ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
బాగా రాసారు సైఫ్ గారు
చీకటి ఇంకా నల్ల బుర్ఖా వేస్తూనే ఉంది
దానికోసమే మిణుగురులు రోజంతా ఎక్కడో పడుకుంటున్నాయ్.
– – –
ఇంకా గులాబి కొమ్మలకు ముళ్ళు పుడుతూనే ఉన్నాయ్ .
ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్ .
——
వర్షం వస్తే ప్రతి గోడ తడుస్తూనే ఉంది .
జలుబు కు ఇప్పుడు కూడా ఏదో ఒకటి మందు దొరుకుతూనే ఉంది
సూపర్బ్ సైఫ్ జీ
షుక్రియ జి :)
వంటవాడే మొదట రుచి చూస్తున్నాడు
పంటలేసినవాడే కోసేస్తున్నాడు
ధర్మ ప్రచారం బాగానే జరుగుతుంది
గడియారం తన ముళ్ళను తిప్పుతూనే ఉంది
ఈ బేషరం అన్నీ చూస్తున్నాడు.. గాలిబ్ .. ఇది గుఫ్తగూ కన్నా ఎక్ జిందా దిల్ షాయర్ కీ సునేహరీ ధడకన్ లా ఉంది .. ఎక్కువ చదవకూడదు బాబోయ్ .. నిజమైన బేషరం అయిపోతాం .. బహుత్ ఖూబ్ సైఫ్ భాయి .. జలుబుకి మందంత ఖూబ్ ..
ఎక్కువ చదవకూడదు బాబోయ్… నిజమైన బేషరం ఐపోతాం
హహహహ
నా కవితల గురించి చాలా చాలా కాలానికి
మళ్ళీ ఈ వాక్యం విన్నాను
సచ్ హై .
అఫ్సర్ భాయ్ కు షుక్రియ చాలా కాలానికి ఓ పత్రికకు రాయాలి అనిపించింది
బేషరం: నువ్వు రెండు పాదాలతో వస్తావో, పది పాదాలతో వస్తావో…వచ్చినప్పుడల్లా గుండెంత ప్రేమని తీసుకొస్తావ్…గుప్పెడు అక్షరాల్లో కొండంత భావాన్ని తుపానులా దాచుకోస్తావ్…రాయరా బాబూ…రాయ్…ఇలాగే రాయ్..
ముఖ్యంగా ఈ లైన్లు కేవలం నావి…నా కోసమే నువ్వు రాసినవి…అవునా?
నీ గాయాల వారసత్వం కొనసాగుతూనే ఉంది
ఇంకా గులాబి కొమ్మలకు ముళ్ళు పుడుతూనే ఉన్నాయ్ .
ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్ .
నువ్వు లేవు అంతే ,మనుషులేం మారలేదు
అఫ్సర్ భాయ్
నిస్సందేహంగా
చాలా కాలం తరువాతా
ఇది మాత్రం మీ కోసమే
మీరే రాయించారు
నేను మీకెంతో షుక్రియాలు చెప్పుకోవాలి
షుక్రియాలు అంటే దువాలు
దువాలు అంటే శుభాలు కోరుకోవడం
ఆమీన్
ఇన్షాల్లాహ్
కొత్త చిగుర్ల గురించి రాస్తుంటాను .
పోయెమ్ భలే ఉంది! చాలా నచ్చింది.
“ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్.” నచ్చింది.
Gorey Saif Ali,
ఇది చాలా అపురూపమైన రచన. అద్భుతంగా ఉందనడం కూడా Understatement.
నా హృదయపూర్వక అభినందనలు.
సలాం –అలీ గారు
పోయెమ్ బ్రహ్మాండం గా ఉంది –సర్
ఈ మధ్యకాలంలో నేను ఇష్టపడిన కవితల్లో గొప్పకవిత ఇదేనేమో,..చాలాచాలా బాగుంది,..కొద్దిగా ఖాదర్ మోహిద్దిన్ గారి నేను – నా దేవుడు ఛాయలు కనిపిస్తున్నప్పటికి,..
భేషరం..అధ్బుతం.
మూర్తి గారితో గొంతు కలుపుతున్నా. ‘అద్భుతంగా ఉందనడం Understatement
Each line is a fine stroy ….very sensitive one…and truly good one !
Excellente! Saif bhai.
saif జీ, చాలా అద్భుతమైన కవిత. ఈ కవితకు అఫ్సర్ గారి కామెంటు మరో అలంకారం.
చాలా బాగుంది భయ్యా