పాత ఇల్లు …

రాజశేఖర్ గుదిబండి

రాజశేఖర్ గుదిబండి

ఆ పాత ఇల్లు ఇప్పుడొక జ్ఞాపకం

ఆ పాత ఇల్లు ఒక జీవితం

చరమాంకం కోసం తెరలు దించుకొని

సిద్ధంగా ఉన్న రంగస్థలి

ఒక జడివాన తరువాత

చూరునుండి జారే ఆఖరి చినుకు

ఋతువుల్ని రాల్చుకున్న ఒంటరి చెట్టు

కాలం చెక్కిలిపై ఎన్నో భాష్పాలు జారిపోయిన

ఒక ఆనవాలు.

ఆనందాల్ని దోసిలితో పంచి

దుఃఖం ఇంకించుకొని బావురుమంటున్న బావి

ఎన్నో ఆశల రేవుల్ని దాటించి ఇక ఈ ఒడ్డుకి చేర్చి

తెరచాప దించుకున్న ఒంటరి నావ.

తనను దాటిన గాలివానలు

తను దాటిన వడగాలులు

తనముందు కూలిన కలల చెట్లు

రాలిన నవ్వుల పువ్వులు , కాయలు

ఇక వెంటాడే గతం

 ANNAVARAM SRINIVAS -2 copy

ఆ దారుల నడచిన బాల్యం ,

ఆ నీడన వొదిగిన తరాల వృధాప్యం,

ఆ ఒడిలో పెరిగిన నోరులేని జీవులు,

ఆ ఇంట నిండిన పాడిపంట,

ఇక తిరిగిరాని గతం.

ఎంతైనా ఆ  ఇల్లు ఇప్పుడొక  జ్ఞాపకం

మరో ఇల్లు చేరడం

కరిగిన కాలం తడి జ్ఞాపకాల్ని వొడి పట్టడం

జ్ఞాపకాన్ని ఇంకో జ్ఞాపకం తో ముడివేయడం

గతాన్ని వర్తమానంలోకి వంపుకోవటం

రాలిన జ్ఞాపకాల ఆకుల్ని ఎరువుగా మార్చుకుని

కొత్తగా ఆశల  చిగుర్లు కావడం

చిరుగుల కలల దుప్పటిని

కాలం దారంతో కలిపి కుట్టడం

చితికిన చితుకుల గూడుని వదిలి

మళ్ళీ  పుల్లా పుల్లా సరిచేసుకొని

కొత్త గూడు నిర్మించుకోవడం

ఆ ఇల్లు వదిలి మరో ఇల్లుకి మారటం

అమ్మ గర్భంనుండి పొత్తిళ్ళ కు మారటం

అమ్మ ఒడి నుండి ఊయలకి మారటం.

రాజశేఖర్ గుదిబండి

చిత్రరచన: అన్నవరం శ్రీనివాస్

 

మీ మాటలు

  1. జ్ఞాపకాలలో ఊయలూగించారు.. అభినందనలు సార్..

    • రాజశేఖర్ గుదిబండి says:

      ధన్యవాదాలు కెక్యూబ్ వర్మ గారు..

    • ఆ దారుల నడచిన బాల్యం ,
      ఆ నీడన వొదిగిన తరాల వృధాప్యం,
      ఆ ఒడిలో పెరిగిన నోరులేని జీవులు,
      ఆ ఇంట నిండిన పాడిపంట,
      ఇక తిరిగిరాని గతం. సర్ ఎక్ష్చెల్లెన్త్ గ ఉంది.వర్డ్ అఫ్ సెకుంచె .
      ఆ ఇల్లు వదిలి మరో ఇల్లుకి మారటం
      అమ్మ గర్భంనుండి పొత్తిళ్ళ కు మారటం
      అమ్మ ఒడి నుండి ఊయలకి మారటం.వర్డ్ అఫ్ మెఐంగ్ అద్బుతం గ ఉంది.
      చాల బొంది సర్ మేరు ఇలాగే ఎన్నో మంచి మంచి కవితలు రాయాలని ఆసిస్తూ అల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్.

  2. చాలా నచ్చింది .

    “జ్ఞాపకాన్ని ఇంకో జ్ఞాపకం తో ముడివేయడం
    గతాన్ని వర్తమానంలోకి వంపుకోవటం” … మీ కవిత ఎవరికైనా వర్తిస్తుంది.

  3. రాజశేఖర్ గారూ …చూరునుండి జారే ఆఖరి చినుకు, ఋతువుల్ని రాల్చుకున్న ఒంటరి చెట్టు కాలం చెక్కిలిపై ఎన్నో భాష్పాలు జారిపోయిన ఒక ఆనవాలు, అంటున్నపుడే మీ పాత ఇంటిని మీరిప్పుడు మళ్ళీ మా ముందు కట్టినట్టుంది……… సారంగ లో మంచి కవితనందించారు ………. ధన్యవాదాలు

  4. pratapreddy says:

    పాతిల్లు కవిత చాల బాగుంది పాటకులకు మరిన్ని కవితల్ని అందిచాలని మనసార కోరుకొంటూ మీకు ధన్యవాదములు తెలుపుతున్నాము మీ అక్కసరోజ భావ ప్రతాప్

    • rajasekhar says:

      థాంక్ యు అక్కయ్య , థాంక్ యు బావ…
      మీ ప్రోత్సాహం తో , ఆశిస్సులతో మరిన్ని రాయగలనని నా నమ్మకం…

  5. మంచి కవితమ్డి ! పాతఇంటి కోసం మీరు వలికిమ్చిన విషాదం హృదయాన్ని బరువెక్కిమ్చిమ్ద్. గతం ఎప్పుడు జ్ఞాపకంగామిగిలిపోతమ్ది . మార్పు సహజమైనా మీ కవిత అసహజం!

  6. Rajendra Prasad . Maheswaram says:

    Raja sekar గారికి,నమస్సులు. మీ కవిత చదివినంతసేపూ ఎందుకోగాని , మనస్సులో తెలియని దుఖం తన్నుకోచింది. కారణం ఈ మధ్యనే నేను అనుభవించిన ఇలాంటి సంఘటనే కావచ్చు.

    ,”ఆ ఇల్లు వదిలి మరో ఇల్లుకి మారటం
    అమ్మ గర్భంనుండి పొత్తిళ్ళ కు మారటం
    అమ్మ ఒడి నుండి ఊయలకి మారటం.”
    అనుభవించిన వారికీ మాత్రమె తెలియగల నిజమైన నిజం.

    థాంక్ U సర్..

మీ మాటలు

*