వైవిధ్యమే వర్మ సంతకం!

reppala_vantena

వర్మ ఓ నిశ్శబ్ద సైనికుడు…. అక్షరాన్ని ఓ బుల్లెట్ లా వాడుకునే సైనికుడు.

“రక్తమోడుతున్న మీ అక్షరాలు

కవిత్వాన్ని నిలదీసాయి

మీరిలా ముందుకెళ్ళండి

అక్షరాలవే మీ వెంటవస్తాయి

పరిగెత్తుకుంటూ…”

ఇది నేను వర్మ కవితపై రాసిన మొట్టమొదటి కామెంట్. నా ఆ స్పందనే మమ్మల్ని దగ్గర చేసిందనుకుంటా. అప్ప్పట్నుంచే ఆయన నాకో  మంచి మిత్రుడు.!…కానీ వర్మ నాకో బలహీనత …. వర్మ వాక్యాలు ఓ బలం….

ముఖపుస్తకం లొ పరిచయం ఐన కవిమిత్రుల్లో కుమార్ వర్మ ఓ ప్రముఖ వ్యక్తి. అతనితో, అతని కవితలతో పరిచయం ఐదేళ్లపైమాటే. ఇన్నాళ్ళుగా కుమారవర్మ కవిత్వాన్ని చదువుతూ అతని అక్షరాల్లోంచి మోడేస్టీగా తొంగిచూసే భావనలని పట్టుకోవటం ఓ కవితాత్మక హాబీ. కవి తనురాసే కవితల్లో దొరికిపోతాడంటారు కానీ ఇంతవరకూ వర్మ కవిత్వంలో ఇదమిద్ధంగా ఇదీ “వర్మ” అనే ముద్రలేకుండా రాస్తుండటమే అతని రాతల్ని సిన్సియర్ గా చదవటానికి ముఖ్యకారణం.

కవిత్వం రాయటంలో వర్మ కున్న నిజాయితీ (సీరియస్ నెస్) ఆ కవితల శీర్షికలబట్టె అర్ధమవుతుంది. చాలా తక్కువమంది మాత్రమె తమ కవితల టైటిల్స్ ని జాగ్రత్తగా ఎంపికచేసుకుంటారు. ఉదహరణగా ఇవి చూడండి : “మృతపెదవులు” , “రాతిబొమ్మల రహస్యం”, “పత్ర రహస్యం”,  “సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు”, “దేహకుంపటి” ఇలా చెప్పుకుంటూ పోతే అతను రాసిన కవితలన్నింటినీ ఉదాహరించాలిక్కడ.

వర్మ కవితల్లో ఓ ప్రత్యేక మార్మికత దోబూచులాడుతుంటుంది. అక్షరాన్ని మార్మికతలో చుట్టి వాటితో కొన్ని వందలపదచిత్రాలతో ఓ దండకూర్చి  మనకి బహుమానంగా ఇస్తారు. ఆ అక్షరాలని వలిచి మళ్ళీ వాటినన్నింటినీ మనం పేనుకుని చదివి ఆకళింపుచేసుకునే పని మాత్రం తప్పదు పాఠకులకి.

వర్మ కవితల్లో శ్రేణి, వస్తు వైవిధ్యం, పోరాటం, ప్రధాన ఆకర్షణలు. సమాజంలోని నీచత్వం, దిగజారుడుతనం, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు ఇవి ప్రధానవస్తువులైనా, హఠాత్తుగా ఓ ప్రేమకవితతో ప్రత్యక్షమయి తన వైవర్మ విధ్యాన్ని వర్మ కవితల్లో ఓ ప్రత్యేక మార్మికత దోబూచులాడుతుంటుంది. అక్షరాన్ని మార్మికతలో చుట్టి వాటితో కొన్ని వందలపదచిత్రాలతో ఓ దండకూర్చి  మనకి బహుమానంగా ఇస్తారు. ఆ అక్షరాలని వలిచి మళ్ళీ వాటినన్నింటినీ మనం పేనుకుని చదివి ఆకళింపుచేసుకునే పని మాత్రం తప్పదు పాఠకులకి. వర్మ కవితల్లో శ్రేణి, వస్తు వైవిధ్యం, పోరాటం, ప్రధాన ఆకర్షణలు. సమాజంలోని నీచత్వం, దిగజారుడుతనం, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు ఇవి ప్రధానవస్తువులైనా, హఠాత్తుగా ఓ ప్రేమకవితతో ప్రత్యక్షమయి కవిత్వంలో  వైవిధ్యాన్నీ, భాషపై తనకున్న అధికారాన్నీ చాలా మోడెస్ట్ గా వ్యక్తపరుకుంటాడు వర్మ.

నాకతని కవితలు ఇష్టమే…కానీ కొన్ని కవితలు నిరుత్సాహపరుస్తాయి. అందులో ఇదొకటి. ఈ శీర్షికకి రాస్తున్నాను కదాని పూర్తిగా నెగటివ్ గా రాయటం నా ఉద్దేశ్యం కాదు కానీ ఈ కవితలో వర్మ ఎందుకిలా తొందరపడ్డాడా అని బాధపడ్డ క్షణం లేకపోలేదు.

 

 

మాటలు

కొన్ని మాటలు

చెవిలో దూరినా మనసులో ఇంకవు

కొన్ని మాటలు

దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు

కొన్ని మాటలు

ముళ్ళులా మారి దేహంతో పాటు మనసును గుచ్చుతాయి

కొన్ని మాటలు

ఆత్మీయంగా పలకరించి జీవం పోస్తాయి

కొన్ని మాటలు

తొలకరి చినుకులా కురిసి చిగురు వేస్తాయి

కొన్ని మాటలు

వెన్నెల చల్లదనాన్ని పంచి ప్రశాంతతనిస్తాయి

కొన్ని మాటలు

రక్తాన్ని మరిగించి కరవాలాన్నందించి యుద్ధోన్ముఖున్ని చేస్తాయి

కొన్ని మాటలు

నిన్ను అంతర్ముఖున్ని చేసి సుషుప్తిలోకి నెట్టి స్వాంతననిస్తాయి

 

కొన్ని మాటలు

రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

కొన్ని మాటలు

అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి…

 

చాలా మంచి కవిత ఇది..మొదటి వాక్యంలో ఉన్న రిపీట్ లేకపోయుండే ఇంకా బావుండెదనే ఫీల్ మాత్రం తప్పదు.

కొన్ని మాటల/వాక్యాల రిపీట్ కవితా శిల్పాన్ని దెబ్బతీయడమేకాకుండా పాఠకుడు కవితనుంచి వెళ్ళిపోయే ప్రమాదమూ ఉంది.

దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు” ఇలాంటి స్టేట్‌‌మెంట్ లాంటి వాక్యాలు రాసే కవి కాదు వర్మ. మరెందుకనో ఈ కవితలొ కొంచెం తొందరపడ్డాడెమో అనిపించింది.

కానీ ఇదిగో ఇలాంటి వాక్యాలకోసం వర్మ రాసిన ప్రతీ కవిత చదువుతూంటాను.

కొన్ని మాటలు

రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

కొన్ని మాటలు

అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి…”

కారణం–వర్మ లోని సీరియస్ నెస్. కవిత్వం కంటే తన భావనలని ప్రజలకు చెప్పాలనె సీరియస్ నేస్…….పోరాటం, ప్రొటెస్టీంగ్–ఇవే వర్మ ఆయుధాలు. ఇవే ఇతన్ని కవిగా నిలబెట్టినవి కూడా…..

వర్మ చాలా పరిణతి చెందిన కవి. అక్షరాలతో మనసు దోచుకుంటూ వాక్యాల్ని మనకొదిలేసి విచారించమటాడు. ఇంత వైవిధ్యం ఉన్న కవిని ఇంతవరకూ నేను చూళ్ళేదంటే నమ్మాలి మీరందరూ. ఏం రాసినా సిన్సియర్ గా రాస్తూ, తన రచనకి న్యాయం చేయాలనుకునె కవి వర్మ…వర్మ నిజంగానే ఓ కవి. All the best Varma in all your future endeavours.

                                                                                                                                                                                                                 – వాసుదేవ్

541392_4595388722851_1575449086_n

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    1.కవిత్వం రాయటంలో వర్మ కున్న నిజాయితీ (సీరియస్ నెస్) ఆ కవితల శీర్షికలబట్టె అర్ధమవుతుంది. చాలా తక్కువమంది మాత్రమె తమ కవితల టైటిల్స్ ని జాగ్రత్తగా ఎంపికచేసుకుంటారు.
    2.వర్మ కవితల్లో శ్రేణి, వస్తు వైవిధ్యం, పోరాటం, ప్రధాన ఆకర్షణలు.
    3.అక్షరాలతో మనసు దోచుకుంటూ వాక్యాల్ని మనకొదిలేసి విచారించమటాడు.

  2. balasudhakarmouli says:

    వర్మ కవిత్వంలో వొక గొప్ప లక్షణం- సున్నితమైన మనోనిర్మలత్వం పక్కనే.. తీవ్రమైన విప్లవ కాంక్ష వుండడం. బహుసా అది విప్లవకారుని లక్షణం కూడా అయ్యుంటుందనుకుంటా.
    ‘ఎప్పుడైనా నిన్ను నువ్వు’ కవితలో…

    ‘ఎప్పుడైనా నిన్ను నువ్వు
    సీతాకోకచిలుక రెక్కపై
    పుప్పొడిలా అంటుకొని చూశావా?!’

    అన్న కవి-

    ‘ఎప్పుడైనా నిన్ను నువ్వు
    ఓ తూటాగా మార్చి
    వాడి గుండెల్లో దూసుకుపోయి చూశావా?!’

    అనడం బట్టి చూస్తే…
    తను ఎంచుకున్న గమ్యంపై స్పష్టమైన గురి వున్నవాడే- సున్నితమైన భావకుడు కూడా అయి వుంటాడని అర్థమౌతుంది.

    ”వో కవి చేస్తున్న పనిలో పూర్తీగా నిబద్ధుడైతే- అతని చేసిన ‘సాహిత్య ఉత్పత్తి’ కూడా నిబద్ధత కల్గినదౌతుంది” అని అనడంలో సందేహం లేదు.
    వర్మగారు గమ్యం పట్ల నిబద్ధత కల్గిన అద్భుతమైన ‘విలుకాడు’. ఆ విలుకాడికి మన చేయూత కూడా కలిస్తే………..

    వాసుదేవ్ గారి వ్యాసం అద్భుతంమైన ప్రేరణోత్పన్నకం.

  3. కొన్ని మాటలు రాసిన ఈ కవి యొక్క అన్ని మాటలూ వినాలి అనిపించేట్టుగా ఉంటాయి . కవినీ పుస్తకాన్ని చాలా బాగా పరిచయం చేసిన శ్రీనివాస్ వాసుదేవ్ గారికి ధన్యవాదాలు, ఒకందుకు అభినందనలు

  4. renuka ayola says:

    వర్మ గారి కవిత్వంలో వస్తు వైవిధ్యం చదివే వాళ్ళని ఆలోచింప చేస్తుంది
    మీ పరిచయం విశ్లేషణతో
    వర్మ గారి కవిత్వం లో కొత్తకోణం చూడగలిగాము వాసుదేవ్ గారు
    మీరు మరిన్ని మంచి కవితలని కవులని పరిచయం చేయాలని కోరుకుంటూ
    ధన్యవాదాలు …

    • వర్మకవిత్వ శ్రేణిపై వైవిధ్యంపై రాసేటప్పుడు చాలా సార్లు ఆలొచించి రాయాల్సివచ్చింది. అందరికీ పరిచయమైన విషయాన్ని మళ్ళి చెప్పటం పునరుక్తి కావటంతో కొంచెం కష్టమనిపించినా మీదగ్గర నెగ్గుకురాగలనన్న నమ్మకంతోనె ముందుకెళ్లాను మేడం..మీ అభిమానాక్షరానికి కృతజ్ఞతలు రేణుకా గారు

  5. కొన్ని మాటలు

    రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

    కొన్ని మాటలు

    అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి…” వర్మ గారి కవితలని బాగా చిత్రిక పట్టి ప్రేమగా రాసేరు.. చాలా మంచి పరిచయం ..మళ్ళీ వర్మ గారి కవితలు చదవాలి అనిపించేంతటి ఆత్మీయ కరచాలనం లా .. కుడోస్ తో వర్మ గారు అండ్ దేవ్ గారు

    • పద్మగారూ..నిజమె వర్మ కవిత్వాన్ని ఒక్కసారికె ఆకళింపు చేసుకుని ఒక అభిప్రాయాన్ని రాయలేం. చిత్రికపట్టాల్సిందె…అలాగె అతని కవిత్వాన్ని చదివిన కొద్దీ ఆస్వాదించే కోణం మారుతూంటూంది. అదె వర్మ. అదె రాయించిందికూడా…ధన్యోస్మీ మీ ఆత్మీయాక్షరానికి

  6. వైవిధ్యత, స్పష్టత,.సరళత,.వర్మ గారి కవిత్వాన్ని మళ్లిమళ్ళి చదివిస్తాయ్,. వాసుదేవ్ గారు,. మంచి పరిచయం మరియు విశ్లేషణ,..

  7. వాసుదేవ్ గారూ

    “వర్మ లోని సీరియస్ నెస్. కవిత్వం కంటే తన భావనలని ప్రజలకు చెప్పాలనె సీరియస్ నేస్…….పోరాటం, ప్రొటెస్టింగ్ –ఇవే వర్మ ఆయుధాలు. ఇవే ఇతన్ని కవిగా నిలబెట్టినవి కూడా…..” అన్న మీ మాటలని నేను సమర్థిస్తున్నా. ఈ తరం కవులలో అంత నిబద్ధతతో రాసే వాళ్ళు నాకు అంతగా కనిపించడం లేదు.

  8. peruguramakrishna says:

    వర్మ కవిత్వం నాకిష్టం

  9. క(ర )వి వర్మ కవిత్వం నాకిష్టం …!

  10. ఇంతమంది పెద్దలు మిత్రుల ఆత్మీయాశీర్వాదం కల్పించినందుకు ముందుగా ఆత్మీయ సాహితీ మిత్రులు వాసుదేవ్ గార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీ అందరి మాటలు నన్ను నా అక్షరానికి మరింత బద్ధున్ని చేస్తూ మెరుగుపరుచుకుంటూ మీ అందరి సాన్నిహిత్యాన్ని పొందే కృషిలో కొనసాగుతానని అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకింత చోటునిచ్చిన సారంగ నిర్వాహకులకు నమస్సుమాంజలులు అర్పిస్తున్నా..

మీ మాటలు

*