చర్మం రంగు

baba
“ముఖ్య అతిధికి బొకే నేను ఇస్తాను టీచర్”
“నువ్వొద్దు ….. అందుకు వేరే వాళ్ళను ఎంపిక చేసాం”
ఆ  “వేరేవాళ్ళకు” తనకూ ఉన్న తేడా
ఆ అమ్మాయికి కాసేపటికి తెలిసింది
చర్మం రంగు.
చరిత్ర లోయలోకి
నెత్తురూ, కన్నీళ్ళూ పారిస్తూ,
జీవన మార్గాలపై
చీకటివెలుగుల్ని శాసిస్తోన్న
చర్మం రంగు ….. చర్మం రంగు…..
సంచి కన్నా ఆత్మ గొప్పదని
వెర్రికేకలతో అరవాలనుకొంది ఆ అమ్మాయి.
finger-painting-in-the-dark
ఉబ్బిన మొహం, ఎర్రని కళ్లతో
తనకొచ్చిన ప్రైజుల్ని తీసుకొని
మౌనంగా నిష్క్రమించింది.
పదేళ్ళ తరువాత …….
“ముఖ్య అతిధి”  స్పీచ్ ముగించుకొని
వెళుతూ వెళుతూ
ఉబ్బిన మొహం, ఎర్రని కళ్ళతో ఉన్న
ఓ స్టూడెంట్ చేతిలో బొకే పెట్టి,
భుజం ఎందుకు తట్టిందో
ఎవరికీ అర్ధం కాదు
మరో పదేళ్ళ దాకా
–బొల్లోజు బాబా

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    aagastu 15 thedee naadu- oka goppa kavithanu chadivaanani anukuntunnaanu. nijangaa- goppa prerananu icche kavithanu raasinanduku – meeku naa danyavaadhaalu…..

  2. balasudhakarmouli says:

    మరో పదేళ్ళదాకా కాదు- మరు క్షణమే అర్థం అవ్వాలి.

  3. బాబా గారూ,

    ప్రతీకలూ, అర్థాంతరన్యాసాలూ, అన్యాపదేశాలూ ఈ మధ్య అంతగా కవిత్వంలో కనిపించడం లేదు. కనిపించినచోటకూడా లోతుగా, గంభీరంగా పాఠకుడికి కూడా కొంచెం మేధోపరమైన అభ్యాసాన్నిచ్చి తనకు తానుగా తెలుసుకుని ఆనందాన్నిచ్చేవిగా ఉండటం లేదు. అందులో పాఠకుడికి అర్థం కాదేమోనన్న తపనే ఎక్కువ కనిపిస్తుంది.

    చాలరోజుల తర్వాత మళ్ళీ మంచి కవిత చదివిన అనుభూతి కలిగింది. సందర్భోచితంగా కూడా ఉంది. ఈ రకమైన Apartheid (వివక్ష) మనకి ఇంకా sub-conscious గా ఇంకా మిగిలే ఉంది అన్నది నిజం. నలుపురంగు ఒక మంచి విషయం. దాని మీద ఈ ఛాయ (Shade of meaning) కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా కవులు దాన్ని కవిత్వీకరించేరో పరిశీలించవలసిన అంశమే.

    అయితే మీ శీర్షిక మాత్రం అసంతృప్తి మిగిల్చింది.

  4. చెమర్చిన కళ్ళతో..
    ఆలోచింపజేసిన కవితనందించినందుకు అభినందనలు సార్..

  5. సాయి పద్మ says:

    బొల్లోజు బాబా గారి కవిత్వం …నా వరకూ ఒక అంతర్గత సంగీతం లాంటిది ..
    ఒక బ్లాటింగ్ పేపర్ గుంజేసుకున్న సిరా లా ..
    ఎన్నో ఉద్వేగాలని సహజంగా ఇంకించుకుంటుంది ..ఏ సుప్త సాయంత్రమో, మనసు చెదిరిన ఏ చరిత్ర రహస్యం మన మనసుకే చెప్పినట్టు తోచే … ఒక సహజాతమైన అద్భుతం .. బాబా గారికి జన్మ దిన శుభాకాంక్షలతో

  6. shaiksadak says:

    చర్మం రంగు ఎందరి రంగుల కలల్ని చిదిమేసిందో!

  7. బాల సుధాకర్ మౌళి గారికి
    థాంక్యూ సర్. అవును, మరుక్షణమే అర్ధం అయితే బాగుంటుంది కదూ.
    మూర్తి గారికి
    మీ వ్యాఖ్యలు చాలా సార్లు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. థాంక్యూ సర్. ఇక శీర్షిక గురించి … ఈ కవితకు మొదట “వర్ణ” వివక్ష అని పెట్టాలనుకొన్నాను. కానీ దానివల్ల ఈ కవిత వేరేస్ట్రీమ్ లోకి వెళిపోయి, ఉద్దేశ్యం యొక్క సార్వజనీనత తగ్గుతుందనిపించి ప్రస్తుత శీర్షిక పెట్టాను. అంతేకాక హార్డ్ హిట్టింగ్ గా ఉండాలనేదికూడా ఒక కారణమే. అయినప్పటికీ మీ అభిప్రాయం సహేతుకంగానేఉన్నదని ఒప్పుకొంటున్నాను

    వర్మ గారికి
    థాంక్యూ సర్.
    సాయి పద్మ గారికి
    పద్మ గారికి, ఎంతో ఆత్మీయంగా వ్రాసిన మీ వ్యాఖ్య చాలా సంతోషాన్నిచ్చింది మాడం, థాంక్యూ వెరీ మచ్
    సాయి గారికి
    థాంక్యూ సర్

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    • balasudhakarmouli says:

      బుద్ధి జీవి అయిన kaviki- స్పందించే హృదయం, నిజాయితీ అవసరం. mee kavitvaaniki krutagntalu…..

  8. బాబా గారు,

    పోయెమ్ బాగుంది. చాలా రోజుల తర్వాత మీ కవిత చదివాను.

    welcome back !!

    రవి

  9. C.V.SURESH says:

    ఎకానమీ అఫ్ లాంగ్వేజ్ ! బ్యూటిఫుల్ పోయెమ్! క్రిస్పి గా ఉండే ఈ కవిత నిజంగా అత్యద్బుతం. వివక్ష ఏ రూప౦లో మనిషిని మానసిక౦గా దెబ్బ తీస్తు౦దో ఆ చిన్న స్టూడె౦ట్ మొహ౦లో కలిగే మార్పులతో చుపి౦చాడు. బావు౦ది. కాని. చివరగా ఆ స్టూడె౦టే పదేళ్ళకు ముఖ్య అతిది గా మారి, తనలాగనే గత౦లో తను బాధ పడినట్లు బాధపడుతున్న మరో స్టూడె౦ట్ భుజ౦ తట్టి౦ది. ఎన్ని తరాలు మారినా వివక్ష మారడ౦ లేదు. అని చెప్పడమే కవి గారి ఆ౦తర్య౦. ! కలర్ డిస్క్రిమినేషన్! వాహ్! సార్!

  10. Mercy Margaret says:

    నేను చాల లేట్ గా చదివాను సర్ .. చాల బాగుంది మీ కవిత .. చాలరోజుల తర్వాత మళ్ళీ మంచి కవిత చదివిన అనుభూతి కలిగింది.

  11. రవి గారికి, సురేష్ గారికి, మార్గరెట్ గారికి థాంక్సండి

  12. rajaram thumucharla says:

    అద్భుత ప్రారంభం వూహించని ముగింపు.మంచి కవిత చదివిన అనుభూతి.కంగ్రాట్స్.

  13. Thirupalu says:

    చర్మం రంగు.
    చరిత్ర లోయలోకి
    నెత్తురూ, కన్నీళ్ళూ పారిస్తూ,
    జీవన మార్గాలపై
    చీకటివెలుగుల్ని శాసిస్తోన్న
    చర్మం రంగు ….. చర్మం రంగు… అది కాటుక కన్నీటి తో పాటు కాలువలై పారుతున్న కాటేరి రంగు
    బాగుందండి. మనకలవాటైన రంగు. నల్లని కన్నీటి రంగు. మెలానిన్‌ రంగు.

  14. Wilson Sudhakar says:

    నైస్. నైస్

    విల్సన్ సుధాకర్

Leave a Reply to rajaram thumucharla Cancel reply

*