పాటల సముద్రం

akella

1

తీరం పరుపు

అలలు తలగడ

వెన్నెల దుప్పటి

ఒడ్డున పడుకుని

పదాల రేణువులతో చెలిమి చేస్తూ

2

పురా వేదనల్నీ

అసమ్మతి ఆత్మనీ

ఉపశమించడానికి

పాట తప్ప మార్గమేముంది?

3

బధ్ధకపు మబ్బులు కదలవు

బాగా  రాత్రయాకా

పడవలూ పక్షులూ

రెప్పలాడించని మదిలో

నేనింకా రాయని

లక్షల పాటలు బారులు తీరుతూ

Inner Child

4

సముద్రపు అనేక భంగిమల్ని

ఉదయాస్తమయాల రహస్య నిష్క్ర్రమణాల్నీ

జీవితపు అనంత సౌందర్యాల్నీ

అందరితో పంచుకుంటూ

నే చివరి దాకా

పాటల సముద్రం

పక్కనే నడుస్తూ

ఆకెళ్ళ రవిప్రకాష్

మీ మాటలు

  1. షార్ట్ న స్వీట్ అంటే ఇదేనేమో…మీ పదాల ఎంపికా, గోడపేర్పూ వెరసీ, చదివింపజేసిన కవితల్లో ఇదొకటీ.

  2. పదాల రేణువులతో చెలిమి చేస్తూ…baagundi nee paatala samudram..

  3. హాయిగా తీరాన కవితా నిదురకు కావాల్సిన సరంజామా సర్దుకుని పదాల రేణువులతో చెలిమి చేస్తూ జీవితపు అనంత సౌందర్యాన్నీ ఆస్వాదించగలిగే కవిత

  4. prof.Raamaa Chandramouli says:

    సముద్రపు అనేక భంగిమలు ….అని చెప్పడం బాగుంది….అభినందనలు

    – రామా చంద్రమౌళి

  5. చాలా బాగుంది

  6. ఈ కవిత రాబోయే మీ కవితాసంపుటికి నాంది పలికి మరిన్ని కవితలు రాస్తారని మమ్మల్ని కవిత్వసముద్రంలో ముంచుతారని ఆశిస్తూ…చింతా కొండలరావు

  7. Thirupalu says:

    తీరం పరుపు
    అలలు తలగడ
    వెన్నెల దుప్పటి
    ఒడ్డున పడుకుని
    పదాల రేణువులతో చెలిమి చేస్తూ-

    అహా! ఎంత మంచి కల! కవీ నీ కల పలించు గాక!

  8. సి.వి.సురేష్ says:

    పదాల పొదుపు.. అన౦త భావ౦.. ! వెరశి ఈ కవిత.. అద్భుతమైన అ౦దమైన కవిత సార్! …….గ్రేట్

  9. లోవ దాస్ says:

    నేనింకా రాయని

    లక్షల పాటలు బారులు తీరుతూ – అద్భుతమైన భావన

  10. ఉదయస్త్మయాల రహస్యనిష్క్రామానాలు సూర్యోదయం, సూర్యాస్తమయం అందరికితెలిసిందే చూస్తూనే వున్నాం అనే
    భావనలో ఉన్న మాకు ఇంకేదో నిగూడ రహస్యం వుందని తెలుపుతుంది మీ కవిత.ఎంత సపాదించిన ఏమి అనుభవించినా లో లోపల ఏదో వెలితి ప్రతి ఒక్కరిలో ఉన్నా చేపలేకున్న
    అది జీవితపు అనంత సౌదర్యం అందరికి పంచుతూ అనే పదం దగ్గర ఆగి ఆలోచించేలా వుంది.చాల బాగుంది మీ కవిత

Leave a Reply to లోవ దాస్ Cancel reply

*