నాలుగేళ్ళ క్రిందట మలి దశ తెలంగాణా ఉద్యమం మొదలయిన తరువాత తెలుగు జాతీయతా భావన యొక్క పతనం వేగవంతమయింది. తెలంగాణా వాదులు తెలుగు రాష్ట్ర ఆవిర్భావం, విశాలాంధ్ర ఏర్పాటు క్రమంతో పాటు, హైదరాబాదు రాజ్యం భారత యూనియన్ లో కలిసిన విధానం పై కూడా చర్చ కూడా మొదలయింది. సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుకోవాలా అనే చర్చలో భాగంగా నిజాము రాజ్య స్వభావం, జాతీయవాద దృక్కోణంలో/కమ్యునిస్టు దృక్కోణంలో హైదరాబాదు చరిత్ర, విశాలాంధ్ర ఏర్పాటులో కమ్యునిస్టు పార్టి పాత్ర ను విమర్శనాత్మకంగా చూడటం మొదలయ్యి ఈ రోజుని విలీనంగా, విమోచనగా, విద్రోహంగా చూడాలా అనే ఆరోగ్యకరమయిన చర్చ ముందుకొచ్చింది.
– సునీత అచ్యుత
చాలా informative గ ఉంది. ఇంకా రాస్తారా ? తెలుసు కోవాలని ఉంది!
తప్పకుండా రాస్తాను. అయితే కొంత సమయం పడుతుంది. థాంక్ యు.
సునీత గారూ…నమస్కారం.మీ పరిశోధనాంశాలు హైదరాబాదు విమోచన విషయంలో కొత్త కోణం ఆవిష్కరించింది.చదువుతుంటే ఆసక్తిగా ఉంది.ఆనాటి సంఘటనలు చూసిన ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన సంగతులు ఆలోచింపచేస్తున్నాయి.మీ ప్రయత్నం ప్రశంసనీయం.