విరామమెరుగని వీవీ ఇంట….అరుదయిన ఒక క్షణం!

vvfamily

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1

నేను’ నిత్యనిర్బంధ’ వరంగల్ వాసిని.

అవి ‘ఎమర్జెన్సీ’ చీకటి రోజులు. అప్పట్లో వరంగల్ విరసం శిబిరంలో  వరవరరావు గారి ఉపన్యాసం విని చాలా ఉత్తేజితున్ని అయ్యాను.  అప్పటి నించి వి .వి. మైకం నన్ను కమ్మేసింది. హన్మకొండలోని వాళ్ళింటికి తరచూ వెళ్ళేవాన్ని. సృజన సాహితీ మిత్రులతో ఆ ఇళ్లోక విప్లవ కర్మాగారంలా  కనిపించేది.

నాకు మొదట్నించీ సాహిత్యమూ, ఫోటోగ్రఫీ జమిలిగా నా రక్తంలో ఇమిడి ఉన్నాయి. అట్లా తరచూ సాహితీ మిత్రుల ఫోటోలు తీస్తూ ఉండేవాన్ని.  వరవర రావు గారి ఫొటోలతో సహా.

భాస్కర్ కూరపాటి

భాస్కర్ కూరపాటి

నాకు మొదట్నుంచీ వీవీ సర్ వాళ్ళ ఫామిలీ ఫోటో తీయాలని కోరిక బలంగా ఉండేది. కాని ఆయన  ఎప్పుడూ మీటింగ్స్ అనీ, రచనలనీ ఇతర వ్యాపకాలతో చాలా బిజీగా ఉండేవారు.
ఈలోగా నేను ఉద్యోగపర్వంలో హైదరాబాద్ వచ్చిపడ్డాను.

2

అవి ‘ఎమర్జెన్సీ’ చీకటి రోజులు అని ముందే చెప్పానుకదా…
అరెస్టులు, నిర్భందాలు, భావప్రకటనారాహిత్యం అలముకొని ఉన్న రోజులు.

వరవరావు గారి కోసం జైళ్ళు ఎప్పుడూ నోళ్ళు తెరుచుకొని ఉండేవి.
వరంగల్ గోడలనిండా ‘లేపుతాం లేపుతాం , వరవరరావును లేపుతాం, బాలగోపాల్ను లేపుతాం’ అనేవే ఎక్కడ చూసినా భయకంపితుల్ని చేసేవి.
సరిగ్గా అల్లాంటి పరిస్తితుల్లో సార్ హైదరాబాద్ రావడం, ‘ఇదిగో మీ వరవరరావు’ అంటూ దేవిప్రియగారు ‘ప్రజాతంత్ర’లో ఓ మంచి ఆర్టికల్ రాయడం జరిగింది.
సార్ ఫామిలితో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఓ ఆదివారం సాయంత్రం బాగ్ లింగంపల్లిలోని సార్ ఇంటికి వెళితే అందరు ఉన్నారు. సార్ ఏదో మీటింగ్ కోసం వెళ్ళే తొందరలో ఉన్నారు. ఉన్నఫళంగా తొందరగా ఓ రెండు ఫొటోలు  తీశాను. అప్పుడు నా మనసు నిజంగా కుదుటపడింది.

అప్పుడు సార్ నవ్వుతూ “ఇన్నాళ్ళకు నీ కోరికా, మా కోరికా తీరినట్లయ్యింది. పట్టువదలని  విక్రమార్కుడివి అనిపించుకున్నావ్,  రా మీటింగ్ కు వెళదాం’ అంటూ కూడా తీసుకువెళ్ళారు.

-భాస్కర్ కూరపాటి

———————————————————————————

అపు’రూప’ చిత్రాలకు ఆహ్వానం

అపు’రూపం’ శీర్షిక అపురూప చిత్రాల ఆల్బం. మీరు ఎందరో ప్రసిద్ధ రచయితలని కలిసి వుంటారు. వారితో గడిపిన క్షణాలని మీ కెమెరాలలో బంధించి వుంటారు. అలాంటి అపురూపమయిన దృశ్యాలను ఇక్కడ పంచుకోండి.

—————————————————————————

మీ మాటలు

 1. భాస్కర్ గారూ,
  మీ ఫోటో వెనుక కథ చాలా బావుంది. ఇలా మీకే ప్రత్యేకమయిన అనుభవాలు, అనుభూతులు రాస్తే ఇంకా చదవాలని ఉంది.
  సారంగ లో ఇలా ఫోటో శీర్షిక ప్రారంభించడమూ బావుంది. మంచి ఆలోచన.
  -కె.గీత

 2. buchireddy gangula says:

  వర వర రావు గారు—
  డిసిప్లనే– కమిట్‌మెంట్— లీడర్‌షిప్ – కల నాయకుడు– విప్లవ కవి
  వారు మా జిల్లాలో పుట్టడం -మా వరంగల్ జిల్లాకే గర్వ కారణం–
  ధో డ్డ్ కొమురన్న
  చాకలి ఐ లమ్మ
  కాళోజీ
  జయ శంకర్ గారల లా—
  వి. వి గారు కూడా
  అప్పుడు– ఇప్పుడు — ఎప్పుడు కూడా తెలంగాణా చరిత్ర లో
  నిలిచి పోతూ—
  మంచి వక్త—ఒబామా గారి ఉపన్యాసం — ఎన్ని గంటల సేపు విన్నా—
  వినాలానిపిస్తుంధీ–ఆలాగే వి. వి గారు మాట్లాడుతూ ఉంటే—అధె తీరు–

  వారు ఎక్కడ ఉన్నా సాహితీ మిత్రులతో– ఆ ఇల్లు ఒక విప్లవకర్మాగారం లా కనిపిస్తుంధీ–భాస్కర్ గారు
  చాలా చక్కని నిజాన్ని చెప్పారు సర్–
  same priniciples
  same values
  same vision—-నమ్ముకున్న విప్లవకవి–వి . వి గారు–నాడు–నేడు– రేపు
  when people find their purpose in life and pursue it, their
  leadership is exemplary and authentic and others will
  be inspired to follow them *****

  వి .వి గారు నా మిత్రుడు—అని మురిసి పోతూ– గర్వ పడుతూ—
  ———————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 3. ఎన్ వేణుగోపాల్ says:

  డియర్ భాస్కర్,

  మంచి ఫొటో. దాని మీద మీ రైటప్ బాగుంది.

  చరిత్ర కోసం మూడు చిన్న సవరణలు:

  1. ఎమర్జెన్సీ కాలానికీ ఈ ఫొటో కాలానికీ మధ్య చాల ఎడం ఉంది. ఎమర్జెన్సీ 1975-77. ఈ ఫొటో 1990 జనవరి – మే మధ్యదనుకుంటాను. ఎమర్జెన్సీ ప్రకటించిన 1975 జూన్ 26 నుంచి ఎమర్జెన్సీ ఎత్తి వేశాక, అందరినీ విడుదల చేశాక కూడ వివిని మరికొంతకాలం నిర్బంధంలో ఉంచారు. అలా 1977 మార్చ్ లో విడదలై 1985 సెప్టెంబర్ దాకా వివి హనుమకొండలోనే ఉన్నారు. మీరు వివిని హనుమకొండ ఇంట్లో చూసింది ఆ రోజుల్లో కావచ్చు. 1985 సెప్టెంబర్ 3 న పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు, ప్రఖ్యాత పిల్లల వైద్యుడు, వరంగల్ లో వేలాది మంది చిన్నపిల్లలకు వైద్యం చేసి, ఎందరో తల్లిదండ్రుల ఆదరాభిమానాల్ని అందుకున్న డా. రామనాథం గారిని పట్టపగలు పోలీసులు ఆయన క్లినిక్ లోకి దూరి కాల్చి చంపారు. ఆ ఊరేగింపు సందర్భంగా వరవరరావును, బాలగోపాల్ ను చంపుతాం అని నినాదాలు ఇచ్చారు. ఆ నేపథ్యంలో 1985 డిసెంబర్ లో సికిందరా బాద్ కుట్రకేసులో తన బెయిల్ రద్దు చేసుకుని వివి జైలుకు వెళ్లారు. ‘వెయ్యి ఒంటరి రాత్రుల నిర్బంధం’ తర్వాత 1989 చివరిలో విడుదలై, పూర్తిగా హైదరాబాదుకు మారారు. అప్పుడు బాగ్ లింగంపల్లి లో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు తీసిన ఫొటో కావచ్చు ఇది.

  2. బాలగోపాల్ ఎమర్జెన్సీ కాలంలో వరంగల్ లో ఉన్నారు గాని అప్పటికి ఆయనకు విప్లవ రాజకీయాలతోను, పౌరహక్కుల సంఘం తోను సంబంధం లేదు. 1981 మధ్యలో సృజనకు రచనలతో విప్లవ శిబిరంలో ప్రవేశించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఖమ్మంలో జరిగిన పౌరహక్కుల సంఘం సమావేశాలతో ఆయన పౌరహక్కుల కృషి మొదలయింది.

  3. మీరు రాసినట్టుగా దేవిప్రియ గారు ప్రజాతంత్ర లో ‘ఇదిగో మీ వరవరరావు’ అని వ్యాసం రాసినట్టు గుర్తు రావడం లేదు. క్షమించాలి. మీరు మరొక వ్యాసంతో దాన్ని పొరపడుతున్నట్టున్నారు. ఎందుకంటే అప్పుడు ప్రజాతంత్ర ప్రచురణలో లేదు. బహుశా అప్పుడు దేవిప్రియ ఆంధ్ర్జ్దజ్యోతి ఆదివారం అనుబంధానికి సంపాదకత్వం వహిస్తున్నారనుకుంటాను. వివి జైలు నుంచి విడుదల కాగానే బహుశా 1989 డిసెంబర్ లేదా 1990 జనవరి లో ఒక ఆదివారం అనుబంధం (అప్పుడు టాబ్లాయిడ్ సైజులో ఉండేది) ముఖచిత్రంగా వివిది మంచి కలర్ ఫొటో వేసి ‘ఎవరీ వరవర రావు విప్లవ స్వరవర రావు’ లాంటి శీర్షికతో కె. శ్రీనివాస్ గారు ఒక పెద్ద వ్యాసం రాశారు.

  ఏమైనా ఒక మంచి ఫొటో, ఆలోచనాస్ఫోరకమైన రైటప్ అందించినందుకు కృతజ్ఞతలు.

  వి.

  • Gundeboina Srinivas says:

   ఆ౦ధ్రజ్యోతి ఆదివార౦ అనుబ౦ధ౦ ముఖచిత్ర౦ పై సార్ (పోస్ట్ కార్డ్ సైజ్) ఫోటో వేసి ‘ఇడుగిడుగో వరవరరావు’ అనే శీర్షిక పెట్టారు.
   లోపలి పేజీలో ఫోటో వేసి దాని కి౦ద ‘ఎవరీ వరవరరావు? విప్లవ స్వరవరరావు అనే రైటప్ పెట్టారు.

 4. మీ అభిప్రాయాలకు, సవరణలకు చాలా థాంక్స్, వేణు గారూ…
  నిజానికి నాకంత మెమరీ లేదండి. ఏదో తెలియని వీ వీ మైకంలో రాసాను. మీరు సూచించిన సవరణలు నిజమే. ఇప్పుడు ఒకటొకటిగా గుర్తుకొస్తున్నాయి. కాని ఒకటి మాత్రం నిజం వేణుగారూ, నిజానికి నేనంతగా రాయలేను. ఇది మాత్రం బాగా ఫీల్ అయ్యి రాసాను. అంతే. పొరపాట్లకు క్షంతవ్యుణ్ణి.
  గీత గారికి, గంగుల బుచ్చిరెడ్డి గారికి వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలకు కృతఙ్ఞతలు.
  కాని, బుచ్చిరెడ్డి గారు వరవరరావు గారిని ఒబామాతో పోల్చడమే సబబుగాలేదనిపిస్తుంది.
  –విప్లాభివందనలతో,
  -మీ, భాస్కర్ కూరపాటి.

 5. buchireddy gangula says:

  భాస్కర్ గారు
  ఒబామా ఉపన్యాసం ఎంత సేపు అయినా వినాలనిపిస్తుంది — అలాగే
  వి .వి గారు ఉపన్యాసం యిచ్చినా — అదేలా అనిపిస్తుంది –అని చెప్పాను
  కాని పోల్చడం అంటూ లేదు సర్ —
  యింకా డౌట్స్ ఉంటె రాయండి- — జవాబులు యివ్వగలను
  ————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 6. krishnareddy kalmekolen says:

  కూరపాటి!
  అలుపెరుగని విప్లవ రచయిత,విశ్లేషకుడు,మార్క్సిస్జం,లెనినిజం,మావో ఆలోచనావిదానాం
  బారత దేశకాల పరిస్థితుల కన్వహిస్తూ విప్లవ రాజకీయాలను నిలబెడుతున్న మార్క్సిస్టు
  మేదావి కుటుభంము ను కన్న్లారా కనిపింప చేసినదుకు సంతోషం! నీ పట్టుదల గొప్పది,
  చిత్తరువులు తీయడం లోనే గాకుండా వ్యాక్యానం లో మంచి పరిచయమున్నాట్లు ఈ చిన్నా ఘటన
  ద్వారా తెలిసింది.ఈ వ్యాపకాన్ని క్రమం తప్పకుండా కొనసాగించు మిత్రమా!

 7. dasaraju ramarao says:

  మిత్రమా భాస్కర్, నాకు తెలిసి నీ కెమెరా కన్ను ఇలాంటి అపురూపాలెన్నో ముద్రించేవుంటున్ది. నేను 2003 లో హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా సభల్లో ఫోటోలు తీస్తుండే వాడివి. నేను కూడా నీ కెమెరా కన్నుకు చిక్కాలనే కోరిక వుండేది.
  ఇది ఇంతటితో ఆపొద్దు. సాహిత్య సమాజంతో నీ అపురూప స్టిల్స్ తో పాటు నీ మిమొరీ ని జోడించు. అభినందనలు…

 8. Macherla Saraiah says:

  Dear Bhaskar, i visited sarangam the online magazine wherein Sri VVR’s family. Photograph taken by you is incorporated as a historical event, there are very good comments over it by our warangal friend sri Buchi Reddy garu and others and my views over your photograph are not limited to few sentences it speaks volumes as I am a close observer of your photography since you handled it. I saw the photo graph of “shrama jeevulu” and “beggers” etc.. taken by you which appeared in news papers. those speak about your tender heart and a human approach.

 9. మెర్సీ మార్గరెట్ says:

  మీ అనుభవాలు మాకు దొరికే మంచి ముత్యాలు. మీరు ఇలాగే మీ అనుభవాలను తెలియజేయండి. అభినందనలు

 10. Bhargavi Jaligama says:

  నమస్కారం సర్!
  అపురూపమైన చిత్రానికి, మీ అనుభవాలు, జ్ఞాపకాలు జోడించి, ఒక
  గొప్ప వ్యక్తి గురించి కాస్తైన తెలుసుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు…

 11. ఫెంటాస్టిక్ సార్

 12. లేటుగా చూసిన . వివి మీద మీకున్న గౌరవం ఫోటో కథనం ద్వారా తెలిసింది .

మీ మాటలు

*