వేటాడే జ్ఞాపకం

varalakshmi

ఎందుకంత అసహనంగా ముఖం పెడతావ్?
కన్నీళ్ళు, జ్ఞాపకాలు, స్మృతులు, చిహ్నాలు
మనుషులకు సహజమే కదా.

ఇప్పుడు నువ్వెంత అసహ్యంగా
కనపడుతున్నావో తెలుసా?

నీకెలా తెలుస్తుంది.
నిన్ను నువ్వెప్పుడూ
చూసుకోవుకదా?
అసలు అద్దమంటేనే
నీకు పడకపోయె

ఒక్కసారి తడి కళ్ళోకైనా చూడు
ఒక్కొక్కరు ఎందుకు స్మృతి చిహ్నాలవుతారో
ఒక్కొక్కరు తమను తాము రద్దుచేసుకొని
సామూహిక గానాలెలా అవుతారో

ఒక్కొక్కరు నిరాయుధంగా
వేలతుపాకుల కనుసన్నల్లో
వసంతాలు విరగబూయిచే
చిరునవ్వులు చిలకరిస్తారో

425301_10151241083875363_829290875_n

ఒక్కొక్కరు చావును ఆలింగనం
చేసుకొని
నూతన మానవ
జననాన్ని కలగంటారో..
ఆ కలలో నువ్వూ
కనపడుతున్నావా!

అందుకేనా అంత కలవరపాటు??

మొండం అంచుకు వేలాడుతున్న శిరస్సు
ఇంకా మాట్లాడుతూనే ఉన్నదా
ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నదా
మాట తూట్లు పొడుస్తున్నదా
మానవత భయం పుట్టిస్తున్నదా
మనుషుల జ్ఞాపకాలు, స్మృతులు, చిహ్నాలు
నీ పాపాలను వేటాడుతున్నాయా??

అలా చూడకు
కోరలు తగిలించుకుని
ఇంకా ఇంకా
అసహ్యంగా కనపడుతున్నావ్

– పి. వరలక్ష్మి

చిత్రం: మందిరా బాధురి

మీ మాటలు

 1. Mercy Margaret says:

  ఒక్కసారి తడి కళ్ళోకైనా చూడు
  ఒక్కొక్కరు ఎందుకు స్మృతి చిహ్నాలవుతారో
  ఒక్కొక్కరు తమను తాము రద్దుచేసుకొని
  సామూహిక గానాలెలా అవుతారో// ఒక్క చరుపు చరిచి అడిగిన ప్రశ్న … మరిచిపోతున్న ఏదో స్పృహను తట్టి లేపినట్టుంది మీ కవిత వరలక్ష్మి గారు ..

 2. prof.raamaa chandramouli says:

  బాగుంది..’.ఒక్కొక్కరు చావును ఆలింగనం చేసుకుని.’
  ..ఈ పాదం బాగుంది.

 3. balasudhakarmouli says:

  jnaapakam meedha – oka adbhuthamyna , gunde vunna kavitha…… mee sphoothiki johaarlu…….

 4. కవిత చాలా బాగుంది వరలక్ష్మి గారు

  ప్రశ్నిస్తూ, ఆవేదన పరుస్తూ, చివరగా మనో వికృతి ని హెచ్చరిస్తూ సాగింది

 5. Adi seshaiah says:

  comrade.. abhinandanalu…

 6. C.V.SURESH says:

  చాలా మ౦చి కవిత! “మొండం అంచుకు వేలాడుతున్న శిరస్సు
  ఇంకా మాట్లాడుతూనే ఉన్నదా
  ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నదా
  మాట తూట్లు పొడుస్తున్నదా
  మానవత భయం పుట్టిస్తున్నదా
  మనుషుల జ్ఞాపకాలు, స్మృతులు, చిహ్నాలు
  నీ పాపాలను వేటాడుతున్నాయా??……………..వికృత చేష్టల రాజ్యపు అరచకాల్ని ప్రశ్నిస్తున్న వైన౦! నిజమే! వాటిని వేటాడక మానవు. అద్భుతమైన కవిత!

 7. ఒక్కొక్కరు చావును ఆలింగనం
  చేసుకొని
  నూతన మానవ
  జననాన్ని కలగంటారో..
  ఆ కలలో నువ్వూ
  కనపడుతున్నావా!

  బాగుంది

 8. c.kaseem says:

  పోయెమ్ రాశావా,బాగుంది. సాంద్రత వుంది.

మీ మాటలు

*