భారతీయ భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథ రెడ్డి

ketu

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయస్థాయి మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతువిశ్వనాధరెడ్డి నియమితులయ్యారు. కౌన్సిల్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆప్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ (సిపిఐఎల్‌)గా పేరొందిన ఈ మండలి రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లో వున్న భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తుంది. మండలి సభ్యునిగా తెలుగు భాష తరఫున ఎంపికైన కేతు విశ్వనాథరెడ్డి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతగా జాతీయస్థాయిలో సుప్రసిద్ధులు. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాలు కొనసాగుతారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి సిఐపిఎల్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జ్ఞానపీఠ్‌, సాహిత్య అకాడమీ అవార్డు పొందినవారు మాత్రమే ఈ మండలిలో సభ్యులుగా నియమితులవుతారు.

మీ మాటలు

 1. buchireddy gangula says:

  రెడ్డి గారు నియామకం కావడం — సంతోషించవలిసిన వి శయం అయినా
  ఎన్ని రాజకీయాలు ?? ఎన్ని కథలు??
  తిరుపతి ప్రపంచ తెలుగు మహా సభల తర్వా త—తెలుగు భాష వాడుక—పెరీగింధీ ఎంత??
  భాషాబీ వృద్ధి—- ధు న్నే వాడికే భూమి—కాంగ్రెస్ పార్టీ ని నాధం లా—కాకుండా
  ఉండాలని ఆశిస్తూ—-గుడ్ లక్– కన్‌గ్ర్యాట్స్ రెడ్డి గారు
  ———————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 2. జయదేవ్ మెట్టుపల్లి says:

  శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి గారు తెలుగు బాషకు గట్టిగా సేవచేయగలరు. వారికి ఆ తపన, ఆసక్తి, శక్తి వున్నాయి.
  కేతు విశ్వనాథ రెడ్డి గారికి అభినందనలు. రాజకీయాలకు అతీతమైనది ఏది లేదు.తెలుగు బాష అంతరించి పోతుంది అనేదే
  ఒక రాజకీయం. రాజకీయ వత్తిళ్ళు ,అనుకూలాలు ఎన్ని వున్నా శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి గారు తన బాధ్యత నెరవేరుస్తారు అనేనమ్మకం నాకుంది
  జయదేవ్ మెట్టుపల్లి
  చికాగో

మీ మాటలు

*