధ్యం అన్న వాక్యానికి … కారిన రక్తానికి… అన్న పదాలను కూడా కలుపుతూ…. మంచి కవిత రాసినందుకు అభినందిస్తున్నాను.

  • నిశీధి says:

   మీ మాటల్లో కవితని వెతికితే కొత్త అర్ధాలు వినిపిస్తున్నాయి థాంక్స్ సర్

 16. వర్షించని నల్ల మబ్బుల్లో నీళ్ళు ఉంటాయని
  కనిపించని ఆకాశం ఉక్రోషంలో గర్జిస్త్తే
  వర్షం పడుతుంది అని
  ముసుగుల వెనక దాగిన
  గుండెల్లో ఎక్కడో వినిపించని
  మానవత్వం చిరుమువ్వలు సవ్వడి చేస్తూంటాయని
  నమ్మని , నమ్మించలేని వెక్కి వెక్కి ఏడ్చే వెర్రి గుండె………….చాలా బాగుంది

 17. There is a catching fire through out your poem. Truly beautiful!

 18. చక్కని కవిత .అభినందనలు.

 19. నిశీధి says:

  లక్ష్మణ స్వామి గారు , మోహన తులసి గారు , నాగరాజు రామస్వామి గారు … నా మాటలు నచ్చ్గి మెచ్చినందుకు కృతజ్ఞతలు

 20. విలాసాగరం రవీందర్ says:

  Good poem Neshee mam

 21. sadlapalle chidambarareddy says:

  అద్భుతంగా చెప్పారు

మీ మాటలు

*