జలతారు స్ఖలితాలు

 

1.

కొన్ని నగ్నత్వాలని ఇక్కడ పర్చలేను

అసలొ, సిసలో, మనసో, మర్మమో!!

అప్పటికీ ఆమె అంటూనే ఉంది

కవిత్వం నోరువిప్పాలంటే భాషా, భావమనె

బట్టలు కట్టకు….

’నిన్ను నిలబెట్టు, గుండెని ధైర్యంతో,

ఆలోచనల్ని మనిషత్వంతో నింప’మని….

సిసలు కవిత్వమొస్తుందటగా?

2.

ఆమె అలా అంటూన్నంతసేపూ

బైలీస్‌ని తియ్యగా దింపుతుంటాను గుండెల్లోకి….

ఎక్కడో దూరంగా క్యాసీ పాట ‘”Me & U!” మంద్రంగా!

“నువ్వూ నేనూ ఇక కలవాలి కదా” అన్న క్యాసీ పాట

మమ్మల్ని దగ్గరచేసింది శరీరంలో….

3.

వయసిచ్చిన సిగ్గు ఆచ్చాదన ఒళ్ళుమాలినతనం

అది కాస్తా తప్పుకున్నాక ఇక రాయటం సులువె

అప్పుడే–

కొన్ని ఆమె నడుం మడతలపై

మరికొన్ని ఆమె స్త్రీత్వపు ముడతలపైనా రాసాను

అక్షరాలని ఆమె అందంలొ ముంచుతానంటే కాదనదు!

4.

కొన్ని నగ్నత్వాలని ఇక్కడ ఏమార్చలేను

’మనసు స్ఖలిస్తున్నప్పుడు

ఇద్దరం ఒకటే కద’ అని ఆమె అన్నప్పుడు

ఇన్ఫిరియారిటీని కప్పేసేలా…

గొంతు నొక్కేశాను! నా చేష్టలతో!

నా స్ఖలనాన్ని ఆమె మనసారా తీస్కోవాలిగా!

‘నువ్వెలాగూ నిట్టూరుస్తావు ఆ కాస్త ఎంగిలిముద్దయ్యాకా’

5.

నేనూ అప్పుడప్పుడు మోనాలిసాలా నవ్వాలి!

అసలు స్ఖలించనప్పుడూ ఇద్దరం ఒకటే….

6.

ఆమె నన్ను చదువుతూందొ, చూస్తుందో

విద్యుత్  తరంగం మెదడులో తిరుగాడుతుంటూంది

ఎక్కడ స్థిరపడాలో తెలీకన్నట్టు!

 

అప్పుడే అంది

‘ఇది న్యాయమా?’ అని

నా స్పందనలు ఆమెకి తెలియనవికావు

‘అస్ఖలితం ఆడదానికి శాపమా?’

నా చపలచిత్తాన్ని తనగుప్పిట బంధించి మరీ

అడుగుతున్నట్టుంది….

‘కానేరదు, అది ప్రకృతివరమనుకోవచ్చేమొ!’ గొంతుపెగుల్చుకున్నాను

‘ఔనా! ఆఖరికి ప్రకృతికి కూడా పురుషుడే ప్రేమాధిక్యమా?’

ఆమె అలిగినట్టుంది….

7.

‘ఏమో! చెట్టూ చేమని అడిగి చెప్పలేను కానీ

నాకెప్పుడూ ప్రకృతీ, స్త్రీ ఒకటే అన్న భావం’

అప్పుడె ఆమె నన్ను మనసుతో కౌగలించుకుంది

ఇదెక్కడా దొరకదు మరి…

8.

ఈ రెండక్షరాల గూడుపుఠాణి ఆమెకి తెలియందికాదు….

ఆమె తృళ్ళిపడినప్పుడల్లా

పట్టుకోడానికి నేనున్నానన్న నా చేతులు

ఓ సర్జన్ లా మారతాయేమొ!

ఆమెకి తనమనసంత ఇష్టం అది….

వశం తప్పిన ఆ కొద్ది క్షణాలూ చరిత్రలో కలిపేయమంది..

మరెవరితో పంచుకోకూడదు……అసూయత్వం!

9.

“ఔనూ, నువ్వూ నేనూ కలవాలి

ఈ క్షణాన్ని విస్ఫోటనం చేస్తూ

ఈ స్ఖలనాన్ని ఆమోదం చేస్తూ….”

 

మనసు మెత్తదనమంతా గుండెల్లోకి తెస్తుంది

అర్పిస్తూ ప్రేమని నిర్వచించమంటాది…

అప్పటికప్పుడు నేనేం చెయ్యలేనని ఆమెకీ తెల్సు

అందుకే ఓ మెట్టు దిగొచ్చిమరీ, అడుగుతూ….

“ప్రేమ తెల్సిందా” అని!

అది కవ్వింపో, సవాలొ!

10.

“నన్ను మాట్లాడనీ, మనసారా

నిన్నూ ప్రేమనీ కలిపేసి మరీ

బంధించుకుంటానన్న” ఆమె ప్రతిపాదనేదీ తప్పుకాదు

ఆ ప్రేమ ఓ జడివానలా కురుస్తుందన్నది ఎరుకే

11.

ఏ నగ్నత్వాలనీ ఇక్కడ పర్చలేనెమొ

అప్పుడే ఓ వెరపు నాలో

ఆమెని ’అక్కడ’కి తీసుకెళ్ళాక నేనోడిపోతానన్న గుబులు

ఆమె పొందులో ఒగ్గిపోతానని ఆమెకీ తెల్సు

అదీ ప్రేమేనేమో!!

ఆమె నాదే..ఎప్పటికీ నాదే

ప్రేమ సాక్షిగా నాదే

ఆమె నా సొంతం, ప్రేమంత సొంతం..

ఆమె ఊరుకుంటుందా

మన:స్ఖలనాలని హర్షిస్తూంటూంది

నన్ను చుట్టేసింది……ప్రేమని చుట్టేసానన్న భ్రాంతిలో!

 

 

మీ మాటలు

 1. కొన్ని నగ్నత్వల్నిక్కడ పరుచాలేను అంటూనే అన్ని పరిచేసారు గుడ్

 2. ఆమె ఊరుకుంటుందా

  మన:స్ఖలనాలని హర్షిస్తూంటూంది

  నన్ను చుట్టేసింది……ప్రేమని చుట్టేసానన్న భ్రాంతిలో!.. :) :)

 3. లింగారెడ్డిగారూ ధన్యోస్మి.

 4. పద్యం బావుంది వాసుదేవ్ గారు

 5. వాసుదేవ్ గారు,

  కవిత చాలా బాగుంది. కొత్తగానూ ఉంది. “ఒక ‘ఆర్గా’నిజపు స్వగతం…”, “జలతారు స్ఖలితాలు” ఈ రెండు వాద ప్రతివాద కవితలా?

  -రవి

  • ఔనండి ….ఒకె విషయాన్ని విభిన్నకోణాల్లొ వేర్వేరు వ్యక్తులు రాయటమనే ప్రయోగం ఇది. ఈ ఆలొచన కార్యరూపం దాల్చటంలొ సాయిపద్మ గారి సహకారానికి కృతజ్ఞతలు. కవితచదివి ఆస్వాదించిమరీ మీ అభిప్రాయాన్ని రాసీనందుకు మీకునూ ధన్యవాదాలు రవీ.

 6. రెండు దేహాలు ఒక ఆత్మ కలయికను నగ్నంగా పరిచే ప్రయత్నం బాగుంది సార్. మీ ప్రయోగం విజయవంతమయినందుకు అభినందనలతో..

 7. వర్మాజీ ధన్యవాదాలు..

మీ మాటలు

*