డల్లాస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 4,5,6 వ తేదీలలో జరగబోయే 3 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను పురస్కరించుకొని సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు ఈ క్రింది సాహిత్య అంశాలలో పోటీలు నిర్వహించారు.
- కథలు
- కవితలు
- ఫోటో కవితలు
- ఛందస్సుతో కూడిన పద్యాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది రచయితలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు. ఈ సందర్భముగా ఈ పోటీలలో పాలుపంచుకున్న ఔత్సాహికులైన రచయి(త్రు)తలకు, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీ మిత్రులకు, సాహిత్య కార్యక్రమాల కార్యవర్గ సభ్యులకు, ఈ సాహిత్య పోటీల మరియు నాట్స్ సంబరాల సాహిత్య కార్యక్రమాల సమన్వయ కర్త అనంత్ మల్లవరపు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 5,6 వ తేదిలలో సంబరాలలో భాగంగా జరిగే ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద జ్ఞాపిక బహుమతి ప్రధానం ఉంటుందని తెలియచేశారు.
కథల పోటీల విజేతలు:
మొదటి బహుమతి: రంగ పిన్ని ఆకాశం – సాయి పద్మ (విశాఖపట్టణం)
రెండో బహుమతి: గజల్ – రఘు మందాటి (హైదరాబాద్)
మూడో బహుమతి: గులాబి ముల్లు – విజయ్ ప్రసాద్ కోపల్లె (కర్నూల్)
కవితలపోటీలవిజేతలు:
మొదటి బహుమతి: కొన్ని రోజుల తర్వాత – నాగరాజు అవ్వారి (గిద్దలూర్)
రెండో బహుమతి: ఈ రాత్రి – నిషిగంధ (ఫ్లోరిడా)
మూడో బహుమతి: బాల్యం తిరిగొచ్చింది – ప్రసూన రవీంద్రన్ (హైదరాబాద్)
ఫోటో కవితలపోటీల విజేతలు:
మొదటి బహుమతి: వలని వలచిన వాళ్ళు – కె.వి.వి.డి.రావు (విశాఖపట్టణం)
రెండో బహుమతి: పెద్ద సిక్కే పడిందయ్యా! – ఆర్.దమయంతి (నార్త్ కెరోలినా)
మూడో బహుమతి: ఆశా దీపాలు – వెంకట శాస్త్రి చిలుకూరు (డల్లాస్)
ఛందస్సుతో కూడిన పద్యాలపోటీల విజేతలు:
మొదటి బహుమతి: తెలుగు భాషకు ‘విజయ’ వత్సరం – రామ మోహన్ అందవోలు (హైదరాబాద్)
రెండో బహుమతి: పద్యాలు – గరికిపాటి వెంకట సుబ్బావధాని (విజయవాడ)
మూడో బహుమతి: విశ్వ విజేత – విద్యాసాగర్ అందవోలు (డల్లాస్)
అందరికి అభినందనలు
నాకు తెలిసిన వారి పేర్లు
సాయి పద్మ
నాగరాజు అవ్వారి
నిషిగంధ
వీరికి ప్రత్యేక అభినందనలు
– రఘు మందాటి (హైదరాబాద్) koodaa
సాయి పద్మ, రఘుమందాటి… ఇంకా అక్షర నేస్తాలైన నాట్స్ పోటీ విజేతలందరికీ అభినందనలు
విశ్వవిజేతలందరికీ అభినందనలు !!!
అందరికీ అభినందనలు..
విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న సాహిత్యాభిలాషులకు నా అభినందనలు
విజేతలందరికీ అభినందనలు
విజేతలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు ! అనేక దేశాల నుంచి కథలూ,కవితలూ వచ్చి వుంటాయి కనుక రచనల్లో మంచి వైవిధ్యం ఉంటుందని ఊహిస్తూ వాటిని చదివే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
విజేతలందరికీ అభినందనలు
విజేతలకి అభినందనలు, కార్య నిర్వాహకుల అభిరుచి కి సాహిత్య సేవకి వందనాలు
పద్యాలు, ఫోటొ కవితల పోటీలు కూడా కలిసి నాట్స్ వారి తెలుగుభాషాభిమానాన్ని చెప్పకనే చెప్పాయి. విజేతలకు అభినందనలు.
నారాయణ గరిమెళ్ళ.
ఏ దేశంలో ఉన్నా, ఏమి చేస్తున్నా తల్లి భాషని మరచిపోకుండా ఆ భాషా సంస్కృతుల్ని కాపాడడానికి నాట్స్ చేస్తున్న కృషికి అభినందనలు