లోలోపలే…

sree
ఏం తెలుసు?
గది లోపల? మది లోపల?
నువ్వు-నేను నిజం
మిగతా అంతా మిథ్య
ఏం చెబుతావు?
కథలో?
అక్షరాలు కూడదీసుకొని రాసే
కవిత్వంలో?
దుఃఖదాయకమైన జీవితంలోని
కొంచెం వేదన- కొంచెం వర్ణన
గాయపడ్డ కలం ఇది
ఎందుకు శోధిస్తావు?
వెర్రిగా రహస్యాలను..
హృదయాంతరాల
నేలమాళిగల్లో ఛేదించలేని చిక్కుముడులు
రహస్య పావురాలన్నీ ఎగిరిపోయాకా..
ఎదనిండా ఖాళీ.. భర్తీ చేయలేని శూన్యం..
ప్రశాంతతను ఎవరు భగ్నం చేస్తారు?
తరచి తరచి వెతికి వెతికి
తొంగిచూస్తావెందుకు?
ఎవరెవరి లోపలికో..??
నీలో నీవు చూడగల లోతెంత?
నిన్ను నువ్వు వెతుక్కుంటూ
స్ఫురింపజేసే పోలికలెన్ని?
నిధి కోసమైనా..
నీలో నిన్ను దర్శించే
మణి కోసమైనా
స్వీయ అన్వేషణ
జరగాల్సింది లోలోపలే
అంతరంగమే మహాబోధి
దాని చెంతనే
ఆత్మకు జ్ఞానోదయం
చీకటని దాటివచ్చే
తొలి అడుగులకు చిరుదీపం
ఆత్మజానం.. అంతర్ముఖ దర్శనం
‘తమసోమ జ్యోతిర్గమయా’

మీ మాటలు

  1. చాలా అద్బుతంగా ఉంది సోదర శ్రీకాంత్…

  2. మెర్సీ మార్గరెట్ says:

    జరగాల్సింది లోలోపలే
    అంతరంగమే మహాబోధి// అంతరంగ ప్రయాణం బాగుంది తమ్ముడు .

  3. అంతరంగ ప్రయాణమే ఆరంభం తమస్సుని చీల్చుకుని వెలిగే అంతర్ జ్యోతి దర్శనానికి..
    కవిత బాగుంది శ్రీకాంత్ గారు

  4. పద్యం బావుంది శ్రీకాంత్…కీపిట్ అప్

  5. బాగుంది,.మీ శైలికి భిన్నంగా తాత్వికంగా సాగినట్లుంది,…

  6. venkatrao.n says:

    sangam sharanam gachhami annadu buddude.prapanchaanni artham chesukoleni anthrmukham dolla kadha!

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*