అలల చేతివేళ్లతో..

sudhakar

అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల
నైపుణ్యం ముందు..
ఆకాశం చిన్నబోతుంది
ఆకాశాన్ని అల్లి
లోకం మీద పరిచిన సృజనకారుడెవరో..

ఆకాశమొక పిట్టగూడు

ఏ పురాతన ఆదిమజాతి
మానవుడో
శరీరమ్మీద ఆచ్ఛాదన లేని దశలో
ఆకాశాన్ని వస్త్రంగా నేసి ధరించి ఉంటాడు
పచ్చని చెట్లు
శరీరమ్మీద మొలిచిన తర్వాత
ఆకాశాన్ని..
లోకమ్మీదకు విసిరేసుంటాడు

sky2

అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల
నైపుణ్యం ముందు..
సూరీడు చిన్నబోతాడు
ఆ చేతివేళ్ల కిరణ సముదాయం-
ఎన్నెన్ని పద్మవ్యూహాల చిక్కుదారులను ఛేదించి
బయటపడే మార్గానికై అన్వేషిస్తుందో..

ఆ అలల చేతి చూపుడు వ్రేణి
కొనగోటిపై
ఎక్కడ నుంచో వచ్చి వాలిన
పేరు తెలియని పక్షి
రెక్కలల్లార్చుతూ కనిపిస్తుంటుంది
పక్షి కన్నుల్లో ఏకాగ్రత
అతని సొంతం
కళ్లు ‘చిగుర్ల’ను పొదుగుతాయి
అన్వేషణే పరమావధిగా భావించే
ఆ చేతివేళ్లు
వృక్షాలౌతాయి

ఆ చేతివేళ్ల వృక్ష సముచ్ఛయాలపై చిగుర్చిన
చిగురుకళ్లకు –
ఒక్కో గూడు ఒక్కో దేశంగా
ఒక్కో దేశం ఒక్కో అరణ్యంగా
కనిపిస్తుంది

దేశ దేశాల గూళ్లనూ
గూళ్లలో ఆకాశాలనూ నేసిన
ఆ చేతివేళ్లు
తన గూటిపై పరుచుకున్న చిరుగుల ఆకాశాన్ని
సరిచేసుకోవాలంటే..

ఇంకెన్నెన్ని ఉదయాలను కలగనాలో..

– బాల సుధాకర్ మౌళి

మీ మాటలు

  1. బాగున్నట్లుంది,,. కాని ఆకాశమంత అయోమయాన్ని పరిచినట్లుంది,..

  2. vijay kumar svk says:

    వహ్ చాలా బాగుంది మీ కవిత… సలాం :)

  3. ఏ పురాతన ఆదిమజాతి
    మానవుడో
    శరీరమ్మీద ఆచ్ఛాదన లేని దశలో
    ఆకాశాన్ని వస్త్రంగా నేసి ధరించి ఉంటాడు
    పచ్చని చెట్లు
    శరీరమ్మీద మొలిచిన తర్వాత
    ఆకాశాన్ని..
    లోకమ్మీదకు విసిరేసుంటాడు extraordinary imaginary Bala.. congrats…

  4. అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల
    నైపుణ్యం ముందు..
    ఆకాశం చిన్నబోతుంది
    దేశ దేశాల గూళ్లనూ
    గూళ్లలో ఆకాశాలనూ నేసిన
    ఆ చేతివేళ్లు
    తన గూటిపై పరుచుకున్న చిరుగుల ఆకాశాన్ని
    సరిచేసుకోవాలంటే..

    ఇంకెన్నెన్ని ఉదయాలను కలగనాలో..
    నిజమే! చాలా ఉదయాలను కలగనాలి! చాలా బాగుంది.

  5. చాలా బావుందండి మీ కవిత. .కెక్యూబ్ వర్మ గారు చెప్పినట్టు ఆ లైన్స్ అద్భుతమైన ఇమేజినరీ.

  6. లోవ దాస్ says:

    దేశ దేశాల గూళ్లనూ
    గూళ్లలో ఆకాశాలనూ నేసిన
    ఆ చేతివేళ్లు
    తన గూటిపై పరుచుకున్న చిరుగుల ఆకాశాన్ని
    సరిచేసుకోవాలంటే..

    ఇంకెన్నెన్ని ఉదయాలను కలగనాలో.. – చాలా బాగుందండి మీ కవిత

Leave a Reply to Thirupalu Cancel reply

*