మాట పడాలనుకుంటా

393764_176060322482234_16821319_n
మాట పడాలనుకుంటా. మనసున్న మనుషుల్తో. మానవత్వపు కొరడాల్తో.
నిబద్ధత నిప్పుల్తో.
జారుతున్నప్పుడల్లా. జాలంలో చిక్కుకుంటున్నప్పుడల్లా. చీకటి
చీల్చుతున్నప్పుడల్లా. దారి తప్పుతున్నప్పుడల్లా.
ఉండాలొక పెద్దమనిషి, గల్లా పట్టుకోడానికి. గదమాయించడానికి. చెంపలున్నది
ముద్దులు పెట్టడానికి మాత్రమే కాదని చెప్పడానికి.
నీ చావు నిచ్చావుగాను అని శపించడానికి.
అదృష్టంకొద్దీ తుడిపెయ్యడానికి రబ్బర్లుంటాయి. డస్టర్లూ. రిమూవ్
ఆప్షన్లూ.
తప్పుదిద్దుకుని బయల్దేరుతా. తెల్లమొహంతో. కొన్ని తేట పదాల్తో.

మీ మాటలు

 1. Brilliant…

 2. సాయిపద్మ says:

  అదృష్టంకొద్దీ తుడిపెయ్యడానికి రబ్బర్లుంటాయి. డస్టర్లూ. రిమూవ్
  ఆప్షన్లూ.
  తప్పుదిద్దుకుని బయల్దేరుతా. తెల్లమొహంతో. కొన్ని తేట పదాల్తో…. చాలా మంచి కవిత చదివాననుకుంటున్నాను . ఏ సమయంలో ఏ మనిషి మనస్తత్వానికైన అతికినట్టు వొదిగిన చురకత్తి లాంటి కవిత ..!! బావుంది మోహన్ రుషి గారూ

 3. Subrahmanyam Mula says:

  చాలా బావుంది.

 4. రుషి వాక్యాలు.. ఎప్పటిలాగే చురుక్కుమనే ఎండలా.. సుపర్బ్…

 5. స్వాతీ శ్రీపాద says:

  బావుంది ……………ఇంకేం చెప్పాలో తెలిస్తేగా………

  • mohan rushi says:

   కృతజ్ఞతలు…. ఇంకేం చెప్పాలో నాకూ తెలీడం లేదు!

 6. Mercy Margaret says:

  బ్యూటిఫుల్ పోయెమ్ అన్నా… loved it

 7. తప్పుదిద్దుకుని బయల్దేరుతా. తెల్లమొహంతో. కొన్ని తేట పదాల్తో.

 8. Nice expression Sir..

 9. K.WILSONRAO says:

  “మాట పడాలనుకుంటా. మనసున్న మనుషుల్తో. మానవత్వపు కొరడాల్తో.
  నిబద్ధత నిప్పుల్తో.
  జారుతున్నప్పుడల్లా. జాలంలో చిక్కుకుంటున్నప్పుడల్లా. చీకటి
  చీల్చుతున్నప్పుడల్లా. దారి తప్పుతున్నప్పుడల్లా.”

  ఇలా లేకపోతే మనిషి జీవిస్తూ మరనిస్తున్నట్లే లెక్ఖ . మాట పాడటమంటే ప్రతి ఒక్కరికి ప్రానధతువు. పోయెమ్ అద్బుతంగా వుంది రుషి గారు.

 10. D.Venkateswara Rao says:

  మాట పడాలనుకుంటా. మనసున్న మనుషుల్తో. మానవత్వపు కొరడాల్తో.
  నిబద్ధత నిప్పుల్తో. చాలా బాగా ఉంది మీ కవిత.
  నా అభిప్రాయం మీ కవీతమీద….
  జారుతున్నప్పుడల్లా చేయందించే వారుండాలి
  జాలంలో చిక్కుకుంటున్నప్పుడల్లా చిక్కుల్ని విడిపించే వారుండాలి
  చీకటి చీల్చుతున్నప్పుడల్లా వెలుగునిచ్హే వారుండాలి
  దారి తప్పుతున్నప్పుడల్లా మంచి మార్గం చూపించే వారుండాలి .
  మన చెంపలున్నది లెంపలు వెసుకొవడానికి
  మంచి మనసున్నది తప్పులు దిద్దుకుంటూ
  మనిషిగా మనుగడ సాగించడానికి

మీ మాటలు

*