‘సారంగ’ వెబ్ వార పత్రిక ముఖ్య లక్ష్యం ఉత్తమ స్థాయి సాహిత్యాన్ని ప్రచురించడం, ప్రోత్సహించడం!
మీ రచన పంపే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేసుకోండి. మీరు రచన పంపిన వెంటనే మేము ఆ రచనని పీర్ రెవ్యూకి పంపిస్తాం. కొన్ని సూచనలు ఇస్తాం. ఆ సూచనల మేరకు మీరు మీ రచనని తిరిగి మార్చవలసి వుంటుంది. కాబట్టి, మార్పులూ చేర్పులకు మీరు సిద్ధంగా వుండండి.
అలాగే, ‘సారంగ’లో ప్రచురితమయిన ప్రతి రచన పైనా మీరు కేవలం ప్రశంసలే కాదు, సునిశితమయిన/ అర్థవంతమయిన విమర్శ కూడా చేయండి.
రచనలు పంపే పద్ధతి:
‘సారంగ’ కోసం మీ రచనలు యూనికోడ్ లో టైప్ చేసి editor@saarangabooks.com ఈమెయిలుకు పంపగలరు. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా కూడా పంపవచ్చు.
మరికొన్ని ముఖ్య గమనికలు:
- గతంలో ప్రచురించబడిన, లేదా వేరే పత్రికలలో ప్రస్తుతం ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు ప్రచురణకి స్వీకరించబడవు.
- స్వంత బ్లాగులలోగాని వెబ్ పత్రికలలోగాని ప్రచురించబడిన రచనలు కూడా ప్రచురించబడవు.
- రచనలు తమ స్వంతమనీ, గతంలో ఎక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేవనీ రచయితలు హామీ పత్రం ఇవ్వాలి.
- రచనలను ప్రచురణకు స్వీకరించే విషయంలో తుది నిర్ణయం ‘సారంగ’దే!
- ‘సారంగ’లో ప్రచురించబడిన రచనలను రచయితలు ఒక వారం తర్వాత తమ స్వంత బ్లాగులలో ప్రచురించుకోవచ్చు.
- ‘సారంగ’లో ప్రచురించిన రచనలు/వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఆయా రచయితలవే కాని ‘సారంగ’వి కాదు. ఆయా రచనలపై పాఠకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయాలే కాని అందులో ‘సారంగ’కి ఎటువంటి సంబంధము లేదు.
తాజా కామెంట్లు