‘ మరో వైపు’ చూద్దామా !

Fall-Leaves

మరో వైపు’ చూపిస్తున్న వంశీకృష్ణ…వచ్చే వారం నుంచి..!

ఇటీవల వచ్చిన ఒక తెలుగు సినిమా లో  ‘చూడు ఒక వైపే చూడు’ అంటూ నందమూరి బాల కృష్ణ తన శత్రువును కండిషన్ చేస్తాడు. ఇవ్వాళ మన తెలుగు సమాజం కూడా అలాగే కండిషన్  అయింది. తన సహజమైన లక్షణాలనీ కోల్పోయి ఒక మూసలో కూరుకు పొతున్నది. సాహిత్యము, సంగీతము ఇతరేతర సృజన  రంగాలన్నీ ఇందుకు మినహాయింపు కాకపోవడము ఒక విషాదం. సామాజిక వర్గాలు,మతాలూ, ప్రాంతాలు, పేరున ఈ కండిషనింగ్ కొనసాగుతూ వస్తున్నది.

ప్రతి అంశానికి సెకండ్, థర్డ్, డైమన్షన్ ఉంటుందనే విషయాలను కూడా మనం కన్వీనియంట్ గా మరచి పోయాము. ఒక కథ చదివినప్పుడో, ఒక కవితను అనుభూతించినప్పుడో మనఃస్పూర్తి గా మెచ్చుకోవడానికి కూడా రకరకాల న్యూనతలు మనలని అడ్డుకుంటున్నాయి. ఈ విష వలయం నుండి మనం ఎంత త్వరగా బయట పడితే మన సామాజిక ఆరోగ్యానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా మన సాహిత్యానికి!

ఈ నేపధ్యం లోనే ‘సారంగ’ సాహిత్య వార పత్రిక లో ‘మరోవైపు‘ శీర్షిక మొదలవుతున్నది. ఈ కాలం లో సాహిత్యం, సినిమా, ప్రభావశీలురు ఐన వ్యక్తుల, సంస్థల ప్రతిభాన్విత సంఘటనలని వాటి వాటి నియమిత అర్ధం లో కాకుండా రెండో వైపు చూసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఒక కధ చదివినప్పుడు అది కలిగించే వాచ్యార్ధాన్ని మాత్రమె కాకుండా మరో అంతర్గత అర్ధాన్ని అంటే లో నారసి చూసే ప్రయత్నం అన్న మాట.
సాహిత్య పత్రికలలో / సాహిత్య పుటలలో ఒక సృజనని సమీక్షించేటప్పుడు సృజన కారుడి వైయక్తిక అంశాలను, బలహీనతలను పక్కన పెట్టి, లేక పట్టించుకోకుండానూ, కేవలం రచన కు మాత్రమే పరిమితమై దాని సారాన్ని, సారాంశాన్ని మాత్రమే  పట్టించుకునే పద్ధతి ఇది. నిజానికి ఇది కొత్త విధానమేమీ కాదు. . పూర్తిగా పాతదే. మళ్లీ కొత్త గా మొదలు పెట్టడం అన్న మాట! అలా అని కళ కోసం కళ అనే పూర్తి సాంప్రదాయక వ్యవహారం కూడా కాదు.  సాహిత్య రాజకీయాలను, సాహిత్య చొరబాట్లను వదిలి స్వచ్చ శుభ్ర సాహిత్య అనుభూతిని పొందటం కోసం  చేసే ప్రయత్నం ఇది.

వంశీకృష్ణ

మీ మాటలు

  1. మీ ప్రయత్నం విజయవతం కావాలని, సాహిత్యానికి కొత్త సొగసులు అద్దాలని ఆశిస్తూ..

  2. శ్రీను says:

    “….ప్రతి అంశానికి సెకండ్, థర్డ్, డైమన్షన్ ఉంటుందనే విషయాలను కూడా మనం కన్వీనియంట్ గా మరచి పోయాము. ఒక కథ చదివినప్పుడో, ఒక కవితను అనుభూతించినప్పుడో మనఃస్పూర్తి గా మెచ్చుకోవడానికి కూడా రకరకాల న్యూనతలు మనలని అడ్డుకుంటున్నాయి. ఈ విష వలయం నుండి మనం ఎంత త్వరగా బయట పడితే మన సామాజిక ఆరోగ్యానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా మన సాహిత్యానికి….”

    చానా బాగ చెప్పారు. ఈ జబ్బు చానా లోతైనది. చానా సంక్లిష్టమైనది. దీన్ని గురించి ఇదివరకు తాడేపల్లిగారు ఒకచోట విపులంగా రాసారు. ప్రస్తుతం ఆ బ్లాగు లభ్యం కావడం లేదు. ఇది రాజకీయ పార్టీల ద్వారా, కులసంఘాల ద్వారా, మహిళాసంఘాలలాంటి రకరకాల గ్రూప్సు ద్వారా బలప్రయోగంతో అమలవుతున్న మెంటాలిటీ. దీన్నుంచి మనకిప్పట్లో విముక్తి లేదేమో. కానీ మీ ఆకాంక్షనీ, ఆశావాదాన్నీ మనసారా అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

మీ మాటలు

*